22, ఏప్రిల్ 2023, శనివారం

పెళ్ళికి నిరాకరించడంతోనే దుర్గాప్రశాంతి హత్య?

 పెళ్ళికి నిరాకరించడంతోనే దుర్గాప్రశాంతి హత్య?   



                            చిత్తూరు కొండమెట్టలో మంగళవారం జరిగిన దుర్గా ప్రశాంతి హత్య కేసు చిక్కుముడి క్రమంగా వీడుతోంది. ప్రేమ ఉన్మాదం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పెళ్లి విషయమై దుర్గా ప్రశాంతి అంగీకరించకపోవడంతో ఉన్మాదంతో ఆమెను హత్య చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడు ఆమెను గొంతు నులిమి హత్య చేసి, తాను కూడా మెడ, చేతుల మీద కత్తితో కోసుకున్నాడు. అతనిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలించారు. తిరుపతిలో కోలుకుంటున్నాడు. ఆరోగ్యం కుదుట పడగానే అతని అరెస్టు చేసి పోలీసులు విచారణను పూర్తి చేసే అవకాశం ఉంది.


                 ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని బూడిద గడ్డకు చెందిన చక్రవర్తి కొంతకాలం దుబాయిలో స్టార్ హోటల్లో కుక్ గా చేశాడు. ఆ సమయంలో చిత్తూరుకు చెందిన దుర్గా ప్రశాంతి Face Book ద్వారా  పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. దుర్గా ప్రశాంతి M. Pharmacy పూర్తి చేసింది. ఫార్మసీ చదువుతున్నప్పుడు చక్రవర్తి  పరిచయమయ్యాడు. ఇద్దరి మనుషులు కలవడంతో చక్రవర్తి దుబాయ్ నుండి  భద్రాచలం వచ్చాడు. అక్కడి నుండి తల్లిని తీసుకొని మకాం చిత్తూరుకు మార్చాడు. చక్రవర్తి తండ్రి లక్ష్మణరావు మృతి చెందాడు. తల్లి ప్రమీలతో అతను కలిసి ఉంటున్నాడు. చిత్తూరుకు వచ్చిన చక్రవర్తి దర్గా జంక్షన్లో బ్రెడ్ ఆమ్లెట్ షాప్ ని ప్రారంభించాడు. దుర్గా ప్రశాంతిని బ్యూటీ పార్లర్ నడుపుటకు గాను హైదరాబాదులో శిక్షణ ఇప్పించాడు. కొండమెట్టలో బ్యూటీ పార్లర్ ను ప్రారంభించడంలో చక్రవర్తి ప్రమేయం ఉందని తెలుస్తోంది.  దుర్గా ప్రశాంతి,  నిందితుడు చక్రవర్తి  కుటుంబాలకు పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడప్పుడు రెండు కుటుంబాలు కలిసేవని తెలుస్తోంది. అయితే కులాలు  వేరు కావడంతో చక్రవర్తి  దుర్గా ప్రశాంతి తల్లిదండ్రులతో వివాహ ప్రసక్తిని తేవడానికి సాహసించలేదు. అందులోనా  దుర్గా ప్రశాంతి తండ్రి  నాగరాజు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.  దుర్గా ప్రశాంతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. చక్రవర్తి పెళ్లి విషయమై  దుర్గా ప్రశాంతి అని నిలదీసినట్లు సమాచారం. పెళ్లికి ఆమె నిరాకరించడంతో మోచేతితో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యానంతరం తాను కూడా చనిపోవాలని కత్తితో మెడ, చేతులు కోసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చక్రవర్తికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడానికి ఒక పోలీసు బృందం భద్రాచలం వెళ్ళింది. తిరుపతిలో హాస్పిటల్ లో పొందుతున్న చక్రవర్తి  డిశ్చార్జ్ అయిన తర్వాత అతనిని అరెస్టు చేసి పోలీసులు కేసును దర్యాప్తు చేయనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *