18, డిసెంబర్ 2024, బుధవారం

హై స్కూల్ గణితం పేపర్ సామాజిక మాధ్యమాలలో లీక్

సామాజిక మాధ్యమాలలో ప్రశాలు, సమాధానాలు

ద్రువికరించిన  కడప ఆర్జెడి శ్యామ్యుల్

పరీక్షను వాయిదా వేసిన విద్యాశాఖ కమిషనర్

తిరిగి 20న గణితం పరిక్ష నిర్వహణ 

నేటి ఫిజిక్స్ పేపర్ కూడా యుట్యూబ్ లో ప్రత్యక్షం 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


సోమవారం రాష్ట్రవ్యాప్తంగాసోమవారం  ఉన్నత పాఠశాల విద్యార్థులకు జరగాల్సిన గణితం పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షలు తిరిగి ఈనెల 20 తేదీన నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఒక రోజుకు ముందే యూట్యూబ్ లో, వాట్స్ అప్  వంటి సామాజిక మాధ్యమాలలో ఆరు, ఎనిమిది,  పదవ తరగతి ప్రశ్నాపత్రాలు, సమాధానం తో పాటు ప్రత్యక్షమయ్యాయి. లెక్కలు పేపర్  లీక్ కావడంతో ఈ పరీక్షను రద్దుచేస్తూ విద్యాశాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమ్మెట్ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్ష జరిగింది. అయితే భారీ వర్షాల కారణంగా హిందీ, ఇంగ్లీష్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సోమవారం లెక్కలు పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, సమాధానాలు యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలలో  దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై  సోమవారం విద్యాశాఖ అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైన ప్రశ్నపత్రాలను, కామన్ ఎగ్జామినేషన్ బోర్డు రూపొందించిన ప్రశ్న పత్రాలను సరిపోల్చారు. ప్రభుత్వం తయారుచేసిన ప్రశ్నపత్రంతో యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైన ప్రశ్న సరిపోవడంతో  లెక్కలు  పరీక్షను రద్దుచేస్తూ విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నాపత్రాన్ని ఎవరు లీక్ చేశారు ? ఎక్కడ నుండి లీక్ అయింది అనే విషయం మీద విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎక్కడి నుండి లీక్ అయింది సమాచారం నిర్ధారణ కాలేదు ఈ విషయాన్ని పోలీసు అధికారుల ద్వారా చూపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ తో పాటు టెలిగ్రామ్, ట్విట్టర్ లో కూడా ఆరు, ఎనిమిది, పది పరీక్షల మాస్ పేపర్లు దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమై ఉదయం నుంచి విద్యాశాఖ కసరత్తును  ప్రారంభించింది. పాఠశాలలు ప్రారంభం కాగానే సోమవారం ఉన్నత పాఠశాలు, ప్రాథమికోన్నత పాటశాలల్లో  6 నుండి పదవ తరగతి వరకు జరగాల్సిన లెక్కల పరీక్షలు అన్నింటిని వాయిదావేయాల్సిందిగా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలందాయి. ఆ దేశాలను జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు. తాత్కాలికంగా లెక్కలు పరీక్షలను నిలుపుదల చేయాల్సిందిగా కోరారు. తర్వాత గూగుల్ కాన్ఫరెన్స్లో మొత్తం వ్యవహారాన్ని విద్యాశాఖ అధికారులు సమీక్షించారు. యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలలో ఉన్న ప్రజల పత్రాలు, ప్రభుత్వము తాయారు చేసిన  ప్రశ్నలతో తడిపోవడంతో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల లెక్కల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నత స్థాయి విధాన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలను జారీ చేశారు. ఈ విషయమై చిత్తూరు క్యాంప్ లో ఉన్న విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ శ్యామ్యుల్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైన ప్రశ్నాపత్రాలతో కామన్ ఎగ్జామినేషన్ బోర్డు రూపొందించిన ప్రశ్న పత్రాలు సరిపోయినట్లు వెల్లడించారు. ఈ విషయమై విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 6 నుండి పదవ తరగతి వరకు లెక్కల ప్రజలను వాయిదా వేశామన్నారు. ఈ పరీక్షను తదుపరి 20వ తేదీన నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయమై కామన్ ఎగ్జామినేషన్ బోర్డు చిత్తూరు జిల్లా సెక్రెటరీ పరశురాం నాయుడు మాట్లాడుతూ...  సోమవారం జరగాల్చిన గణితశాస్త్రం 6 నుండి పదవ తరగతి వరకు నిర్వహించవలసిన పరీక్షలు అన్ని రద్దు చేశామన్నారు. ఈ మేరకు  చిత్తూరు జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు,  ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందచేశామని చెప్పారు.  ఈ పరీక్ష ఈ నెల 20 న  తిరిగి నిర్వహిస్తామని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షలు యధా ప్రకారం నిర్వహించాలని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిందన్నారు. ఈ విషయాలను  గమనించి ఎటువంటి లీకేజ్ కి అవకాశం ఇవ్వకుండా, ప్రతి ఉద్యోగి బాధ్యతతో వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నాపత్రము లీకేజ్ కాకుండా చూసుకోవాలని కోరారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడినచో వారిని చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు.

కొస మెరుపు 

ఒక వైపు గణితం సోమవారం లీక్ కాగా, మంగళవారం ఉన్నత పాటశాల విద్యార్థులను జరగాల్చిన ఫిజిక్స్ పేపెర్ కూడా లీక్ అయినట్లు you ట్యూబ్ లో ప్రశ్నా పత్రాలు, సమాధానాలు దర్శనం ఇచ్చాయి. ఇవి అసలా లేక నకిలీనా అన్న విషయం తేలలేదు. 

యూట్యూబ్ లో దర్శన మిచ్చిన 10 గణితం ప్రశ్నాపత్రం, సమాధానాలు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *