15, ఏప్రిల్ 2023, శనివారం

SGTటీచర్ల నియామకంలో రిజర్వేషన్ లకు పాతర

టీచర్ల నియామకంలో రిజర్వేషన్ లకు పాతర

ప్రభుత్వం దయతల్చితే రెగ్యులర్, లేదంటే ఒప్పంద ఉద్యోగులే   

ఉద్యోగ భద్రత లేదు, పించన్ లేదు

ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు అన్యాయం 



                     రెండు రోజుల కిందట చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన 1998 డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ లో  రిజర్వేషన్,  రోస్టర్ పాయింట్లకు తిలోదకాలు ఇచ్చినట్లు సమాచారం. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 1998లో రెగ్యులర్ డీఎస్సీ కోసం రాత పరీక్ష జరగగా, రెండు రోజుల కిందట  ఆ అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో SGTలుగా  తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది.

              1998లో డీఎస్సీ జరిగింది. ఐదు సంవత్సరాల తర్వాత ఆ అభ్యర్థులను రెగ్యులర్ ఉపాధ్యాయులుగా కాకుండా ఒప్పంద ఉపాధ్యాయులుగా తీసుకోవడం జరిగింది. ఇందులో రూల్ అఫ్  రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లను పాటించకుండా మెరిట్  ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. 553 మంది అభ్యర్థులకు కౌన్సిలింగ్ లెటర్స్   పంపించగా అందులో 534 మంది అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కాన్సిలింగ్ నకు హాజరయ్యారు. 19 మంది గైరాజరయ్యారు. అయితే 1998 డీఎస్సీ ప్రకారం వీరిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా తీసుకోవాల్సి ఉంది. వీరికి టైం స్కేర్ అమలు చేయాలి. అలాకాకుండా వీరిని ఒప్పంద ఉపాధ్యాయులుగా తీసుకున్నారు. వీరికి రూ. 32,670 జీతం గా నిర్ణయించారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వం దయదలసి ఎప్పుడైనా పర్మనెంట్ చేస్తే చేయవచ్చు. లేకుంటే జీవితాంతం ఒప్పంద ఉద్యోగులుగానే కొనసాగాల్సి ఉంటుంది. డీఎస్సీ ప్రకటన సమయంలో వీరికి పాత పెన్షన్ విధానం అమలులో ఉంది. సిపిఎస్ విధానం ఆములలో లేదు. అధికారులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సి ఉండగా, ఒప్పంద ఉద్యోగుల పేరుతో పెన్షన్  విధానానికి తిలోదకాలు ఇచ్చారు.

                     ఈ విషయమై రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ కమిషనర్ ను  కలిసి నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాలను ఆపాలని వినతి పత్రాలను అందజేశారు. వీరిని ఒప్పంద ఉపాధ్యాయులుగా కాకుండా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా తీసుకోవాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే ఉపాధ్యాయుల నియామకంలో రిజర్వేషన్లు, రోస్టర్ విధానం అమలు చేయాలని కూడా సూచించారు. జిల్లా స్థాయిలో కూడా ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయమై స్పందించాయి.

            అయితే ప్రభుత్వం మాత్రం ఈ విన్నపాలను  పట్టించుకోలేదు. పూర్తిగా మెరిట్ ప్రకారం ఎస్ జి టి లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం కారణంగా రెగ్యులర్ డీఎస్సీ అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా రిజర్వేషన్, రోస్టర్ పాటించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. ఈ విషయమై చిత్తూరు డిఏఓ విజయేంద్ర రావును "చిత్తూరు న్యూస్ ప్రతినిధి" సంప్రదించగా విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తాము నియామకాలు జరిపామని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *