కాణిపాకంలో 7గురు అన్నదానం ఇబ్బంది తొలగింపు
కాణిపాకంలో ఏడుగురు అన్నదానం ఇబ్బంది తొలగింపు
కాణిపాకం ఆలయంలోని నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ పోటు, పడితరం గిడ్డంగిలో పని చేస్తున్న కొందరు సిబ్బంది ఆలయానికి సంబంధించిన నిత్యావసరాలను దొడ్డిదారిన తరలించిన ఏడుగురిని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగించామని ఈవో వెంకటేశు తెలిపారు. అన్నదానంలో పనిచేస్తున్న సెల్వరాజ్, అరుణకుమార్,మహేశ్, మోహన్, మల్లిక, త్యాగరాజులు, గిడ్డంగి ఉద్యోగి ప్రసాద్ రెడ్డిని తొలగించినట్లు వెల్లడించారు.
రెండు రోజుల కిందట ఆలయం అధికారులు అన్నదానంలో పనిచేసే కశ్ర్మికుల ఇళ్ళను ఆకస్మికంగా తనికిలు చేశారు. ఈ తనిఖిలలో నుంచి అక్రమంగా సరుకులు తరలింపు, అన్నదాన సిబ్బంది చేతివటం వెలుగును చూసాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నదాన సత్రం పోటు నుండి సరుకులను అక్రమంగా తరలిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సుమారు ఒకటిన్నర లక్షల రూపాయలు విలువచేసే సరుకులు నిత్యాన్నదాన సత్రం స్వామివారి ప్రసాదం తయారీ పోటు నుంచి తరలించినట్లు ఆలయ ఈవో ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో బయటపడ్డాయి. ఈ వివరాలను ఆలయ ఈవో వెంకటేశు మీడియా సమావేశంలో వెల్లడించారు. దేవస్థానం అన్నదాన భవన్లో పనిచేసే వంట మనుషులు ఆలయ ప్రసాదం పోటులో పనిచేసే బ్రాహ్మణులతో కలిసి ఏడు మంది ఈ సరుకులను అక్రమంగా తరలించి తమ తమ ఇండ్లలో నిల్వ ఉంచినట్లు తేలింది. తమ సిబ్బందితో కలిసి వారి ఇళ్లలో దాడులు చేసి అక్రమంగా తరలించిన సరుకులను స్వాధీనం చేసుకున్నట్లు ఈవో వెంకటేష్ వెల్లడించారు. అలాగే వరదరాజ స్వామి ఆలయం వీరాంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్న కృష్ణమోహన్ అనే అతని ఇంటిపై తనిఖీలలో రెండు జింక చర్మాలు పట్టుబడినట్లు తెలిపారు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన ఏడుగురిపై విచారణ అనంతరం శాఖా పరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈవో వెంకటేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏ ఈ ఓ లు రవీంద్రబాబు హేమమాలిని సూపర్డెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.