16, జులై 2024, మంగళవారం

పార్టు టైం అధ్యాపకుల గోడు పట్టని ప్రభుత్వాలు


35 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెగ్యులర్ చేయలేదు 

12 నెలలుగా జీతాలు లేవు 

విద్యా సంవత్సరం ప్రారంభమైన రేనువాల్ కాలేదు

 అధ్యాపకుల జీతాలను కూడా మళ్లించిన వైసిపి ప్రభుత్వం

నిధులను నిలుపుదల చేసిన కేంద్రం 



ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, వృత్తి విద్యా కళాశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల పరిస్థితి దుర్భరంగా మారింది. వీరు మరో 3 సంవత్సరాలలో పదవీ విరమణ చేయనున్నారు. వీరిని ఇప్పటివరకు ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదు. జీతం తప్ప ఇతర సౌకర్యాలు లేవి కల్పించలేదు. పైగా గత సంవత్సరం రోజులుగా వీరికి జీతాలు ఇవ్వకుండా, వారిని ఇబ్బందులకు పనిచేస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభించి మూడు నెలలు అవుతున్నా, వీరిని ఇప్పటి వరకు  రెన్యువల్ కూడా చేయలేదు.. రెన్యువల్ చేస్తే గాని జీతాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ పార్ట్ టైం జూనియర్ లెక్చరులు విద్యార్థులకు పాఠాలు చెపుతున్నారు. 


రాష్ట్రంలో కొత్తగా జూనియర్ కళాశాలలో ప్రారంభించినప్పుడు, జూనియర్ లెక్చరర్లు పదవి విరమణ చేసినప్పుడు, జూనియర్ లెక్చర్లు మెడికల్ లీవ్ లో వెళ్ళినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయడానికి 1982లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అప్పట్లో వీరికి గంటకు పది రూపాయలు చొప్పున ట్రజరీ ద్వారా వేతనాలను చెల్లించే వారు. ప్రస్తుతం వీరికి గంటకు 515 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. 1984లో ప్రభుత్వం విద్యార్థులకు స్వయం ఉపాధి నైపుణ్యాలను నేర్పడానికి జూనియర్ కళాశాలలో వృత్తివిద్య కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులు కామర్స్, వ్యవసాయ రంగం, ఇంజనీరింగ్, పారామెడికల్ తదితర 23 రకాల వృత్తి విద్య కోర్సులను నేర్పిస్తున్నారు. వీటిని పూర్తి చేస్తే డిప్లొమా పూర్తి చేసినట్లు. జూనియర్ కళాశాలలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కూడా వృత్తి విద్యా కళాశాలలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. 1992 సంవత్సరంలో ఎన్ఎంఆర్, డైలీ వేజ్, ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీరాజ్, ఇర్రిగేషన్, మున్సిపాలిటిలలో ఉదోగులు రెగ్యులర్ అయ్యారు. అభ్యర్థి సర్వీసు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ కు అవసరమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. ఉద్యోగంలో చేరిన నాటికి కనీస వయసు కలిగి ఉండాలి. దీనికి అనుగుణంగా 1994లో జీవో ఎంఎస్ నెంబర్ 166 ప్రకారం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న పార్టీ టైం ఉద్యోగులను రెగ్యులర్ చేశారు.  మీరు రెగ్యులర్ ఖాళి పోస్టులో పనిచేస్తూ ఉండాలి. 1991 నాటికి  ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. వారానికి 16 గంటల పని చేసి ఉండాలి. పోస్టుకు అనుగుణంగా విద్యార్హతలు ఉండాలి. తగిన వయసు కలిగి ఉండాలి. ఈ జీవోను అనుసరించి 1993లో ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవారిని అందర్నీ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. వారికి బేసిక్ పే అలవెన్స్ ఇస్తున్నారు. అప్పట్లో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తికాని పార్ట్ టైం  అధ్యాపకులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. తర్వాత వారిని రెగ్యులర్ చేసే కార్యక్రమం చేపట్టలేదు. అటువంటివారు రాష్ట్రంలో 140 మంది వరకు పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 12 మంది  ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి తర్వాత కాంటాక్ట్ పద్ధతిలో అధ్యాపకులను తీసుకోవడం ప్రారంభించింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ గత ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఎందుకు సంబంధించి కసరత్తు నడుస్తోంది. అయితే అప్పుడు 5 సంవత్సరాల సర్వీసు లేకుండా రెగ్యులర్ గాని ఉపాధ్యాయుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారు మరో మూడు నాలుగు సంవత్సరాలలో పదవీ విరమణ చేయనున్నారు. వారికి జీతం తప్ప వేరే ప్రభుత్వ సౌకర్యాలు అందడం లేదు. వీరిని సంవత్సరంలో 11 నెలలు కొనసాగిస్తా.రు ఒక నెలపాటు ఉద్యోగం నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి, మరుసటి నెలలో వారి ఉద్యోగాలను రెన్యువల్ చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతున్నది. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా, ఇప్పటివరకు ప్రభుత్వం వీరిని రెన్యువల్ చేయలేదు. వీరికి గత 12 నెలలుగా జీతాలు కూడా అందలేదు. వృత్తివిద్య కళాశాలల  నిర్వాహణకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను సమకూర్చుతుంది. అయితే వైసీపీ పాలనలో వృత్తి విద్యా కోర్సులకు విడుదల చేసిన నిధులను కూడా వేరే పద్దుకు  మళ్ళించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం ఆపేసింది. ఫలితంగా సంవత్సరం రోజులుగా పార్టు అధ్యాపకులు జీతాలు లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయారు. కుటుంబ పోషణ కూడా కష్టతరమైంది.  ఇటీవల నూతన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పార్టు టైం అధ్యాపకులు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. తమను రెగ్యులర్ చేయాలని, తమకు హెల్త్ కార్డ్, పింఛన్ సౌకర్యం కలగచేయాలని కోరారు. ఈ విషయంలో సాదరంగా స్పందించిన లోకేష్ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


*మా వెనుక చేరిన వారు రెగ్యులర్ అయ్యారు* 

ఈ విషయమై వడమాలపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ తమకన్నా వెనుక చేరిన అధ్యాపకులు రెగ్యులర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా ఉద్యోగాలలో చేరి రెగ్యులర్ అవుతున్నారని, తాము మాత్రం రెగ్యులర్ కు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు జీతం తప్ప హెల్త్ కార్డు గాని, పింఛన్ సౌకర్యం గాని లేదన్నారు. ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి వట్టి చేతులతో పదవి విరమణ తర్వాత ఇంటికి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం పింఛన్ విధానం కూడా తమకు అమలు చేయడం లేదన్నారు. తమ పదవి విరమణ చేసిన తర్వాత ఎలాంటి ఆర్థిక సహాయము ఉండడం లేదని, తమ ఎలా జీవించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను రెగ్యులర్ చేసి, పింఛన్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డును జారీ చేసి. ఇంటి స్థలాలను అందజేయాలని సుబ్రమణ్యం రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పో రై గంగ 1 నారా లోకేష్ ను కలిసిన పార్టు టైం అధ్యాపకులు 

గంగ 2 సుబ్రహ్మణ్యం రెడ్డి, వడమాలపేట జూనియర్ కాలేజీ

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *