ముదస్తూ లేదు - విస్తరణా లేదు: జగన్ క్లారిటీ
ముదస్తూ లేదు - విస్తరణా లేదు
MLAల సమావేశంలో జగన్ క్లారిటీ
ముందస్తు ఎన్నికలు కేబినెట్ విస్తరణ ఊహాగానాల పై క్లారిటీ వైఎస్ జగన్ ఇచ్చారు. ఏపీలో తాజా ఎమ్మెల్సీ ఫలితాల అనంతరం సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళన చేపట్టబోతున్నారనే ప్రచారం మొదలైంది. అలాగే ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారనే మరో ప్రచారం సాగింది. ఎమ్మెల్సీ ఫలితాలతో కేబినెట్ ప్రక్షాళన ఊహాగానాలు జోరందుకున్నాయి. అలాగే జగన్ వరుస ఢిల్లీ టూర్లతో ముందస్తు ఎన్నికలపై కేంద్రాన్ని ఒప్పించేందుకు లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఎమ్మెల్యేల భేటీలో జగన్ ప్రకటనపై ఆసక్తి పెరిగింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు, కేబినెట్ ప్రక్షాళనపై ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు. తాజా ఎమ్మెల్సీ ఫలితాల ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయంటూ జరిగిన ప్రచారానికి ఈ సమావేశంలో సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. మంత్రివర్గ ప్రక్షాళన గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఎమ్మెల్యేలతో భేటీలో చెప్పకపోవడం తో మంత్రివర్గ ప్రక్షాళన లేదనే అంశంపై క్లారిటీ వచ్చేసింది.
అలాగే ఏ ఒక్కరినీ వదులుకోననే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యేలు ఓడిపోకుండా చూసుకుంటాననే ధీమా కూడా ఇచ్చినట్లయింది. అలాగే ముందస్తు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. ముందస్తు ఎన్నికలు ఉండబోవని, సకాలంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు జగన్ ఎమ్మెల్యేలకు మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి నుంచి చూసుకుంటే ఎన్నికలకు మరో ఏడాది లోపు సమయం ఉందని మాత్రం చెప్పారు. దీంతో ముందస్తు ఎన్నికలపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి కూడా జగన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ నేపథ్యంలో రెండు కీలక అంశాలపై జగన్ ఇచ్చిన క్లారిటీలతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఊపిరి పీల్చుకున్నారు.