పెద్దిరెడ్డిని ఇంటికిపంపుతాం: సుధాకర్ రెడ్డి
జిల్లాలోని 14 స్థానాల్లో గెలుస్తాం: పెద్దిరెడ్డిని ఇంటికిపంపుతాం
టిడిపి ప్రతినిధి సుధాకర్ రెడ్డి ధీమా
వచ్చే ఎన్నికల్లో పుంగనూరు ఎమ్మెల్యే ఇంటి పేరు మారుస్తామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువార రొంపిచర్ల మండలంలో నియోజక వర్గం ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన "ఇదేమి ఖర్మ రాష్ట్రానికి" కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అక్రమాలు, అవినీతికి ప్రతిరూపమైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించి టిడిపి అభ్యర్ధి చల్లా రామచంద్రా రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు పవనాలు వీస్తున్నాయని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలలో టిడిపి అభ్యర్ధులు గెలిచి రికార్డు సృష్టిస్తారని చెప్పారు. 1983,1994 ఎన్నిక ఫలితాల పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డితో పాటు మంత్రులు నారాయణ స్వామి, రోజా రెడ్డి ఇద్దరికీ ఇంటి దారి తప్పదని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబ ఆగడాలు ఇక సాగవని స్పష్టం చేశారు. నియోజక వర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్ట పరుస్తామని చెప్పారు. త్వరలో అన్ని కమిటీలను వేస్తామని చెప్పారు. కమిటీలలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు.రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డికి తిరిగి ఓటమి చవి చూపిస్తామని సవాలు విసిరారు.
పెద్దిరెడ్డికి ఓటమి కొత్తేమీ కాదని,తిరిగి ఓటమి చవి చూస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టిడిపి పునర్వైభవం సాధిస్తుందని చెప్పారు. ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ తన పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని కపడితానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ మునిచంద్రా రెడ్డి మండల కమిటి అధక్షుడు ఉయ్యాల రమణ తదితరులు పాల్గొన్నారు.