జిల్లాలో భారీగా తగ్గిన మామిడి దిగుబడి
జిల్లాలో భారీగా తగ్గిన మామిడి దిగుబడి
పూత ఘనం - దిగుబడి స్వల్పం
చీడ, పీడలతో మామిడి రైతు కుదేలు
మూడు దశలుగా పూత
మందులు కొట్టినా పోని చీడ, పీడలు
ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ సంవత్సరం కూడా చిత్తూరు జిల్లాలో మామిడి పంట దిగుబడి గణనయంగా తగ్గింది.దీనికి తోడు చీడ పీడలు రైతులను వేధిస్తున్నాయి. రైతులు నాలుగు పర్యాయాలు చీడపీడల నివారణ కోసం మందులు పిచికారి చేసినా, ఫలితం కనిపించడం లేదు. ఇందుకు తగ్గట్టుగా అకాల వర్షాలు, గాలులు మామిడి రైతులకు నష్టం కలుగజేస్తున్నాయి. జిల్లాలో మామిడి పూత మూడు దశలుగా వచ్చింది. మొదట వచ్చిన పూత కాయలు మరో నెల రోజుల్లో పక్వానికి రానున్నాయి. రెండవ విడత మూడో విడత వచ్చినప్పుడు పిందెలుగా ఉన్నాయి. ఇలా ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతులతో ఆడుకుంటున్నాయి.
చిత్తూరు జిల్లాలో జీవనదులు నదులు, భారీ ప్రాజక్టులు లేకపోవడంతో వ్యవసాయం బోరు బావుల మీద ఆధారపడి జరుగుతుంది. వ్యవసాయ కూలీలు దొరకడం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు మామిడి పంటల పైన ముగ్గు చూపుతున్నారు. జిల్లాలో విస్తారంగా మామిడి పంటలు సాగు అయ్యాయి. సుమారు కోటికి పైగా హెక్టార్లలో మామిడి పంటలను వేశారు. అయితే మామిడి రైతుకు ప్రతిసారి నష్టం కలుగుతుంది. గత సంవత్సరం పంట దిగుబడి 50% కన్నా తక్కువ వచ్చింది. అంతకుముందు సంవత్సరం మామిడి దిగుబడి ఘననీయంగా వచ్చిన, మామిడి పంటకు గిట్టుబాటు ధర లేకుండా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సీజన్ ప్రారంభంలో మామిడి చెట్లకు పూత భారీగా వచ్చింది. అయితే పూత మొత్తం రాలిపోవడంతో రైతులు దిగాలు చెందారు. పూత మూడు విడుదలగా వచ్చింది. పూత వచ్చిన ప్రతిసారి రైతులు పురుగు మందులను పిచికారి చేయడంతో, రైతులకు భారీగా ఆర్థిక భారం పడింది. అయినా పూత నిలువక పోవడంతో మామిడి దిగుబడి భారీగా తగ్గింది. దీనికి తోడుగా ఈ పర్యాయం మామిడి కాయలను రెండు లేక మూడు దశలుగా కోయల్చిన పరిస్థితి ఏర్పడింది. మొదట సారి దిగిన మామిడి మరో నెల రోజుల్లో అక్వానికి రానుంది. రెండవసారి వచ్చిన పూత రెండు నెలల తర్వాత పక్వానికి వచ్చే అవకాశం ఉంది. మూడోసారి వచ్చిన పూత ఇప్పుడు పిందె దశలో ఉంది. మరో మూడు నెలలకు కానీ పక్వానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎలా ప్రకృతి వైపరీత్యాలు చిత్తూరు జిల్లాలోని రైతాంగంతో ఆడుకుంటున్నాయి
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభం అవుతోంది. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు మామిడికాయలను క్రషింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 42 మామిడి గుజ్జు ఫ్యాక్టరీలో ఉండగా, కొత్తగా మరో నాలుగు ఈ సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో కలిపి జిల్లాలో 46 ఫ్యాక్టరీలు అవుతాయి. విడిపోయిన చిత్తూరు జిల్లాలో మాత్రమే 31 ఫ్యాక్టరీలో ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు ఫ్యాక్టరీలు మామిడికాయలను క్రషింగ్ నిమిత్తం సేకరించే పనిలో పడ్డాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి మామిడికాయలు చిత్తూరు జిల్లాకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం టన్ను ధర రూ. 