14, ఏప్రిల్ 2023, శుక్రవారం

మోడీని గద్దె దింపండి- దేశాన్ని కాపాడండి: CPM

                                         మోడీని గద్దె దింపండి- దేశాన్ని కాపాడండి                                                                      

CPM రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు  పిలుపు



                  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి ద్రోహం చేసే విదానాలపై సిపిఐ-సిపిఎం రాజకీయ  ప్రచారభేరి  కార్యక్రమంను శుక్రవారం చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం  సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు అధ్యక్షత వహించారు.

         ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు లు మాట్లాడుతూ మోడీ విధానాలు దేశానికి రాష్ట్రానికి నష్టదాయకంగా  తయారైనాయని, రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను ధ్వంసం చేస్తున్నదని తెలిపారు. బిజెపి మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రైవేటీకరణ విధానాలను త్రిప్పికొట్టడానికి, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ, ధరలు పెంచి ప్రజలపై భారాలు వేశారని, వీటిపై పోరాటాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై సిబిఐ ఇడిని, గవర్నర్లను  ఉపయోగిస్తు నిరంకుశ దాడి చేస్తున్నారని తెలిపారు.  రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపిని అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన మోస్తున్నాయని బిజెపి మతోన్మాద ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించాలని వామపక్షాలు చేపట్టే పోరాటంలో ప్రజలు  కలిసి రావాలని కోరారు.

           మోడి నిరంకుశ చర్యలను ఖండించాలని ప్రచార బేరి యాత్రలో  సభలో విస్తృత ప్రచారం జరుగుతుందని దీనిలో ప్రజలంతా పాల్గొవాలని కోరారు. రాష్ట్రానికి నష్టం చేసే చర్యలుకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఏప్రిల్ 14న అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించి 30 వరకు పాదయాత్రలో సభలు సమావేశాలు జరుగుతాయని  తెలిపారు. గల్లి నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు మతోన్మాద బిజెపి మోడీని గద్దె  దించేంత వరకు కలిసి రావాలని పిలుపునిచ్చారు బ్రిటిష్ వారు పాలన పోయిన తర్వాత స్వాతంత్రం సాధించుకున్నప్పటినుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో ప్రజలపై దాడులు చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా వాంపర్చాలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విజయగౌరి, చంద్ర, సత్యమూర్తి, రమాదేవి, సిపిఎం నాయకులు సురేంద్రన్ చైతన్య, లోకయ్య లతో పాటు కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *