5, జులై 2024, శుక్రవారం

దమనీయస్థితిలో మామిడి రైతులు


రైతుల వద్ద మామిడిని తీసుకోని ఫ్యాక్టరీలు 

మండిలకు తోలుతున్న రైతులు 

మండిలలో  టన్ను రూ. 19 వేలు 

తిరిగి రూ. 22 కు ఫ్యాక్టరీలకు సరఫరా 

జిల్లా కలెక్టర్ ఆదేశాలు భేఖతార్ 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ధమనీయంగా మారింది. కోసిన మామిడి కాయలను ఫ్యాక్టరీలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. జిల్లాలో 31 గుజ్జు ఫ్యాక్టరీలు ఉండగా ఇప్పకే 13 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మిగిలిన ఫ్యాక్టరీలు కూడా రైతుల మామిడిని తీసుకోవడంలేదు. టన్నుకు 20 రూపాయలు చెల్లిస్తామని, ఎక్కువ ఎవ్వలేమంటున్నారు. కొన్ని ఫ్యాక్టరీలు రైతుల మామిడిని లోనికి రానివ్వడం లేదు. సేజన్ ముగియడంతో కాయలు మాగి, కిందపడుతున్నాయి. ఈ పరిస్థితిలో ఎం చేయాలో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు.


గత నెల 30న నూతన జిల్లా కలెక్టర్ మామిడి రైతులు, ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం నిర్వహించారు. టన్నుకు 24 వేల రూపాయలు ఇవ్వాలని ఫ్యాక్టరీ యజమానులను కోరారు. మూడవ తేదిన మళ్ళి ధరను నిర్ణయిస్తామని అన్నారు. రెండు రోజులపాటు 24 వేల రూపాయలు చెల్లించిన ఫ్యాక్టరీలు తర్వాత ఉన్నఫలంగా 20 రూపాయల వరకు ధరను తగ్గించారు. పలు ఫ్యాక్టరీలు రైతుల నుండి వస్తున్న మామిడికాయలను తీసుకోవడం లేదు. రైతుల విధిలేకుండా వర్తకులకు కిలో 19 రూపాయలతో విక్రయిస్తున్నారు. ఆ కాయలను వర్తకులు తిరిగి ఫ్యాక్టరీలకు 22 రూపాయలతో సరఫరా చేస్తున్నారు. రైతులకు 24 రూపాయలు చెల్లించాల్సి ఉన్నందున ఫ్యాక్టరీలు చాలా వరకు రైతులు తీసుకెళ్లిన మామిడికాయలను నిరాకరిస్తున్నాయి. మామిడి క్రషింగ్ నిలుపుదల చేశామని, ఈ సంవత్సరం ఇక మామిడికాయలు తీసుకోవడం లేదని చెబుతున్నాయి. ఈ మేరకు నోటీసు బోర్డులను కూడా అంటించారు. జిల్లాలో 31 మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉండగా 13 ఫ్యాక్టరీలు బుధవారంతో మామిడి కొనుగోలు నిలుపుదల చేశాయి. దీంతో రైతులు దిక్కుతోచక మార్కెట్ యార్డులకు వెళ్లి వ్యాపారస్తులకు విక్రయిస్తున్నారు. కోసిన కాయలను అటు ఫ్యాక్టరీలు తీసుకోకపోవడంతో రైతులు వర్తకులకు తప్పనిసరి పరిస్థితులలో విక్రయిస్తున్నారు. వ్యాపారస్తులు ఇదే అదునుగా లాభాలను చేసుకుంటున్నారు. టన్ను కాయలను 19 రూపాయల వంతున కొనుగోలు చేస్తున్నారు. నూతన జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించటం పునీత్ కుమార్ గత నెల 30వ తేదీన ఈ విషయమై మామిడి రైతులతో సమావేశంమైనపుడు, మూడవ తారీఖున మళ్ళి సమావేశమై ధరను నిర్ణయిస్తామని తెలిపారు. అయితే ఒకటి, రెండు  తేదీల్లో మాత్రమే 24 రూపాయల కిలోకి చెల్లించిన మామిడి ఫ్యాక్టరీలు తర్వాత మూడవ తారీఖునభారీగా తగ్గించారు. మూడవ తేదిన మామిడి రైతుల, ఫ్యాక్టరీ యజమానుల సమావేశం జరగలేదు. దీంతో తదుపరి మద్దతు ధర నిర్ణయించే అవకాశం రాలేదు. సమావేశం జరగకపోవడంతో కొంతమంది రైతులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిశారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న బాధలను వివరించారు. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు మామిడికాయలను తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ తనను కలిసిన మామిడి రైతుల వద్ద ఉన్న కాయల వివరాలను తీసుకొని వాటిని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారుగా ఇంకా పదివేల టన్నుల వరకు మామిడి ఉందని తెలుస్తోంది. సాధారణంగా సీజన్ ముగింపులో మామిడి ధరలు పెరగడం ఆనవాయితీ. చివరలో 50 నుంచి 70 రూపాయలు మామిడి పలుకుతుంది. దీంతో ధరల పెరుగుతాయన్న ఆశతో రైతులు మామిడి కోయకుండా వేచి చూస్తున్నారు. ధర 30 రూపాయల నుంచి 24 రూపాయలకు తగ్గడం, మళ్లీ ఆ ధర 19 రూపాయలకు తగ్గడంతో జిల్లాలోని రైతులు తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారు. జిల్లా అధికారులు కలగజేసుకుని  ఉన్న మామిడికాయలను ఫ్యాక్టరీలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మామిడి రైతుకు 24 రూపాయలు గిట్టుబాటు ధరగా  లభించే విధంగా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *