డాక్టర్ YS సునీత రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ?
డాక్టర్ YS సునీత రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ?
రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు స్వర్గీయ వివేకానంద రెడ్డి తనయ డాక్టర్ YS సునీత రెడ్డి (YS Suneetha Reddy) రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ఊహాకానాలు సాగుతున్నాయి. వివేకానంద రెడ్డి మద్దతుదారులు రాజకీయరంగ ప్రవేశం చేయాల్సిందేనని గట్టిగా సునీతను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై రెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. త్యరలోనే ఒక నిర్ణయం తీసుకొని కడప అసెంబ్లీకి గాని కడప పార్లమెంటు గాని ఆమె పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి వస్తుంది. పార్లమెంట్ స్థానం కోసమే హత్య జరిగినట్లు సిబిఐ నిర్ధారణకు వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి ఉంటె రాజకీయంగా తమకు ఎదుగుదల లేదని వైయస్ భాస్కర్ రెడ్డి, అవినాష్లో రెడ్డిలు పథకం ప్రకారం వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డాక్టర్ వైయస్ సునీత ఒంటరి పోరాటం చేస్తోంది. తనకు కుటుంబ సభ్యుల నుంచి గానీ, రాజకీయ మద్దతు గాని లేదు. ఒంటరి పోరాటంలో చాలా వరకు సునీత విజయవంతమైంది.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్లు రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి అని వైయస్ వివేకానంద రెడ్డి అనుచరులు సునీత మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ జగన్, వైయస్ భారతీ ఒక జట్టుగా కొనసాగుతున్నారు. డాక్టర్ సునీత రెడ్డికి వారి కుటుంబం నుంచి మద్దతు లభించడం లేదు. వైయస్ షర్మిల మాత్రమే సునీతకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అయితే ఆమె రాష్ట్ర రాజకీయాల్లో లేరు. తెలంగాణలో రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఏపీలో ఆమె ప్రభావితం చేయగలిగింది ఏమీ లేదు. కావున రాజకీయంగా ఉంటే ఇలాంటి కేసులను ఎదుర్కోవడం చాలా సులభం అవుతుందని వివేకానంద రెడ్డి అనుచరులు చెబుతున్నారు.
వివేకానంద రెడ్డి మరణం తర్వాత ఆయన అనుచరులు రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. వివేకానంద రెడ్డి అనుచరులను ఇటు వైయస్ అవినాష్ రెడ్డి కానీ, వైయస్ జగన్ గానీ చేర తీయలేదు. వారిని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. కడప పార్లమెంటు పరిధిలో వివేకానంద రెడ్డికి అనుచర గణం చాలా ఉంది. ఆయన పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తల, నాయకుల బృందం ఉంది. ఈ బృందమంతా తిరిగి వైయస్ సునీతను రాజకీయాల్లోకి రావలసిందిగా ఒప్పిస్తున్నారు.
ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని ఆమెకు నచ్చ చెబుతున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉంటే వివేకానంద రెడ్డి కేసు ఎప్పుడో తెలియదని, దోషులు ఈపాటికి కటకటాలు లెక్కపెట్టేవారిని అంటున్నారు. ఈ విషయమై వైయస్ సునీత స్తబ్ధతగా ఉన్నారు. ఆమె ఎస్ అవినాష్ రెడ్డిని ఎదుర్కోవడానికి కోర్టుల చుట్టూ తిరగడానికి సమయం సరిపోతుంది. వాళ్లు వేసే పిటిషన్లలో ఇంప్లిట్ కావడం, కౌంటర్ దాఖలు చేయడం వంటి పనులలో బిజీగా ఉన్నారు. దోషులకు శిక్ష పడాలని తన శక్తి యుక్తుల ఉపయోగించి సునీత కృషి చేస్తున్నారు. ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఆమె శక్తికి మించి పోరాడుతున్నారని చెప్పాలి.
ఈ శక్తికి రాజకీయ శక్తి కూడా తోడు కావాలని వివేకానంద రెడ్డి అనుచరులు చెబుతున్నారు. వివేకానంద అనుచరులు సునీతకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. రానున్న ఎన్నికలలో కడప పార్లమెంటు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెను కోరుతున్నారు. కడప పార్లమెంటు సీటు వాస్తవంగా వైఎస్ వివేకానంద రెడ్డిదే. ఆయన తర్వాత కొద్ది రోజులు వైయస్ జగన్ కడప ఎంపీగా ఉండగా, తర్వాత ఆ స్థానాన్ని వైయస్ అవినాష్ రెడ్డి ఆక్రమించారు. ఆ స్థానం కోసమే వివేకానంద రెడ్డి హత్య జరగడంతో, ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోని సరైన బుద్ధి చెప్పి రాజకీయంగా మట్టి కరిపించడానికి ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడం ఒక ఎత్తు అయితే ఆయన క్యారెక్టర్ ను హననం చేసే విధంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. బెంగళూరులోని సెటిల్మెంట్ కారణంగా హత్య జరిగిందని, ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని కుటుంబ తగాదాల కారణంగా రెండవ భార్య వివేకానంద రెడ్డిని చంపించిందని ఆరోపిస్తున్నారు. అలాగే ఆస్తుల గొడవల నేపథ్యంలో సొంత కుమార్తె సునీత, ఆమె భర్త చంపించారని ప్రచారం చేశారు. తర్వాత సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడంతో సునీల్ యాదవ్ చంపాడని అరోపించారు. ఇలా రకరకాలుగా వైయస్ వివేకానంద రెడ్డి క్యారెక్టర్ ను దిగజార్చే విధంగా నిందితులు ఆరోపణలు చేస్తున్నారు. వీటిని నిగ్గు తేల్చుకోవాలి అంటే, ప్రజా కోర్టులోనే తెలుసుకోవాలని వైయస్ వివేకానంద రెడ్డి అనుచరులు డాక్టర్ సునీతను కోరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు సునీత రెడ్డి మౌనంగా ఉన్న, ఎన్నికల నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఆమె అనుచరులు గట్టిగా భావిస్తున్నారు. రానున్న ఎన్నికలలో కడప పార్లమెంటుకు గాని, పులివెందుల అసెంబ్లీకి కానీ పోటీ చేసి తన తండ్రిపై వేసిన నిందలను తుడిసి పెట్టాలని కూడా అనుచరులు వత్తిడి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం లేక జనసేన పార్టీల నుంచి డాక్టర్ సునీత పార్లమెంటు లేక అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కాగా ఒకవేళ ఈమె రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే మాత్రం ఈమెను చేర్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీ టీడీపీ మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. వివేకా కేసులో విచారణ వేగవంతం కాకపోవడానికి జగన్ కారణం అని విమర్శలు చేస్తూ సునీతకు మద్దతుగా నిలిచాడు. అందుకే ఈమెతో కలిసి ఉమ్మడి శత్రువు అయిన జగన్ ను సొంత జిల్లాలో దెబ్బ తీయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇక జనసేన కూడా ఈమెను చేర్చుకోవడం పట్ల సుముఖంగానే ఉంది. గతంలో సునీత తండ్రి కేసు విషయంలోనూ పవన్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. సునీతకు రాజకీయాలలోకి రావాలన్న ఆశక్తి ఉన్నా, లేకున్నా పరిస్థితులు ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి దారి తెస్తున్నాయి. ఆమె జగన్ కు వ్యతిరేకంగానే ఎన్నికల్లో నిలబడుతుంది అన్నది మాత్రం తిరుగులేని సత్యం.