20, ఏప్రిల్ 2023, గురువారం

ఆర్యవైశ్యుల అభిమానం వెలకట్టలేనిది: JMC

 ఆర్యవైశ్యుల అభిమానం వెలకట్టలేనిది 

చిత్తూరు ఎమ్మెల్యే అరణి  శ్రీనివాసులు



                     చిత్తూరు పట్టణంలో  గడపగడపకు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు  బ్రాహ్మణ వీధి, 43 వార్డు పరిధిలో గురువారం ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ ఆర్యవైశ్యులు,  ఆలయ కమిటీ వారుఎమ్మెల్యే కి పూర్ణకుంభ స్వాగతం పలికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఎమ్మెల్యేని ఆర్యవైశ్యులు నాయకులు ఆరూరు ప్రసాద్ బాబు, ఆర్యవైశ్య మహాసభ అర్బన్ అధ్యక్షులు చల్లూరు ద్వారకనాథ్ వ్యవసాయమార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు ఆరూరు రామమూర్తి చిత్తూర్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చిలంకూరు వెంకటష్, దుస్సాలవులను కప్పి సన్మానం చేసి స్వాగతం పలికారు. 

                    ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ ఆదరణ అభిమానాలకు మారుపేరుగా ఆర్యవైశ్యులు ఎప్పుడు నిలుస్తారని కొనియాడారు. అనంతరం గడపగడపకు కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సత్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఎలాంటి అవసరం అయినా తనను నేరుగా కలిసి తమ ఇబ్బందులను తెలపవచ్చని, తప్పక వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎవరికైనా ప్రభుత్వ తరపు పథకాలు రాకుండా ఉంటే వారు వెంటనే సచివాలయంలో తెలియజేసి పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎమ్మెల్యే పాల్గొని అల్పాహారాన్ని తీసుకొని ఏర్పాట్లు చేసిన కమిటీని అభినందించారు. 

               ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు వైసీపీ నాయకులకు ఇంచార్జ్ లకు కార్పోరేటర్లకు ఆర్యవైశ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ నటకల గోవర్ధన్,  పట్టణ ఆర్యవైశ్య నాయకులు బైసాని బాబురావు, ఎస్సీకే సత్యనారాయణ శరవణ, నటకల బద్రి, వాసవి  క్లబ్ అధ్యక్షుడు శివప్రసాద్, ఓ ఆర్ నాగేంద్ర  , బైసాని చంద్రశేఖర రావు, టి ఎన్సి బాబు, మల్లి తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *