దుర్గా ప్రశాంతి హత్య కేసులో నిందితుడు చక్రవర్తి అరెస్టు
ఈ నెల 18వ తేదీన కొండమిట్టలో బ్యూటీ పార్లర్ లో దుర్గా ప్రశాంతిని హత్య చేసి, ఆత్మహత్య ప్రయత్నం చేసిన చక్రవర్తిని తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర దిశా డి.ఎస్.పి J.బాబు ప్రసాద్ అరెస్టు చేశారు.
చిత్తూరు కొండమిట్టలో గ్లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న దుర్గాప్రశాంతికి గత సంవత్సరం అక్టోబర్ లో ఇన్ స్టా గ్రామ్ ద్వారా దుబాయిలో ఉండే చక్రవర్తి అనే వంట మాస్టర్ పరిచయమయ్యారు. అప్పటినుంచి అతను దుర్గాప్రశాంతితో చాటింగ్ చేస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రశాంతి అంటే ఇష్టం పెంచుకున్న చక్రవర్తి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. చిత్తూరుకు వచ్చి ఇక్కడే ఉంటే, తన తల్లిదండ్రులతో ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. ఎలాగైనా ప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో ఫిబ్రవరి 6వ తేదీ చక్రవర్తి దుబాయ్ నుంచి నేరుగా చెన్నైలో దిగితే ప్రశాంతి చెన్నై వెళ్లి చక్రవర్తిని చిత్తూరుకు పిలుచుకొని వచ్చింది. చక్రవర్తి చిత్తూరులో ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని పోన్నియమ్మ గుడి దగ్గర ప్రారంభించి, తన తల్లిని కూడా పిలిపించుకున్నాడు. చిత్తూరులో చక్రవర్తి తరచుగా ప్రశాంతిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రశాంతి చక్రవర్తిని, అతని అమ్మని తన అమ్మ ఇందిరాకి కూడా పరిచయం చేసింది.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgiGHwyslU3vO9CdbsvEJy1-wnrE4fmo1Lb0mT2wtSBqlvkhw6NdnkljbMu2SRZcFyciINuj_3cIIQ5ZdGhWQRxkxU-059Zx50rm5P_sYuSm32QFIeZpF22JopULwjOomolZqnH44jTLWihOleeyW5fEVDdfK6aaf6JnpiMCNBuLI-KUejmqasuromn/s320/WhatsApp%20Image%202023-04-18%20at%207.55.49%20PM.jpeg)
అయితే ఈ మధ్యలో ప్రశాంతి తనని పట్టించుకోకుండా వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉంటోందని, తనకి అబద్దం చెప్పి వేరే ఊరికి ఆ వ్యక్తితో వెళ్లిందనీ, ప్రశాంతి తన ఫోన్ ని స్విచాఫ్ చేయడంతో చక్రవర్తికి అనుమానం పెరిగి ఆమె కదలికలపై నిఘా పెట్టాడు. 17.04.2023 రాత్రి ప్రశాంతి కోసం రైల్వే స్టేషన్లో కాపు కాశాడు. ఆమె ట్రైన్లో నుంచి దిగి ఇంటికి వెళ్ళాక రైల్వే స్టేషన్ దగ్గరే చక్రవర్తి ఒక వ్యక్తితో అతనితో ప్రశాంతి సన్నిహితంగా ఉంటోందని అనుమానంతో గొడవ పడ్డాడు. ఇది తెలుసుకున్న ప్రశాంతి చక్రవర్తితో ఫోన్లో బాగా గొడవపడింది. అతనికి తను అనుకున్నట్టుగా సామాజిక స్థితి లేదని, అంతగా అనుమానించే వ్యక్తితో తను భవిష్యత్తులో ఉండలేనని అంది. ఇంట్లో వాళ్ళు కూడా రోడ్డు పైన అమ్లెట్లు వేసుకొనే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోరని చెప్పింది. కనుక అతను తన దారి తను చూసుకోవచ్చనీ, ఫోన్లో తనతో ఉన్న చాటింగ్ అంతా తొలగించాలని ప్రశాంతి కచ్చితంగా చెప్పింది.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi9QdtNr19f6oY75872j9zFww3ibhFfH962_xJwVi79Ua1lHE4VmY-7nqTfyMcYZ4oUFv_-HI3IwrMz2bc1TU9p2SZTTROLh0d_qeVqVFMZNxM2hmbnw1sEYJD42iNN7q7d7hagSXX2i901CZ9FhgyreZeKZu-U5cp8ks-urFQyAUhmzUfy-FL5y6Ok/s320/WhatsApp%20Image%202023-04-18%20at%207.05.17%20PM.jpeg)
దీనితో చక్రవర్తి ప్రశాంతి పై పూర్తిగా ద్వేషం పెంచుకొని, బ్రతికితే కలిసే బ్రతకాలని, లేకపోతే కలిసే చావాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రశాంతి నమ్మించి తనకు మోసం, ద్రోహం చేసిందనీ, తను బ్రతకాల్సిన అవసరం లేదని తన ఫోన్ లో ఒక సూసైడ్ నోట్ రాసుకున్నాడు. 18.4.2023 వ తేదీ మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఒంటరిగా ఉన్న ప్రశాంతితో తన ప్రేమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని అడిగాడు. నీ అన్నీ వదులుకొని దుబాయ్ నుంచి వస్తే తనను పూర్తిగా పక్కన పెట్టడం బాగా లేదని, తననే ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని గొడవ చేశాడు. వాదన ముదిరి, చక్రవర్తి విచక్షణ కోల్పోయి ప్రశాంతి పై దాడి చేసి ఆమెను చంపాలని ఆమె గొంతు నులిమాడు. నువ్వు దక్కనప్పుడు నేనెందుకు బ్రతకాలి ఇద్దరం కలిసే చచ్చిపోదామని అని చెబుతూ అక్కడే ఉన్న సేవింగ్ బ్లేడ్ తీసుకొని తన చేతుల మీద, మణికట్టుల మీద కోసుకోవడం మొదలుపెట్టాడు. రక్తం ఒక్కసారిగా చిమ్మి తనమీద పడడంతో ప్రశాంతి ఊపిరాడక భయాందోళనతో కుప్ప కూలిపోయింది. ఆమె చనిపోయిందని భావించి, చక్రవర్తి తన గొంతు కూడా రెండు చోట్ల కోసుకొని రక్తస్రావంతో తను కూడ అపస్మారక స్థితిలో కూలిపోయాడు. 4 గంటలప్పుడు రక్తపు మడుగులో వాళ్ళను చూసి ప్రశాంతి అమ్మ సమాచారం ఇచ్చింది. కొనప్రాణంతో ఉన్న చక్రవర్తిని, ప్రశాంతిని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న 1 టౌన్ CI నరసింహరాజు, అధికారులు నేరస్థలం చేరి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో ప్రశాంతి అప్పటికే చనిపోయినట్టుగా ప్రకటించి చక్రవర్తిని రూయా ఆసుపత్రికి తరలించారు. ప్రశాంతి తండ్రి హెడ్ కానిస్టేబుల్ నాగరాజు పిర్యాదు మేరకు చక్రవర్తిపై హత్య, ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా SP Y. రిషాంత్ రెడ్డి, IPS ఆదేశాల మేరకు ఈ కేసులో దిశా DSP J. బాబు ప్రసాద్ విచారణ చేపట్టారు. ముఖ్యమైన సాక్ష్యులను విచారించి ఆధారాలు సేకరించి, చక్రివర్తిని తిరుపతి రూయ ఆసుపత్రి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో మహిళా డి.ఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్, చిత్తూరు DSP కె.శ్రీనివాస మూర్తి, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ నరసింహ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.