18,500 గా ఉంది. గతంతో పోల్చుకుంటే ఈ ధర చాలా ఎక్కువ. మరో నెల రోజులకు కానీ చిత్తూరు జిల్లాలోని మామిడి తత్వానికి వచ్చే అవకాశం లేదు. జిల్లాలోని మామిడి కోతకు వచ్చేనాటికి 20 నుంచి 30 వేల రూపాయల టన్ను ధర ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. గత సంవత్సరం జిల్లా కలెక్టర్ మామిడి గుజ్జు ఫ్యాక్టరీలతో సమావేశం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరగా 12 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. అయితే రైతులకు మాత్రం ఎనిమిది రూపాయలు గిట్టుబాటు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు పక్కనపెట్టి, సిండికేట్ గా ఏర్పడి లాభాలను ఆర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే జిల్లా కలెక్టర్ మామిడి గుజ్జు ఫ్యాక్టరీలతో సమావేశమయ్యారు మామిడి గుజ్జు ఫ్యాక్టరీల సమస్యలు రైతుల సమస్యల పైన దృష్టిని సారించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,08,428 హెక్టార్లలో 5,86,563 మెట్రిక్ టన్నుల మామిడి పంట దిగుబడి అవుతుంది. ఇందులో తోతాపురి, నీలం, ఖాదర్, బెనిషా, సిందూర, లాల్ బాగ్ రకాలను పండుతాయి. ఒక ఎకరా సాగుకు దాదాపు రూ. 30 వేలు ఖర్చు అవుతుంది. జిల్లాలో 31 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఇవి 3,64,640 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. మామిడి పంటకు ఇన్స్యురెన్స్ సౌకర్యం కల్పించే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని హార్టి కల్చర్ డి డి మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఉద్యానశాఖ కమీషనర్ ఎస్.ఎస్. శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమల యజమానులతో చర్చించి వారికి గల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా ముందస్తుగా సమావేశం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో పండించే తోతాపురి రకానికి ఎక్కువ ప్రాధాన్యత కలదని, ఈ రకానికి సంబంధించిన గుజ్జుకు కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నందున రైతులందరూ ఒకే సారి పక్వానికి వచ్చినా రాకపోయినా పంటను కోయడం చేస్తారన్నారు. ఇందువల్ల అధిక దిగుబడి కారణంగా ధరలు తగ్గే ప్రమాదం ఉంటుందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే దశల వారీగా కోయాలని కోరారు. తద్వారా రైతుకు సరియైన ధర పొందేందుకు అవసరం ఉంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూన్ మొదటి వారం నుండి తోతాపురి రకం పంట కోయడం ప్రారంభం అవుతుందని, ఈ రకానికి ఎక్కువ గిరాకీ ఉన్నందున జిల్లాలో ఎక్కువ భాగం మామిడి పంటపై రైతులు ఆసక్తి చూపారని చెప్పారు. రైతులకు సరైన ధర వచ్చేందుకు రైతులు కూడా అధికారుల సూచనలను, సలహాలను పాటించాల్సిన అవసరం కలదని తెలిపారు.
ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని, ధర నిలకడగా ఉండేలా ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోరారు. ధరల వివరాలను ప్రదర్శించాలని, మామిడి పంటకు ఇన్స్యురెన్స్ అందేలా చూడాలని, రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని తెలిపారు. టిటిడి వారు మామిడి జ్యూస్ ను కొనుగోలు చేసేలా చూడాలని, ఉపాధి హామీ పనులకు ఈ పంట సాగును అనుసంధానం చేయాలని కోరారు. అధిక దిగుబడి సాధించేందుకు అవసరమైన మెళకువలు సంబంధించి రైతులకు అవగాహన సదస్సులను విరివిగా నిర్వహించాలని, గుజ్జు పరిశ్రమల యజమానులు పంట కొనుగోలుకు సంబంధించిన బకాయిలు త్వరగా రైతులకు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మామిడి రైతులు జయచంద్ర చౌదరి, గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగేశ్వర రాజు, జగదీశ్ రెడ్డి, వేణు, వాసు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
గుజ్జును ఎగుమతి చేసేందుకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని గుజ్జు పరిశ్రమల యజమానులు గోవర్ధన్ బాబీ, బాబు రెడ్డి, చంద్రశేఖర్, అమరనాథ్, శివకుమార్, బషీర్, సమీర్ శర్మ, తదితరులు కోరారు.