AP BJPని కిరణ్ గాడిలో పెట్టగలరా?
AP BJPని కిరణ్ గాడిలో పెట్టగలరా?
ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. గతంలో ఉన్న ఇమేజ్ కూడా క్రమంగా తగ్గుతోంది. ఇటివల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో BJPకి చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పరిస్థితి చుస్తే. APలో రోజు రోజుకు పార్టీ బలహీనం అవుతుంది. రాష్ట్రంలో YCPకి BJP కొమ్ము కస్తున్నందున, రెండింటికి పెద్ద తేడా లేదన్న అభిప్రాయం ఉంది. పార్టీ బలోపేతానికి పార్టీ హైకమాండ్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, కమలం పార్టీ బలం పుంజుకోవడం లేదు. ఇతర పార్టీల్లో నుంచి ఏ నాయకుడు వచ్చినా, ఎంత పెద్ద లీడర్ వచ్చినా, లీడర్‌గా ఉంటున్నారే తప్ప పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీలుకోలేకపోతున్నారు. పార్టీలో కీలక నేతలు ఉన్నా వారంతా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అంతే తప్ప పార్టీకి ఉపయోగపడడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీకి పెద్ద దిక్కని భావించిన కన్నా లక్ష్మినారాయణ లాంటి సీనియర్ నేత కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు.
ఈ నేపధ్యంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి BJPలో చేరారు. బీజేపీలో Kiran Kumar Reddy ఎలాంటి పాత్ర పోషించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రి ఆయన. జాతీయ స్థాయి నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో బీజేపీ కండువా కప్పుకున్నారన్నది చర్చనీయాంచంగా మారింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకుల నుండి కిరణ్ కుమార్ రెడ్డికి సహకారం అందే అవకాశం ఉందా అనేదే ప్రశ్న. రాజకీయంగా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఆయనకు పెద్ద పదవి ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరనీ తెలుస్తుంది. అసలు కిరణ్ కుమార్ ఎలాంటి రోల్ ప్లే చేయనున్నారు అని అందరు ఎదురు చూస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీలో చేరి ఏపీలో పార్టీని బలోపేతం చేద్దామని ఎవరైనా ముందుకు వచ్చినా, వారికి స్థానిక నేతల నుంచి సహకారం లేదనే ఆరోపణ ఉంది. అంతేకాదు వారి మీద ఏదో ఒక రకంగా బురద జల్లడం ఏపీలోని కొందరు కమలనాధులకు అలవాటైపోయిందని సొంత పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ బాధ్యతలు చేపట్టిన కొత్తల్ల కొంత ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. కాలం గడిచే కొద్దీ కన్నా లక్ష్మినారాయణ మీద లేనిపోని ఆరోపణలు చేసి ఆయన పార్టీ వీడేలా చేశారని పార్టీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం తన పలుకబడిని, పరిచయాలను ఉపయోగిస్తారా? ఏపీలో పార్టీని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తారా? మరి స్థానిక నేతలే అడ్డుపడితే వారిని ఎలా ఎదుర్కొంటారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతను తీసుకున్నా? ఆయనకు బీజేపీ పెద్దలు ఎందుకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పలేదు అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇప్పటికైనా ఆయనకు స్పష్టమైన బాధ్యతలు అప్పచెప్పకపోతే, పార్టీకి బలం చేకూర్చడం కష్టమే అన్నది ఆయన సన్నితుల అనుమానం. అయితే పార్టీ పెద్దలు కిరణ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, కచ్చితంగా త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు. అయన BJPలో చేరి వారం రోజులు అవుతున్నా, ఇంతవరకు ఎటువంటి కదలికలు లేవు. కిరణ్ ఎవరిని BJPలోకి తెసుకువస్తారని ప్రజలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.


