21, ఏప్రిల్ 2023, శుక్రవారం

BJP పటిష్టతకు వ్యూహ రచనలో కిరణ్ కుమార్ రెడ్డి

  BJP పటిష్టతకు వ్యూహ రచనలో  కిరణ్ కుమార్ రెడ్డి 




                   భారతీయ జనతా పార్టీలో చేరిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నాయకుల పైన కిరణ్ కుమార్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా PCC మాజీ అధ్యాక్షులు  రఘువీరా రెడ్డి, తులసి రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి  పల్లం రాజు,  మాజీ ఎంపీ  హర్షవర్ధన్ లపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. కొందరితో కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా మాట్లాడినట్లు సమాచారం. తన అనుయాయుల ద్వారా మరికొందరితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యాయం కూడా BJP అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా పార్టీని బలోపోతం చేద్దామని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.


             Nallari Kiran Kumar Reddy. ఈ పేరు తెలుగు వారికి చిర పరిచితము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి సమైకాంధ్ర కోసం సొంత  కాంగ్రెస్ పార్టీనే ఎదిరించిన ధీరుడు కిరణ్ కుమార్ రెడ్డి. అధిష్టానానికి వ్యతిరేకంగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన ధీశాలి కిరణ్ కుమార్ రెడ్డి. సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం తన శక్తి యుక్తుల ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి పదవిని సైతం తునప్రాయంగా భావించారు. రాజకీయ లబ్ది కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించారు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డిని తెలియని తెలుగువారు ఉండరు. కుమార్ రెడ్డి అంటే తెలంగాణలో ఎంత వ్యతిరేకత ఉందో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అభిమానులు చాలామంది ఉన్నారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా బెంగళూరు నగరంలో ఏకాతంగా గడిపిన కిరణ్ కుమార్ రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన క్రియాశీలకంగా వ్యవహరించలేదు. PCC అధ్యక్ష బాధ్యతలు తీసుకోమన్నా సున్నితంగా తిరస్కరించారు. పార్టీకి ఆంటీముట్టనట్లు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కొంతకాలం విరామం తర్వాత రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండదలసి భారతీయ జనతా పార్టీలో చేరారు.


                  పార్టీలో చేరిన తర్వాత గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ పట్టిసీతకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగానే కిరణ్ కుమార్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలో  ఒక బలమైన వర్గం  రాజకీయంగా స్తబ్ధతగా ఉండిపోయింది. వారు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీలో చేరలేక, ఇటు జగన్ తో ఇమడలేక  రాజకీయాలకు అంటీమట్టనట్లు ఉన్నారు. అటువంటి వారి మీద కిరణ్ కుమార్ రెడ్డి దృష్టిని సారించినట్లు తెలుస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మరో మాజీ అధ్యక్షుడు శైలజానాధులను భాజపాలోకి కిరణ్ కుమార్ రెడ్డి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 


               ర‌ఘువీరా రెడ్డి వై.ఎస్‌. రాజ‌శేఖ‌రెడ్డి ప్ర‌భుత్వంలో ఆయ‌న వ్య‌వ‌సాయ శాఖా మంత్రిగా ప‌ని చేశారు. మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మేల్యేగా గెలిచారు. క‌ళ్యాణ‌దుర్గం నుంచి మ‌రోసారి ఎమ్మేల్యేగా నెగ్గారు. న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఆయ‌న రెవెన్యూ శాఖా మంత్రిగానూ సేవ‌లందించారు.  సాకే శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్యపుస్తకాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2022 జనవరి 16 నుండి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించాఋ. వీరికి  స్థానికంగా రాజకీయంగా గట్టి పట్టు ఉంది. బలమైన అనుచర  ఘనం ఉంది. వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ప్రజలు ఆదరిస్తారు. 

 

                   కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి  ఏరాసు  ప్రతాప్ రెడ్డి  కూడా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. గవర్నర్  నరసింహన్‌కు ఆయన తన రాజీనామాను సమర్పించారు. వారిని కూడా కిరణ్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 


                  అలాగే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పల్లము రాజును ఆహ్వానించినట్లు సమాచారం. మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు 14వ లోక్‌సభ సభ్యుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. కాపు వర్గానికి చెందిన అల్లం రాజుకు బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. 


                    మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షవర్ధన్ కూడా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హర్షకుమార్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గతంలో NSUI, యూత్ కాంగ్రెస్‌తో పాటూ మరికొన్ని విభాగాల్లో పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరారు. అమలాపురం టికెట్ వస్తుందని భావించినా దక్కలేదు. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి విషయం కూడా కిరణ్ వర్గం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొందరితో కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా మాట్లాడారు. మరి కొంతమందితో తన అనుచరుల ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


                       నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా అయినా చిత్తూరులో ఆయన అనుచరులు  ఇప్పటికే పార్టీ బలోపేతంపై దృష్టిని సృష్టించారు. నియోజక వర్గ, మండల, గ్రామస్థాయి నాయకులను కూడా పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో భారీగానే కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో నాయకులు చేరుతారని భావిస్తున్నారు. పార్టీని పటిష్టం చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల వారీగా పర్యటనలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లా నాయకులతో మాట్లాడి, అలాగే పరిచయం ఉన్న హస్తం పార్టీ నాయకులు,  కార్యకర్తలతో మాట్లాడి పార్టీని బలోపేతం చేసే విధంగా kiran ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. పార్టీని పటిష్టం చేసి కేంద్ర పెద్దల మెప్పు కోసం కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారు. రానున్న కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *