జనవరి 3 నుంచి పరిశీలన ప్రారంభం
ఐదు నెలల పాటు కొనసాగుతున్న పరిశీలన
మంచానికే పరిమితమైన వారితో ప్రారంభం
తర్వాత అన్ని రకాల వికలాంగ పింఛన్లపై దృష్టి
ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి మరోవైపు పరీక్షలు
నకిలీ ధ్రువీకరణ పత్రమని తేలితే జారీ చేసిన డాక్టర్ పై చర్యలు
ఆంధ్రప్రభ, బ్యూరో చిత్తూరు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద బోగస్ వికలాంగుల సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జలక్ ఇవ్వనుంది. జనవరి మూడో తారీకు నుంచి వికలాంగుల ధ్రువీకరణ పత్రాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయముతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నారు. జనవరి నుంచి ఐదు నెలల పాటు పింఛన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుంది. తొలుత దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని పరిశీలిస్తారు. ఇందుకోసం డాక్టర్ల బృందం వారి ఇంటి వద్దకే వెళుతుంది. సర్ఫ్ రూపొందించిన ప్రత్యేక యాప్ లో వివరాలను నమోదు చేస్తారు. జిల్లావ్యాప్తంగా జనవరి నెలలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఫిబ్రవరి నెల నుంచి వివిధ రకాల వికలాంగుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి ధ్రువీకరణ పత్రాలను మరోసారి పరిశీలిస్తారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. ఎందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక ప్రాంతంలోని డాక్టర్ల బృందంచే మరో ప్రాంతంలో వికలాంగులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తారు.
గత ప్రభుత్వం సామాజిక పింఛన్ల విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. వికలాంగులు ధ్రువీకరణ పత్రాలను సమర్పించగానే వారికి పింఛన్లను మంజూరు చేసింది వారికి ఎంత శాతం వికలాంగత్వం ఉన్నది పరిశీలనలోకి తీసుకోలేదు అభ్యర్థులకు మరో మారు వైద్య పరీక్షలు నిర్వహించలేదు డాక్టర్లు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు నిజమైన బోగస్ ఉన్నాయా అనే విషయంలో కూడా దృష్టిని సారించలేదు అడిగింది తడవగా పింఛన్లను మంజూరు చేసింది సకలాంగులు కూడా తాము వికలాంగుల మంటూ ధ్రువీకరణ పత్రాలను తీసుకుని వచ్చారు ఈ విషయంలో పలువురు డాక్టర్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారువీకరణ పత్రానికి ఐదు నుంచి పదివేల రూపాయలు చొప్పున మొత్తాలను తీసుకొని ధ్రువీకరణ పత్రాలను జారీ చసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి భోగస్తులు వికరణ పత్రాలను పొందారని తెలుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వికలాంగుల కేటగిరిలోనే ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా వినికిడి శక్తి ఉన్నవారు కూడా తము బాధితులు అని దృవీకరణ పత్రాలను తీసుకుని వచ్చారు. అలాగే పలు విభాగాలలో కూడా భారీగా బోగస్ ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్న లబ్దిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు సిద్ధమవుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్నవారిని గుర్తించనున్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పించన్లు తీసుకుంటున్నవారికి అడ్డుకట్ట వేసి, అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించలని నిర్ణయించింది. కొన్ని మండలాల్లో ఇలా ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకునేవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగ పింఛన్ పొందుతున్నట్లు తేలింది. కొంతమంది చెవుడు ఉన్నట్లు దొంగ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీలు చేస్తుండగా.. వీరంతా సాధారణ వ్యక్తుల మాదిరిగా మాట్లాడటం, పనులు చేసుకోవడం, సర్టిఫికెట్లు చూపించమనగా నిరాకరించారు. అప్పుడు అనుమానం రాగా.. బోగస్ పింఛన్ లబ్ధిదారులుగా తేల్చారు. ఈ క్రమంలో అధికారులు బోగస్ సర్టిఫికెట్ల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు జిల్లాలో 3,500 మంది దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్నారు.. అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి తిరిగి వైక్యల నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు కట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ కింద1,46, 023 మందికి అవ్వ తాతలకు పింఛన్లు అందజేస్తున్నారు. 2,575 మంది చేనేత కార్మికులకు, 59, 903 మంది వితంతువులకు, 35,927 మంది వికలాంగులకు, 562 మంది కల్లుగీత కార్మికులకు, 32 మంది హిజ్రాలకు, 5751 మంది ఒంటరి మహిళలకు, 248 మంది చేపలు పట్టేవారికి, 6,296 మంది డప్పు కళాకారులకు, 794 మంది చెప్పులు కుట్టే వారికి, 71 మంది కళాకారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. అలాగే వివిధ వ్యాధిగ్రస్తులకు 2,764 మందికి, ప్రైవేట్ గా డయాలసిస్ చేసుకుంటున్న వారికి 303 మందికి, ప్రభుత్వపరంగా డయాలసిస్ చేసుకుంటున్నా 195 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. వికలాంగులకు మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్లు కూటమి ప్రభుత్వం 6000 రూపాయలకు పెంచింది. దీర్ఘకాలిక వ్యాధులు కిడ్నీ కాలేయము గుండె ఆపరేషన్ చేసుకున్న వారికి పదివేల రూపాయలను అందజేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో మంచాలు కే పరిమితమైన వారికి 15 వేల రూపాయలను అందచేస్తుంది. ఇవి కాళ్ళు, చేతులు పనిచేయడం లేదని, వినికిడి లోపం ఉందని, మానసిక వైకల్యం ఉందని పలువురు పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 50 శాతం భాగస్తు ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం గత సంవత్సరం రోజులుగా కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. తొలిత బోగస్ పెంచన్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ల అందజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా మొదట వికలాంగుల పింఛన్ల మీద దృష్టిని సారించింది. తదుపరి అన్ని రకాల పింఛన్లను పరిశీలించే అవకాశాలు ఉన్నాయి.