సస్పెన్షన్ రద్దు చేసి, పించన్ ఇవ్వండి
జిల్లా పరిషత్ సిఇఓకు ప్రభాకర్ రెడ్డి లేఖ
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
తన సస్పెన్షన్ ఎత్తివేసి తనకు పెన్షన్, ఇతర పదవి విరమణ సదుపాయాలను కలగజేయాల్సితగా జిల్లా పరిషత్ మాజీ సీఈవో, బైరెడ్డిపల్లి ఎంపీడీవో గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ సీఈఓ కు ఒక లేఖను రాశారు. ఆ లేఖను జిల్లా పరిషత్ సీఈవో పంచాయతీరాజ్ అధికారులకు పంపారు.
చిత్తూరు జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అవినీతి అరోపణల మీద గత నెల 28న సస్పెండ్ చేసింది. ఆయన జిల్లా పరిషత్ సీఈవోగా ఉంది ఎన్నికల సమయంలో మైనార్టీ కార్పొరేషన్ ఈడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జోగ్యం చేసుకొని ప్రభాకర్ రెడ్డిని ఆ పోస్టునుంచి రిలీవ్ చేశారు. దీంతో ఆయన గత నెల 14వ తేదీ నుండి 29వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఈ మేరకు లేఖను జిల్లా పరిషత్ సీఈఓకు, జిల్లా కలెక్టర్ కు, బైరెడ్డిపల్లి ఎంపీడీవోకు అందజేశారు. ఈలోపు ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన మీద విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ, అనుమతి లేకుండా జిల్లా కేంద్రాన్ని మొదటి వెళ్లకకూడదని ఆదేశించింది. అయితే, సస్పెన్షన్ ఆదేశాలు అందచేయడానికి కూడా అయన జిల్లా పరిషత్ అధికారులకు ఆయన అందుబాటులోకి రాలేదు. సస్పెన్షన్ ఆర్డర్ ను అందజేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పోస్టులో ఆయన నివాసానికి, ఆయన స్వగ్రామానికి పంపారు. అవి తిరిగి రావడంతో సస్పెన్షన్ నోటీసును ఇంటి గోడకు అంటించారు. గత నెల 29 వరకు సెలవు పెట్టిన ప్రభాకర్ రెడ్డి, మరో రోజు సెలవు పొడిగించారు. అదే రోజు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. పదవి విరమణ చేయడానికి వీలులేకుండా ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. ఇప్పటివరకు ఆయన సస్పెండ్స్ ఆదేశాలను అందుకోలేదు. అధికారులు ఫోన్ ద్వారా పంపారు. దీంతో తన సస్పెన్షన్ ఎత్తివేసి, పదవి విరమణను ఆమోదించాల్సిందిగా కోరుతు లేఖ పంపారు. తనకు రావలసిన పింఛన్ ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను అందజేయాలని కోరారు. తనకు వెన్నుపూస నొప్పి, జ్వరం కారణంగా హాస్పిటల్ లో చేరనంటు, ఆసుపత్రి బిల్లులు, వైద్యం వివరాలు జత చేశారు. ప్రభాకర్ రెడ్డి తాను జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేస్తున్న సమయంలోనే పెన్షన్ ప్రతిపాదనలను రాష్ట్ర కార్యాలయాన్ని పంపినట్టు సమాచారం. అయితే ఆయన మీద పలు ఆరోపణలు ఉండడం కారణంగా ఆ ప్రతిపాదనలను పంచాయతీరాజ్ అధికారులు ఆమోదించలేదు. దీంతో పింఛన్ ఇతర ప్రయోజనాలను పెండింగ్ లో పెట్టారు. వీటిని పొందడానికి ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ కు లేఖ రాశారు.