18, డిసెంబర్ 2024, బుధవారం

రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు జొన్నలు పంపిణి

రాగులు పంపిణిని ఉపసంహరించుకున్న ప్రభుత్వం 

ఉచిత గ్యాస్ సిలిండర్ ను ఉపయోగించుకున్న సగం మంది 

24న వినియోగదారుల హక్కుల మీద విద్యార్థులకు పోటీలు 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు) 

ప్రజలలో చిరుధాన్యాలను తినే అలవాటును పెంపొందించడానికి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా జొన్నలను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ నెలలకు జిల్లాకు 1.11 లక్షల టన్నుల జొన్నలను కేటాయించారు. ఆసక్తి కలిగిన కార్డుదారులు బియ్యంకు బదులు జొన్నలను తీసుకోవచ్చును. ప్రతి వినియోగదారునికి మూడు కేజీలకు మించకుండా జొన్నలను తరపున చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారుల హక్కులపై ఈ నెల 24న విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను  నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ పధకాన్ని జిల్లాలో సగం మంది వినియోగించుకున్నారు. వారి ఖాతాలలో సబ్సిడీ మొత్తాలు కూడా జమ అయ్యాయి. 


 బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటడంతో రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన కందిపప్పును కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ నెలకు జిల్లాకు 5.72 టన్నుల  కందిపప్పును కేటాయించగా, ఇప్పటివరకు  రేషన్ షాప్ ల ద్వారా 4.42 టన్నుల కందిపప్పును కార్డుదారులకు సరఫరా చేశారు. ప్రజలకు నిత్యవసర వస్తువులను సరఫరా  చేయడానికి రేషన్ షాపులు ఒకటో తారీకు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు తెరచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి మద్దతు సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ షాపులను తెరసి ఉంచాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంకాలం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు డీలర్లు అందుబాటులో ఉండాలి. ఇంటింటికి రేషన్ లో భాగంగా జిల్లాలో 286 వాహనాలు ద్వారా నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క వాహనం నాలుగు రేషన్ షాపుల పరిధిలోని వినియోగదారులకు రేషన్ అందజేస్తారు. గత నెల వరకు వినియోగదారులకు రేషన్ షాప్ ల ద్వారా రాగులు సరఫరా చేశారు. అయితే జిల్లాలో రాగుల కొనుగోలుకు జిల్లా ప్రజలు అంతగా ఆసక్తిని చూపలేదు. దీంతో రాగులకు బదులు జొన్నలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


*సగం మందికి చేరిన ఉచిత గ్యాస్ సిలిండర్లు* 


రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని జిల్లాలో ఇప్పటివరకు సగం మంది వినియోగదారులు వినియోగించుకున్నారు. ఇంకా సగం మంది వినియోగదారులు వినియోగించుకోవలసి ఉంది.  జిల్లాలో 5.43 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ లను అందచేయాలని నిర్ణయించింది. గత నెల రోజులుగా ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఇంకా మార్చి 31వ తేదీ వరకు వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 2.53 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ ను పొందారు. ఇందులో 2.40 మంది వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం 20.31 కోట్ల రూపాయలను సబ్సిడీగా విడుదల చేసింది. కేవైసీ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు జరుగుతుంది. ఈ లెక్కన జిల్లాలోని 2.40 లక్షల మంది వినియోగదారులకు 19.83 కోట్ల రూపాయలను సబ్సిడీగా వారి బ్యాంక్ అకౌంట్ లలో జమ చేయడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేయు డెలివరీ బాయ్స్ కూడా ఇటువంటి అదనపు మొత్తాలను వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలా ఎవరైనా నిబంధనలు వ్యతిరేకంగా వినియోగదారుల నుంచి గ్యాస్ సిలిండర్  డెలివరీ చేసినందుకు డబ్బులు డిమాండ్ చేస్తే జిల్లా పౌర సరఫరాల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చును. ఆ ఫిర్యాదు మీద జిల్లా పౌరసరఫరాల అధికారులు సంబంధిత గ్యాస్ ఏజెన్సీ మీద చర్యలు తీసుకుంటారు. సాధారణంగా వినియోగదారులకు 8 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి గ్యాస్ డెలివరీ చార్జీలను వసూలు చేయకూడదు. ఎనిమిది కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు పది రూపాయలను మాత్రమే డెలివరీ చార్జీల కింద వసూలు చేయాల్సి ఉంది. ఈ నియమ నిబంధనలను తూ.చా. పాటించాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల అధికారులు గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలను జారీ చేశారు. 


*విద్యార్థులకు పోటీలు* 


జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 24వ తారీఖున పాఠశాల, కళాశాల విద్యార్థులకు వినియోగదారుల హక్కుల మీద వ్యాసరచన, వక్తృత్వ పోటీలను  నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఈ పోటీలను నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానం వచ్చిన అభ్యర్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. వీరికి రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రం, బహుమతులను అందచేస్తుంది. జిల్లా స్థాయిలో విజేతలకు కూడా ప్రశంసా పత్రాలు, బహుమతులను జిల్లా పౌరసరఫరాల అధికారులు అందజేయనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *