వివాహితను గొంతుకోసి చంపిన యువకుడు
వివాహితను గొంతుకోసి చంపిన యువకుడు
గొంతు కోసుకొని తనూ ఆత్మహత్యకు ప్రయత్నం
వివాహేతర సంబంధమే కారణంగా అనుమానం
బ్యూటీ పార్లర్ నడుపుతున్న వివాహితను గొంతు కోసి హత్య చేసిన సంఘటన మంగళవారం సాయంకాలం చిత్తూరులో జరిగింది. ఇదే సంఘటనలో మరో యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కోన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ యువకుడిని చిత్తూరు పోలీసులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు వేలూరు రోడ్డులోని ఆనంద థియేటర్ సమీపంలోని కొండమెట్ట వద్ద 28 సంవత్సరాల వివాహిత దుర్గా ప్రశాంతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఈమె ఒక హెడ్ కానిస్టేబుల్ కుమార్తెగా తెలుస్తుంది. బుధవారం మంగళవారం సాయంకాలం దుర్గా ప్రశాంతి బ్యూటీ పార్లర్లో హత్యకు గురైంది, ఆమెను గొంతు కోసి హత్య చేశారు. అలాగే మరో యువకుడు భక్తి కూడా అదే స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని గొంతు కూడా కత్తిరించబడి ఉంది. యువతి మీద అత్యాయత్నం చేసి ఆమెను చంపిన తర్వాత యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో మూడవ వ్యక్తి లేకపోవడంతో పోలీసులకు సరైన వివరాలు అందలేదు. కొన ఊపిరితోనున్న యువకుడు చక్రవర్తి మాట్లాడే పరిస్థితిలో లేడు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గా ప్రశాంత మీద దాడి చేసినట్లు భావిస్తున్న చక్రవర్తి సొంత ఊరు భద్రాచలం దగ్గర కొత్తగూడెం సమీపంలోని బూడిద గడ్డ గ్రామంగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇతను రెండు నెలల కిందట తన తల్లితో చిత్తూరుకు వచ్చాడు. దర్గా సర్కిల్ దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ షాపు పెట్టి నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు హతురాలు దుర్గా ప్రశాంతి, చక్రవర్తి ఇద్దరూ దుబాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయిలో ఉన్నప్పుడే చక్రవర్తికి, దుర్గా ప్రశాంతికి పరిచయం ఉన్నట్లు గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చక్రవర్తి తల్లి ప్రమీల చెబుతోంది. వివాహేతర సంబంధమే హత్యకు తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలోని ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంఘటన స్థలాన్ని చిత్తూరు డిఎస్పి శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహారాజు సందర్శించారు. మృతురాలు పోలీసు కుటుంబానికి చెందిన యువతి కావడంతో పోలీసులు క్షుణ్ణంగా కేసిను దర్యాప్తు చేస్తున్నారు.