11, ఏప్రిల్ 2023, మంగళవారం

పూలే ఆశయాల సాధనకు కృషి చేస్తున్న తెదేపా



పూలే ఆశయాల సాధనకు కృషి చేస్తున్న  తెదేపా

 
       
        ప్రముఖ సంఘసంస్కర్త,సామాజిక తత్వవేత్త, కుల వివక్షకు వ్యతిరేకంగా నాలుగు దశాబ్దాల పాటు సామాజిక మహోద్యమం నడిపి  బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అణ గారిన వర్గాల కోసం ఉద్యమించడమే కాక కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించిన ఉద్యమాలకు ఆద్యుడు, మహాత్మా జ్యోతిబాపూలే అని తెదేపా చిత్తూరు పార్లమెంటరీ బిసి సెల్ అధ్యక్షులు షణ్ముగ రెడ్డి కొనియాడారు. వైసీపీలో, జగన్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం ఎండమావేనని ఆయన స్పష్టం చేస్తూ... మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు 70 శాతం అవకాశాలు కల్పించామని చింతామణి శ్రీరంగనీతులు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే వైసీపీ నేతలు అగ్ర కులాలను రాజ్యాంగేతర శక్తులుగా పెట్టి బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను రాజకీయంగా అణగదొక్కడం వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు. అప్పుడు, ఇప్పుడు,  ఎప్పుడూ సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని  స్పష్టం చేశారు.

 యమ్.ఎల్. సి  శ్రీ దొరబాబు  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే,  దానిని నారా చంద్రబాబునాయుడు కొనసాగించి  బడుగు, బలహీన వర్గాలు,బీసీల అభ్యున్నతికి, వారి ఎదుగుదలకు ఎనలేని కృషి చేశారని ఆయన ప్రశంసించారు.బీసీ లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, బీసీ వర్గాలకు చెందిన ఎందరో సామాన్యులను సైతం మంత్రులుగా, అగ్రనేతలు గా ఎదిగినట్లు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దీని కోసం నాడు ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, నేడు చంద్రబాబునాయుడు దానిని వంద శాతం కొనసాగిస్తూ బీసీల పక్షపాతిగా నిలిచారని ఆయన కీర్తించారు.

 మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి,మహిళలు కూడా విద్యనభ్యసించాలని పోరాడి మహిళలకు ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలే అని బడుగు బలహీన వర్గాలకు ఆనాడే జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం పైన పోరాడినటువంటి మహా మేధావి సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు.

 జిల్లా ఉపాధ్యక్షులు  కాజూరు బాలాజీ  మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారికత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అలాంటి మహనీయుని జయంతి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

        ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్ , చిత్తూరు పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు చిత్తూర్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు ఈశ్వర్, నగర బీసీ సెల్ పార్టీ అధ్యక్షులు శంకర్,  రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, రాష్ట్ర బీసీ సెల్ సెక్రెటరీ వినాయక గౌండర్, మొదలియార్ల సాధికార కమిటీ కన్వీనర్ త్యాగరాజన్, చిత్తూరు మాజీ డిప్యూటీ మేయర్ సుబ్రీ,ముదిరాజ్, ఈడిగ  పార్లమెంట్ సాధికార కమిటీ  కన్వీనర్లు ఉమాపతి, బూస నాగరాజుగౌడ్, క్రిస్టియన్  జిల్లా అధ్యక్షులు మేసాక్, చిత్తూర్ నగర తెలుగుత అధ్యక్షులు యువరాజ్, నగర నగర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శివ, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మురగ,  జిల్లా టి. ఎన్. టి. యు. సి. సమన్వయ కార్యదర్శి పం డారం మణి, పండారం మహేష్, గోపి, గోపాలకృష్ణ, ధరణి, శీను, చిత్తూరు మండల పార్టీ అధ్యక్షులు  శశికర్ బాబు, చిత్తూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజా ,చిత్తూర్ రూరల్ పార్టీ ప్రధాన కార్యదర్శి  రఘు, గిరి, మురుగ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *