సంకేతిక కారణాలతో ఆగిన కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్
మంజూరైన పోస్టులకంటే, ఎక్కువ మంది అధ్యాపకులు
కళాశాలలను మంజూరు చేసి, పోస్టులను మంజూరు చేయని ప్రభుత్వాలు
పోస్టులకు, అధ్యాపకులకు పొంతన లేక ఆగిన రెగ్యులరైజేషన్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయడానికి సాంకేతిక కారణాలు అడ్డుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాలు కొత్తగా కళాశాలను ప్రారంభించినప్పుడు ఒక ప్రిన్సిపాల్ పోస్టును మాత్రమే మంజూరు చేస్తున్నారు. అధ్యాపకుల పోస్టులను, నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేయడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన పోస్టులకు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల సంఖ్యకు పొంతనలేదని తెలుస్తోంది. ఫలితంగా కాంటాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ చివరి నిమిషంలో ఆగినట్లు తెలుస్తోంది. కాంటాక్ట్ లెక్చరర్లకు రెగ్యులరైజేషన్ కాకపోగా, కనీసం రెన్యువల్ కూడా చేయకపోవడంతో వారి పరిస్థితి ధమనీయంగా మారింది.
రాష్ట్రంలో 740 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నాయి. వీటిలో రెగ్యులర్ అధ్యాపకులు 1200 మాత్రమే ఉన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు 3,629 మంది పనిచేస్తున్నారు. అంటే 67 శాతం మంది కాంట్రాక్టర్ అధ్యాపకులే విద్యాబోధన చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఇందులో కేవలం 81 మంది మాత్రం రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. 282 మంది కాంట్రాక్టు అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రాళ్ళబుదుగూరు, మల్లానూరు, పలమనేరు గర్ల్స్ జూనియర్ కళాశాల, ఎన్ ఆర్ పేట, నగిరి బాలికల జూనియర్ కళాశాలలలో ఆ కళాశాల ప్రారంభం అప్పుడు ఒక ప్రిన్సిపల్ పోస్టులను మాత్రం మంజూరు చేశారు. కానీ బోధన సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని మంజూరు చేయలేదు. దీంతో మంజూరైన పోస్టులకు పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యకు తేడాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా వారిని కలిసి తమను రెగ్యులర్ చేయాలని విన్నవించుకున్నారు. దీంతో అప్పట్లో జగన్ సానుకూలంగా స్పందించినా, ముఖ్యమంత్రి అయిన నాలుగు సంవత్సరాల వరకు కూడా వారిని రెగ్యులర్ చేసే పరిస్థితి కనిపించలేదు. దీంతో 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. పలుమార్లు ప్రభుత్వాన్ని కలవడం, ఆందోళన చేయడంతో ఎట్టికేలకు జగన్ ప్రభుత్వం వారిని రెగ్యులరైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకుం.ది ఈ మేరకు మంత్రివర్గంలో తీర్మాణాన్ని ఆమోదించి, అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయింది. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 740 జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్, రెగ్యులర్ అధ్యాపకులు కలిసి 4,829 మంది పనిచేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలలకు సుమారుగా 4 వేల పోస్టులు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన ఎనిమిది వందల పైచిలుకు పోస్టులను మంజూరు చేయకనే, ఆ పోస్టులలో కాంటాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక కళాశాల ప్రారంభించడానికి ప్రారంభించే ముందు ఒక ప్రిన్సిపల్ పోస్టును మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఒక కళాశాల నడవాలంటే 10 నుంచి 15 మంది అధ్యాపకుల అవసరమవుతుంది. జూనియర్ కళాశాలలో సిఇసి, హెచ్సిఇ, బైపిసి, ఎంపీసీ కోర్సులకు బోధనకు పది నుండి 15 మంది అధ్యాపకుల అవసరమవుతారు. ఈ గ్రూపులో పాటు వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే కళాశాల ప్రారంభంలో ప్రిన్సిపల్ పోస్టులు మాత్రం మంజూరు చేసిన ప్రభుత్వాలు, తర్వాత అధ్యాపకులు, నాన్ సీటింగ్ స్టాఫ్ సిబ్బందిని పోస్టులను మంజూరు చేయడం లేదు. దీంతో వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బందికి మంజూరు చేసిన పోస్టులకు తేడా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పోస్టులు మంజూరు చేయకుండానే ఆ పోస్టులలో వారిని ఎలా రెగ్యులర్ చేయాలని ప్రశ్నా ఉత్పన్నమయింది. దీంతో అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ కాంటాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అప్పటి మాత్రమే బోత్స సత్యనారాయణ ను కాంట్రాక్టర్ అధ్యాపకులు కలవగా 'తొందర ఎందుకు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. రాగానే రెగ్యులర్ చేస్తాం. అన్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం రావటంతో కాంట్రాక్టు అధ్యాపకుల కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. కొత్త ప్రభుత్వం నిధుల కొరతతో సతమతమవుతుంది. వీరిని రెగ్యులర్ చేస్తే ఒక్కొక్క అధ్యాపకునికి 20వేల రూపాయలకు పైగా వేతనం పెరుగుతుంది. కావున కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. రెగ్యులరైజేషన్ చేసే ముందు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పటివరకు మంజూరు చేయని పోస్టులను ఇప్పుడు మంజూరు చేయాల్సి ఉంది. ఆ పోస్టులను మంజూరు చేసిన తర్వాత ఆ పోస్టులలో పనిచేస్తున్న కాంటాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తున్నట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాంటాక్ట్ అధ్యాపకుల విషయంలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను 11 నెలలు కొనసాగనించి ఒక నెల రోజులు పాటు తొలగిస్తారు. అయితే వారు ఆ నెలలో కూడా పనిచేయడం కారణంగా పది రోజుల విరామంతో తమను తిరిగి రెన్యువల్ చేసే విధంగా గతంలో ఆదేశాలను పొందారు. వాటిని అమలు చేయాల్సిందిగా కాంట్రాక్టర్ అధ్యాపకులు కోరుతున్నారు. జూనియర్ కళాశాలలు ప్రారంభించి మూడు నెలలైనా, ఇప్పటివరకు కాంటాక్ట్ అధ్యాపకులను రెన్యువల్ చేయలేదు. వారిని రెన్యువల్ చేయకపోవడంతో వారికి జీతాలు అందే పరిస్థితి లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల విషయంలో దృష్టిని సాధించి, తొలిత వారిని రెన్యువల్ చేసి మూడు నెలల కాలానికి జీతాలను విడుదల చేయించింది గా కోరుతున్నారు.

