మహిళ దారుణ హత్య
మహిళ దారుణ హత్య
తనతో సహజీవనం చేస్తున్నమహిళ మీద అనుమానంతో మేకలకు గడ్డి కోసే కత్తితో ఆ మహిళను హత్య చేసిన సంఘటన చిత్తూరు మండలంలో జరిగింది. చిత్తూరు మండలం మాపాక్షి గ్రామానికి చెందిన శేషాచలంలో కస్తూరి అనే మహిళ 10 సంవత్సరాల కిందట భర్త నుండి విడాకులు తీసుకుంది. మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో కస్తూరి సహజీవనం చేస్తూ, మేకలు మేపుకుంటు జీవనం సాగిస్తుంది. అయితే సోమవారం మేకలు మేపుకుంటూ శ్రీరాములు, కస్తూరి ఇద్దరూ మద్యం సేవించారు. కస్తూరి ప్రవర్తన గురించి శ్రీరాములు ప్రశ్నించాడు. దీనికి ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన శ్రీరాములు మేకలకు గడ్డి కోసే కత్తితో ఆమెను అక్కడే హత్య చేశాడు. హత్య చేసి పారి పోయాడు. మృతురాలు కొడుకు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు తాలూకా సిఐ గంగిరెడ్డి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరులోని శేషాచలపురంలో మహిళను హత్య చేసిన కేసుకు సంబంధించి సంఘటనా స్థలాన్ని చిత్తూరు DSP కె.శ్రీనివాస మూర్తి పరిశీలించారు. సోమవారం రాత్రి శేషాచలపురంలో జరిగినటువంటి కస్తూరి అనే మహిళ హత్య కేసుకు సంబంధించి హత్య జరిగిన స్ధలాన్ని చిత్తూరు ఈస్ట్ ఇన్స్పెక్టర్ గంగి రెడ్డి, తాలూకా ఎస్.ఐ. రామ కృష్ణ తో కలిసి పరిశీలించారు. అక్కడి సాక్షాలను సేకరించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.