ముగిసిన వసంత నవరాత్రోత్సవములు
పూర్ణాహుతితో ముగిసిన వసంత నవరాత్రోత్సవములు
చిత్తూరు పెనుమూరు జాతీయ రహదారి లో వున్న వాగ్దేవి సవితా సేవాశ్రమంలో శనివారం పూర్ణాహుతితో వసంత నవరాత్రోత్సవములు ముగిసినవి. శుక్రవారం రాత్రి పవళింపుసేవ జరిపి శనివారం పూర్ణాహుతి హోమం జరిపారు. ఉగాది నుండి జరిగిన ప్రతి కార్యక్రమానికి సహకరించి విచ్చేసిన భక్తులకు హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముని ఆశీస్సులు కలుగుతాయని ఆశ్రమం అధినేత స్వామిని పూజానంద, ప్రధాన కార్యదర్శి హరగోపాల్ తెలిపారు.