18, ఏప్రిల్ 2023, మంగళవారం

ప్రాణాలు బలిగొంటున్న YCP నాయకులు: TDP

 ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు 

 టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ



                        పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలంలో కొందరు వైసిపి నాయకులు వన్య మృగాలు, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పుంగనూరు పరిశీలకుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ ఆరోపించారు.  వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాయకులు అడ్డు అదుపు లేకుండా వన్య ప్రాణులను వేటాడి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. మండలంలోని అడవుల్లో ఉన్న దుప్పెలు, కణుతులు, అడవి పందులు, కుందేళ్ళను వేటాడి ఆ మాంసాన్ని చుట్టు ప్రక్కల గ్రామాలలో అమ్ముకుంటున్నారని తెలిపారు. దీనికోసం నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రి, విద్యుత్ తీగల ఉచ్చులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. 

                 ఈ నెల 13న  వీరు అడవి పందులు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల ఉచ్చు తగిలి  శెట్టి పేట పంచాయితీ లో ఓ వ్యక్తి మామిడి తోటలో కాపలా ఉండే మునీంద్ర అతని భార్య బీరప్ప చనిపోయారని తెలిపారు.ఈ కిరాతకులు వారి శవాలను వ్యవసాయ భావిలో పడేసి వెళ్లిపోయారని అన్నారు. అయితే చౌడేపల్లి పోలీసులు దర్యాప్తు చేసి ఐదు మందిపై హత్యా నేరం కేసుపెట్టారని తెలిపారు. నిందితుల్లో మేకల చిన్ని పల్లె హై స్కూల్ చైర్మన్ మధుసూదన రెడ్డి, సింగల్ విండో చైర్మన్ రవి చంద్రారెడ్డి మామ దేవి రెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు హరినాథ్ రెడ్డి ముదిరెడ్డిపల్లికి చెందిన రంగా వెంకటరమణారెడ్డి అలియాస్ భూషణ్ రెడ్డి, ఎర్రిమణి ఉన్నారని తెలిపారు. వీరిలో ఇద్దరు పారిపోగా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారని చెప్పారు. 

                          వీరు, మరికొందరు నాయకులు కలిసి చాలా కాలంగా  వన్య మృగాలను వేటాడుతూ వాటి మాంసం చౌడేపల్లె, సోమల, పుంగనూరు తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. వీరికి అధికార పార్టీ అండదండలు ఉన్నందున  అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఇకనైనా అధికారులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుని వన్య ప్రాణులు, అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *