4, జులై 2024, గురువారం

గత ప్రభుత్వ వైఫల్యాల మీద ననిల తీసిన సభ్యులు

సమాధానం ఇవ్వలేక నీళ్లు నములిన జిల్లా అధికారులు 

తాగనీరు, డ్రైనేజీ, వీధి దీపాలకు మొదటి ప్రాధాన్యత 

చెరువులలో ఆక్రమణలను తొలగించాలి 

గుంతల రోడ్లను మరమ్మతు చేయాలి 

వాడిగా వేడిగా జిల్లా పరిషత్ సాయి సంఘ సమావేశాలు 

చిత్తూరు, జులై 3 (ప్రభ న్యూస్ బ్యూరో): చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు వాడే వాడిగా వేడిగా జరిగాయి. గత ప్రభుత్వ వైఫల్యాలు మీద తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గళమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారంటూ నిలతీశారు. మూకమ్మడిగా టిడిపి శాసనసభ్యులు గత ప్రభుత్వ వైఫల్యాలు మీద దాడి చేయడంతో అధికారులు సమాధానం చెప్పలేక మౌనం వహించే పరిస్థితి ఏర్పడింది. 

నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు బుధవారం చిత్తూరులో జరిగాయి. మొట్టమొదటి అధికారిక సమావేశం కావడంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టిడిపి కార్యాలయానికి వెళ్లి, ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి అక్కడి నుండి జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. చిత్తూరు ఎం ఎల్ ఏ గురజాల జగన్మోహన్ నాయుడు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, గంగాధర నెల్లూరు శాసనసభ్యులు ఎం వి థామస్  కలిసి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చారు. సమావేశం ప్రారంభం నుంచి శాసనసభ్యులు ఒకరు మార్చితే మరొకరు ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రభుత్వ అధికారులను నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక అధికారులు మౌనం వహించే పరిస్థితి ఏర్పడింది. చాలా ప్రశ్నలకు నోట్ చేసుకున్నాము, తర్వాత సమాధానం చెప్తాము అంటూ సమాధానాలను దాటవేసే ప్రయత్నం చేశారు. జిల్లా పరిషత్ సమావేశాలలో పాల్గొనడానికి విచ్చేసిన శాసనసభ్యులకు తొలుత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గోవింద శ్రీనివాసులు పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ పథకాలు మీద సమీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్ని పనులు  పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని పనులు ఎన్నికలకు ముందు రద్దుచేశారో తెలియజేయాలని కోరారు. తుడా నిధులతో చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్లు పనులు చేస్తుంటే ఎలా అనుమతించాలని అడిగారు.  రోడ్లకు, సచివాలయ భవనాలకు ఒక నేత పేరు పెట్టుకుంటే ఎలా అనుమతించాలని ప్రశ్నించారు. తెలుగు గంగ ద్వారా చంద్రగిరి మండలానికి తాగునీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పాకాల ,దామలచెరువు, చిన్నగొట్టిగల్లు ప్రాంతాలలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నపుడు కాంట్రాక్టర్లకు నిధులు ఎలా ఇచ్చారని నిలతిశారు. పంచాయతీ కార్యాలయాల్లో శిలాఫలకాలు మీద వ్యక్తిగతంగా పేర్లు వేసుకోవడం, భవనాలకు, రోడ్లకు వారి పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తుమ్మలగుంట చెరువును పార్కుగా మార్చడం పట్ల నాని తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకొని పనులను నిలుపుదల చేయాలని కోరారు. ఇందుకు అనుమతి ఇచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రజల ఇళ్ల మధ్యలో ట్రాన్స్ఫర్లు ఉన్నాయని వాటిని మార్చాలని కోరారు.  

గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ కక్ష్య పూరిత రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదని, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చామన్నారు. చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేసి జిల్లా ప్రజలకు మేలు చేయాల్సిందిగా కోరారు. కార్వేటి నగర్,  పెనుమూరులో 50 పడకల ఆసుపత్రి పునాదులకే పరిమితమైందన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ ట్యాంకులను క్లీన్ చేయడం లేదని, తద్వారా కలుషిత నీరు తాగి, ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారని ఆవేదన చెందారు. మామిడికి గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఎన్టీఆర్ జలాశయం నుంచి 33 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం నత్తనడక నడుస్తుందని, వెంటనే ఈ పనులను పూర్తి చేయాలన్నారు. వీరగ  నెల్లూరు చెరువు సగం పూర్తయిందని ఆ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కృష్ణాపురం రిజర్వాయర్ కు అర కిలోమీటర్ పక్కనే 85 కోట్ల రూపాయలతో మరో రిజర్వాయర్ ను ప్రతిపాదించారని, ఇది ఎవరి కోసం చేశారని నిలతీశారు. ఆ ప్రతిపాదన రద్దు చేసి, ఆ నిధులతో వేరే చోట రిజర్వాయర్లను నిర్మించాలని కోరారు.  కృష్ణాపురం రిజర్వాయర్ కు కనీస నిర్వహణ కూడా లేదన్నారు. 

చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో జిల్లాలో ఎక్కడ రోడ్లు వేయలేదన్నారు. డ్రైనేజీ సౌకర్యాలు లేవని, వీధి దీపాలు వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాటర్ ట్యాంకులకు బ్లూ కలర్ వేశారని, వాటిని తొలగించి పసుపు రంగు వేయాల్సిందిగా కోరారు. వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేసి రక్షిత మంచినీటిని ప్రజలకు పెద్ద చేయాలన్నారు.  నియోజకవర్గంలో నాలుగు చెరువుల మరమ్మతుల బిల్లులను ఐదు సంవత్సరాలైనా ఇంకా ఎందుకు చెల్లించలేదని నితిశారు. వెంటనే ఎవ్వలన్నారు. ఎక్స్ప్రెస్ హైవే లో తవ్విన మట్టిని చెరువులలో వేస్తున్నారని అలా వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ కమ్యూనిటీస్ శానిటేషన్ కాంప్లెక్స్ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధం కనిపించని లేదని, అన్నిపంచయతిల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. 70 శాతం గ్రామాలలో రక్షిత మంచినీరు సరఫరా చేయడం లేదని, జిల్లాలో తాగునీటి సమస్య లేని పంచాయితీ లేదన్నారు. డబ్బులు ఖర్చు చేస్తున్న సమస్య లేకుండా చూడ్డంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇరిగేషన్ పథకాలు కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఒక ఎకరం కూడా అదనంగా సాగులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. తాగి నీటి ట్యాంకులను శుబ్రం చేసి, ఆ ఫోటోలు తెప్పించుకోవాలని  సూచించారు. అన్ని ట్యాంకులను శుబ్రం చేయాలనీ, జీర్ణావస్థలో లో ఉన్న వాటిని తిరిగి నిర్మించాలని కోరారు.  పరిషత్ సమావేశానికి చైర్మన్ గోవింద శ్రీనివాసులు అధ్యక్షుడుగా సీఈవో గ్లోరియా జడ్పిటిసి సభ్యులు పాల్గొన్నారు

పో రై గంగ 1 జడ్పి స్థాయి సంఘాల సమావేశాలో మాట్లాడుతున్న చైర్మన్ గోవింద శ్రీనివాసులు 

గంగ 2 నూతన ఎం ఎల్ ఏ లను సన్మానిస్తున్న జడ్పి చైర్మన్

గంగ 3 సమావేశంలో పాల్గొన్న ఎం ఎల్ ఏ లు, జడ్ పి టి సి సభ్యులు 

గంగ 4 పులివర్తి నాని 

గంగ 5 జగన్మోహన్ నాయుడు 

గంగ 6 మురళీమోహన్

గంగ 7 ఎం వి థామస్ 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *