24, డిసెంబర్ 2024, మంగళవారం

ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం

జనవరి ఒకటి నుండి జిల్లా వ్యాప్తంగా  అమలు

జిల్లా విద్యా శాఖ, ఇంటర్ అధికారులు కలిసి కసరత్తు 

నెల రోజుల పాటు ఉన్నత పాటశాలల నుండి భోజనం 

అ తరువాత జూనియర్ కళాశాలల్లోనే తయారీ 

జిల్లాలో ఏడు వేలమంది విద్యార్థులకు ప్రయోజనం   

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.) 

ప్ర్తభుత్వ జూనియర్ కాలేజీల్లో జగన్ ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనుంది. జనవరి 1 నుంచి ఇంటర్‌ విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను మం త్రిమండలి సమావేశం అమోదించింది. దీంతో జిల్లా స్థాయిలో మద్యాహ్నం భోజనం పధకం అమలుకు కసరత్తు ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఈ కసరత్తును ప్రారంభించారు. తొలుత నెలరోజుల పాటుటు జిల్లా విద్యాశాఖ సహాయ సహకారాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందువల్ల చిత్తూరు జిల్లాలో 7,000 మంది జూనియర్ కళాశాల విద్యార్థులు లబ్ధి పొందనన్నారు.


చిత్తూరు జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 3,493 మంది విద్యార్థులు,  రెండవ సంవత్సరం 3,501 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. దళిత కుటుంబ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వీరిలో పలువురికి మధ్యాహ్న భోజనం తీసుకొని వచ్చే వెసులుబాటు కూడా ఉండదు. వీరి తల్లిదండ్రులు ఉదయమే లేచి కూలి పనులకు వెళ్తుంటారు. మధ్యాహ్నంనకు విద్యార్థులకు అవసరమైన భోజనాన్ని తయారుచేసి క్యారీ ఇచ్చే పరిస్థితి చాలా తక్కువ. ఉదయమే ఏదో కొంత తిని కళాశాలకు వస్తే, మధ్యాహ్నం పస్తులతో కొళాయి నీళ్లతో కడుపు నింపుకునే పరిస్థితి. కాలే కడుపుతోనే పాఠాలను వింటూ, సాయంకాలం ఇంటికి చేరుకునే ధమనీయమైన పరిస్థితి. కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు తిని మిగిలిన భోజనాన్ని విద్యార్థులకు ఇస్తే వారు కడుపు నింపుకునే పరిస్థితి కూడా ఉంది. ఇలా ఒకటి, రెండు ప్రాంతాలు కాదు జిల్లా మొత్తం మీద వివిధ జూనియర్ కళాశాలల్లో ఈ సమస్య ఉంది. పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులది ఇదే సమస్య. వీరందరికి మధ్యాహ్న భోజనం అవసరం ఉంది. టీడీపీ ప్రభుత్వం 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని  సర్కార్ నిలుపుదల చేసింది. ఈ పథకాన్ని పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేసింది. 

*బిఆర్ఎస్ఎం విజ్ఞప్తితో కదిలిన ప్రభుత్వం* 

 తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అఖిల భారత రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (బి ఆర్ ఎస్ ఎం) ప్రతినిధులు జులై నెలలో కలిశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండారు శరత్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎం వి నరసయ్య కలిసి జూనియర్ కళాశాల విద్యార్థులకు తిరిగి మధ్యాహ్న భోజన పథకాన్ని విజ్ఞప్తి చేశారు. గత తెలుగుదేశం పాలనలో జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని తప్పక పరిశీలిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. తదుపరి ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నానాటికీ పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను పునరుద్దించడానికి ఈ పథకం దోహదం చేస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే కళాశాల విద్యార్థులలో పోషక ఆహార లోపాన్ని కూడా నివారించవచ్చని భావించారు. దీంతో మళ్లీ ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు  మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం కళాశాలల పని వేళల్ని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పెంచింది. ఈ లెక్కన మధ్యాహ్న భోజన పథకం ఉంటేనే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని భావించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజన వసతి కల్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల సంఖ్య, వంట పాత్రలు, షెడ్లు, నిర్వాహకులు, సరకుల పంపిణీ తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పలు జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన వసతులు లేవు. గతంలో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం అమలు చేసిన ఏజెన్సీలకు ఇంకా బకాయిలను చెల్లించాల్సి ఉంది. కొన్ని కళాశాలల్లో భోజనం తయారు చేయడానికి అవసరమైన వంట గది కూడా సౌకర్యం లేదు. దీంతో నెలరోజుల పాటు జూనియర్ కళాశాలకు దగ్గరగా ఉన్న ఉన్నత పాఠశాల నుంచి ఆహారాన్ని తయారుచేసి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారులతో, ఇంటర్మీడియట్ అధికారులతో, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లతో సమావేశాలను నిర్వహించింది. ఈ కసరత్తు దాదాపుగా పూర్తి అయింది. జూనియర్ కళాశాలల భోజనానికి అవసరమైన నిత్యావసరాలను ఇంటర్మీడియట్ విద్యాశాఖ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు విడుదల చేస్తుంది. వారు మధ్యాహ్న భోజనాన్ని తయారుచేసి, సిద్ధం చేస్తారు. సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ ఆ భోజనాన్ని ఉన్నత పాఠశాల నుంచి తీసుకొని కళాశాలకు వెళ్లి విద్యార్థులకు వడ్డిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా  ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయమై ఏబీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు శరత్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు, పౌష్టికాహారలోపం లేకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. ఇందువల్ల జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెరుగుతాయని, ఉత్తీర్ణత కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. తమ విజ్ఞప్తిని మన్నించి రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం పట్ల  రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.  

పో రై. గంగ 1 మంత్రి లోకేష్ ను కలిసి మధ్యాహ్న భోజనం గురించి వినతి పత్రం అందచేస్తున్న బిఆర్ఎస్ఎం నాయకులు. 

గంగ 2 జూనియర్ కళాశాల విద్యార్థులు 



కార్పొరేట్‌ తరహా స్టడీ మెటీరియల్స్‌

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ప్రస్తుతం ఇంటర్‌ విద్యకే పరిమితం కాగా ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు జేఈఈ, నీట్‌ అంటూ అదనపు కోచింగ్‌ ఇస్తున్నాయి. వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇకపై ప్రభుత్వ కాలేజీల్లోనూ అదే విధానం అమలు చేయాలని నిర్ణయించింది. కార్పొరేట్‌ కాలేజీల సలహాలు తీసుకుని స్టడీ మెటీరియళ్లు తయారుచేసింది. వాటిని విద్యార్థులకు అందించే కిట్‌తో పాటు అందిస్తారు. వచ్చే ఏడాది నుంచి పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, రికార్డ్‌ బుక్‌, జేఈఈ, నీట్‌ మెటీరియల్‌ అందించాలని నిర్ణయించారు. గణితం, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ సబ్జెక్టులున్న విద్యార్థులకు మెటీరియల్‌ ఇస్తారు. ఈ అంశం కూడా నేడు క్యాబినెట్‌ ముందుకు రానుంది. ప్రైవేటు కాలేజీల తరహాలో పోటీ పరీక్షలకు రోజూ తరగతులు నిర్వహించనున్నారు. రోజూ ఇంటర్‌ సబ్జెక్టులు బోధిస్తూనే అదనంగా జేఈఈ, నీట్‌కు సమయం కేటాయిస్తారు. వచ్చే ఏడాది నుంచి సవరించిన కరిక్యులమ్‌ అమల్లోకి వచ్చాక మిగిలే సమయాన్ని కొత్తగా రూపొందించిన పోటీ పరీక్షల మెటీరియల్స్‌ బోధనకు కేటాయిస్తారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *