దాడికి చిత్తూరులో BJP నిరసన, ధర్నా, రాస్తారోకో
సత్య కుమార్ పై దాడికి చిత్తూరులో నిరసన, ధర్నా, రాస్తారోకో
రాజధాని ఉద్యమానికి సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, అండమాన్ నికోబార్ దీవుల ఇంచార్జ్ సత్య కుమార్ పై భౌతిక దాడికి పాల్పడటాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి చిత్తూరు జిల్లా ఇన్చార్జి కోలా ఆనంద్ కుమార్ ఖండించారు. ఈ దాడికి ముఖ్య కారకుడు నందిగామ సురేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సత్య కుమార్ పై అధికార వైఎస్ఆర్ పార్టీ గుండాల దాడికి నిరసనగా శనివారం చిత్తూరు నగరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన, ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి చిత్తూరు జిల్లా ఇన్చార్జి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ దాడి జరిగిందని ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మందడం వద్ద భారతీయ జనతా పార్టీ నేతలపై దాడి ఘటనకు అధికార పార్టీయే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 1200 వ రోజుకు చేరిందని అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు.
అమరావతి రైతులకు మద్దతు ఇచ్చి వస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ పై దాడి చేయటం ఏంటని అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం చేసిన దాడిగా భావిస్తున్నామన్నారు. యాదవ్‌తోపాటు సురేష్ పై పడి విచక్షణారహితంగా కొట్టారని ఈదాడి ప్రభుత్వం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అదీ పోలీసులు సమక్షంలోనే జరిగటం హేయమని అన్నారు. హత్యాయత్నం కేసు, దాడి , కుట్ర కేసులు పెట్టాలని ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయక పోవడం అనుమానాలు పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పతి అధ్యక్షుడు చంద్ర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు M. బ్రహ్మానంద రెడ్డి, కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సాయి దేవానంద్, పెరుమాళ్ళ సుబ్బారెడ్డి, సి బాబు, రామభద్ర, గురు గణేష్, మనీ వర్మ, A. మోహన్ నాయుడు, కొంగాటం విజయ్, లక్ష్మీ ప్రసాద్, షంషేర్, తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.