15, జులై 2024, సోమవారం

త్రిశంకు స్వర్గంలో కుప్పం, పుంగనూరు మున్సిపల్ చైర్మన్లు

వైసిపికి రాజీనామా చేసి, టిడిపిలో చేరడానికి యత్నాలు 

టిడిపిలో చేర్చుకోవడానికి ఇష్టపడని అధిష్టానం 

దిక్కుతోచని స్థితిలో చైర్మన్లు, కౌన్సిలర్లు 

ప్రత్యామ్యాయంగా బిజెపి, జననసేన వైపు చూపు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, కుప్పం మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఇటు వైసీపీలో ఉండలేక, అటు టిడిపిలో చేరలేక శ్రీశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. కుప్పం, పుంగనూరు మున్సిపల్ చైర్పర్సన్లు వైసిపికి రాజీనామా చేశారు. వారితో పాటు కొంతమందికి కౌన్సిలర్లు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు పుంగనూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని కలిశారు. అలాగే కుప్పం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మంగళగిరి వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ రెండు రోజులు ఉన్న వారికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో తిరిగి కుప్పం జరుపుకున్నారు. వైసిపికి రాజీనామా చేసినా వీరి  పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఎం చేయాలో దిక్కు తోచడం లేదు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిని పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం అంగీకరించడం లేదు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, 20 మంది కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పుంగనూరు, కుప్పం మున్సిపల్ చైర్మన్ ల పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది. నెల రోజుల కిందటే పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాష, 11 మంది కౌన్సిలర్లు పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని కలిశారు. తాము వైసిపికి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించా.రు ఈ విషయాన్ని చల్లా బాబు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటి, ఇప్పటివరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ సుధీర్, మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్యర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంగళగిరి వెళ్లారు. రెండు రోజులపాటు వేచి ఉన్నా, వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అవకాశం కలగలేదు. ఈ లోపు కుప్పంలో కొత్త మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోమ్ మీద టిడిపి శ్రేణులు దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి వీలు లేదంటూ గట్టిగా వ్యతిరేకించారు. కుప్పంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీ తరఫున 19 మంది, టీడీపీ తరఫున ఆరు మంది విజయం సాధించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, ఎనిమిది మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి చేరితే వీరి వెంట రావడానికి మరో ఆరు మంది కౌన్సిలర్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా నియోజకవర్గ టిడిపి నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వైసిపి పార్టీ నుంచి ప్రజా ప్రతినిధులు ఎవరిని టిడిపిలో చేర్చుకోకూడదని  ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆమోదించారు. ఫలితంగా రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రజాప్రతినిధులను టిడిపిలో చేర్చుకోకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కుప్పం, పుంగనూరు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్ల పార్టీలో చేరికకు దారి సుగమం కాలేదు. దీంతో అటు వైసీపీలో ఉండలేక, ఇటు టిడిపిలో చేరలేక వారి పరిస్థితికి రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. కొంతమంది వైసిపి ప్రజాప్రతినిధులు బిజెపి, జనసేన పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టిడిపి తలుపులు తెరవకపోవడంతో, ప్రత్యామ్నాయ మార్గంగా జనసేన, బిజెపిల వైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వైసిపి ప్రజాప్రతినిధులకు తలుపులు తెరిస్తే, చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *