26, ఏప్రిల్ 2023, బుధవారం

ప్రవీణ్ ప్రకాష్ తీరు మార్చుకోకుంటే ఆందోళన ఉధృతం

ప్రవీణ్ ప్రకాష్ తీరు మార్చుకోకుంటే ఆందోళన ఉధృతం



                      FAPTO రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఉదయం సమయంలో చిత్తూరు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద, చిత్తూరు FAPTO ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఏ. మునాఫ్ అధ్యక్షత న జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఫ్యాప్టో నాయకులు హృదయ రాజు మాట్లాడుతూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్రమoతా పర్యటిస్తు ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురి చేస్తు, ఎక్కడికక్కడ అధికారులను, ఉపాద్యాయులను సస్పెండ్ చేయడాన్ని  తీవ్రంగా ఖండించారు.

              ప్రభుత్వ  లోపాలను ఉపాధ్యాయులపై నెట్టి వేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం సకాలంలో పాఠశాలలకు పుస్తకాల పంపిణీ చేయకుండా, ఆ తప్పిదాన్ని అధికారుల పై, ఉపాధ్యాయుల పై మోపడం అన్యాయం అని ఆయన అన్నారు. ఇచ్చిన ఒక నెలలోనే జగనన్న పుస్తకాల బాగ్ లు చినిగి పోయాయని, అలాగే పాదరక్షలు కూడా సరియైన కొలతలో రాలేదని, ఈ విషయంలో ప్రవీణ్ ప్రకాష్  ఎవరిని శిక్షిస్తారని ప్రశ్నించారు. అన్ని పనులు ఉద్యోగులతో సకాలంలో చేయించుకుoటున్న ప్రభుత్వం, ఇప్పటికీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ప్రవీణ్ ప్రకాష్  తమ తీరు మార్చుకోవాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

                   ఈ కార్యక్రమంలో సెక్రటరి జనరల్ జీవి రమణ, కో - చైర్మన్ మునీర్ అహమ్మద్, డిప్యూటీ సెక్రటరి జనరల్ లు కిరణ్ కుమార్, రహ్మత్ బాషా, సీనియర్ నాయకులు జి. చెంగల్రాయ మందడి, పురుషోత్తం నాయుడు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *