19, ఏప్రిల్ 2023, బుధవారం

చక్రవర్తే దుర్గా ప్రశాంతిని చంపాడు: జిల్లా SP

చక్రవర్తే దుర్గా ప్రశాంతిని చంపాడు: జిల్లా SP

ఇద్దరికీ కొంత కాలంగా  పరిచయాలు ఉన్నాయి 

ఎందుకు చంపాడో  తెలియాల్చిఉంది


 


                   చిత్తూరు నగరంలో సంచలనం రేపిన హత్య కేసులో హాత్మహత్యకు పాల్పడ్డ నిందితుడు చక్రవర్తే దుర్గా ప్రశాంతిని చంపాడని జిల్లా SP రిశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వారి ఇద్దరికీ గత కొంత కాలంగా పరిచయాలు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు వేలూరు రోడ్డులోని ఆనంద థియేటర్ సమీపంలోని కొండమెట్ట బ్యూటీ పార్లర్ వద్ద  దుర్గా ప్రశాంతి హత్య జరిగిన  సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ  వై.రిశాంత్ రెడ్డి చిత్తూరు SDPO  కె.శ్రీనివాస మూర్తి, 1వ పట్టణ ఇన్స్పెక్టర్  నరసింహ రాజుతో కలిసి  పరిశీలించారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి హత్య కేసులో నిందితుడిని పరిశీలించారు. ఈ సందర్బముగా ఎస్పీ  పత్రికా విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలో కొండమిట్ట ప్రాంతంలో నివాసముంటున్న చిత్తూరులో విధులు నిర్వహిస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ గారి  రెండవ కుమార్తె దుర్గను చిత్తూరు నగారానికి చెందిన చక్రవర్తి అనే యువకుడు రిలయన్స్ మార్ట్ ప్రక్కన ఉన్న ఆమె సొంత బ్యూటీ పార్లర్ లో దారుణంగా హతమార్చి అతను కూడా తన మెడ మరియు చేతుల భాగాలను కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. 

      


      ఈ సంఘటనలో యువతీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా యువకుడు కొన ఊపిరితో ఉండగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తున్నట్టు తెలిపారు. మొదటగా ఆమెను గొంతు కోసి హత్య చేసినట్టు భావించిన ఆమెను పరిశీలించిన అనంతంరం ఆమె ఒంటి పై ఎటువంటి గాయాలు లేవని నిర్ధారించుకొని ఆమె శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారనీ, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత ఆమె ఎలా చనిపోయిందో తెలుస్తుందని తెలిపారు. దుర్గకు,  చక్రవర్తికి గత కొంత కాలంగా పరిచయాలు ఉన్నాయని, ఒక నెల క్రితం చక్రవర్తి చిత్తూరుకు వచ్చి స్థిరపడి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు ప్రాధమిక విచారణలో తెలిసిందన్నారు.  నిందితుడు దుర్గను ఎందుకు చంపాడు, వీరిరువురు కాకుండా వేరే ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టాలని త్వరితగతిన కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. అనంతరం ఎస్పీ  హెడ్ కానిస్టేబుల్ మరియు వారి కుటుంభ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *