ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గరి అరెస్టు
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గరి అరెస్టు
గ్రామ వార్డు సచివాలయంలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.30 లక్షల వరకు మోసం చేసిన ముగ్గురు ముద్దాయిలను శుక్రవారం చిత్తూరు క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. సుమారు 2019వ సం. నుండి గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకులైన నిరుద్యోగులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30 లక్షల వరకు డబ్బులు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
చిత్తూరు నగరంలో మిట్టూరు నందు నివాసముంటున్న ఎస్.లక్ష్మీ అనే మహిళ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు. ఎంతకు ఉద్యోగం రాకపోవడంతో ఆమె క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చిత్తూరు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. శుక్రవారం ముద్దాయిలైన ముగ్గిరిని క్రైమ్ పోలీసులు చిత్తూరు నగరంలోని FCI గోడౌన్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది.
ముద్దాయిల వివరాలు :
1. బత్తుల శ్రీనివాస రావు @ శీను 48 సం. S/O లేట్ వెంకటేశ్వరయ్య, శాంతి నగర్, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
2. బత్తుల జయకృష్ణ ప్రియ, 40 సం. W/O బత్తుల శ్రీనివాస రావు, శాంతి నగర్, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3. ఏ.దశరధ, 49 సం. S/O లేట్ రఘునాథ రెడ్డి, గుడిపాల మండల, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని ఎవరైనా ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ వద్దకు వచ్చిన లేదా అటువంటి వారి గురించి ఏదైనా సమాచారం ఉన్న సంబందింత పోలీస్ స్టేషన్ లో గాని లేదా చిత్తూరు పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ 9440900005 కు తెలుపవలెనని చిత్తూరు పోలీసులు కోరారు.