చిత్తూరు కోదండ రామునికి కొత్త రథం
చిత్తూరు కోదండ రామునికి కొత్త రథం
నేడే రథోత్సవం
చిత్తూరులో రాముల గుడి వీధిలో వెలసిన శ్రీ కోదండ రామస్వామికి కొత్త రథం తయారయింది. ఈ రధానికి దాతలు 32 లక్షల రూపాయలను సమకూర్చారు. ధర్మకర్తల నేతృత్వంలో కోదండ రాముని రథం అత్యంత సుందరంగా తయారయింది. ఈ రధాన్ని బుధవారం జరగనున్న స్వామి రథోత్సవంలో మొదటిసారి వినియోగిస్తారు.
శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం సంవత్సర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వేణుగోపాల అలంకారంతో స్వామివారు వసంతోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సుబ్రహ్మణ్యం, ధర్మేంద్ర, చిట్టిబాబు, శ్రీ కోదండ రామస్వామి వీధిలోని వ్యాపారస్తులు ఉభయ దారులుగా వ్యవహరించారు. మంగళవారం రాత్రి స్వామివారు గజ వాహనం మీద ఊరేగారు. ఈ కార్యక్రమానికి బి రజిని, బి.గోపాలకృష్ణ, ఎస్ వాసుదేవన్, విశాఖపట్నం ఉభయదారులుగా వ్యవహరించారు. బుధవారం రథోత్సవం కనుల పండగగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజేశ్వరి, వి ఎస్ రఘుపతి అండ్ సన్స్ ఉభయదారులుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సకల వెంకటేష్ గుప్తా, పాలక మండల్ సభ్యులు నటకల సతీష్, ఆర్ రాజా, టీకే హేమాద్రి రావు, ఎం మాధవి, ఎం దుర్గాదేవి, ఈ రాజేశ్వరి, ఆలయ ముఖ్య అర్చకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.