10, ఏప్రిల్ 2023, సోమవారం

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి: TDP

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి: TDP



             పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని,  రైతులకు విద్యుత్ మీటర్లు బోర్ల వద్ద బిగించకూడదని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.  రైతులకు నాణ్యమైన  విద్యుత్  తొమ్మిది గంటలు అంతరాలు లేకుండా  సరఫరా చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చిత్తూరు నీయోజక వర్గ తెలుగు  రైతు అధ్యక్షుడు  దేవరాజులు నాయుడు ఆధ్యర్యంలో  చిత్తూరు మండలం నరసింహారాయణి పేట క్రాస్ రోడ్ నందు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా చేశారు. 

              చిత్తూరు మండల రైతుల ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు మరియు రైతులకు విద్యుత్ మీటర్లు బోర్ల వద్ద బిగించకూడదని రైతులకు విద్యుత్ సకలముగా తొమ్మిది గంటలకు చేయాలని నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరారు.  విద్యుత్ కోతల లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అన్నారు.  ఎన్నికల సమయంలో రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తామని,  విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.  ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులపై విద్యుత్ చార్జీలు పెంచి దీనివలన సామాన్య మధ్యతరగతి వారు పింఛన్లు రద్దు చేశారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు, విద్యుత్ చార్జీల వలన రద్దు అయిన పెన్షన్ మంజూరు చేయాలని  డిమాండ్ చేశారు. చిత్తూరు మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు  శశికా ర్ బాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు పార్లమెంట్ క్రిస్టియన్ అధ్యక్షుడు మేషాకూ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం రఘు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ నాయుడు రాజా కంద స్వామి, వియా మంజు, దిలీప్ కరుణాకర్ బాలకృష్ణ, జాఫర్, రవి, పెద్దబ్బ నాయుడు, దినకర్,  సహదేవ, మోహన్రా, మలింగారెడ్డి, గోవిందరాజులు, సురేష్, కుప్పయ్య,  సుందరజులు నాయుడు, ప్రే మ్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందచేసారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *