8, డిసెంబర్ 2024, ఆదివారం

మెక్కినదంతా కాక్కిస్తాం ఎవరినీ వదలం


చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి సమన్వయంతో కృషి

అధికారులందరూ విధిగా ప్రోటోకాల్ ను పాటించాలి

జిల్లాను  ప్రథమ స్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి

జిల్లాలో విజయవంతంగా ఉచిత ఇసుక విధానం

జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర రవాణా, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి


చిత్తూరు, డిసెంబర్ 8 (ఆంధ్రప్రభ)
గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధులు, ప్రకృతి వనరుల దోపిడీ, దుర్వినియోగం, స్వాహా విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఇంచార్జ్ మంత్రి అధ్యక్షతన జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిధులను స్వాహా చేసిన వారి నుండి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులందరూ చెడ్డవారు కారని, వారు తమ పనితీరును మార్చుకోవడానికి కొంత సమయం ఇస్తామన్నారు. ఆరు నెలల కాలంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు రివార్డులు, అవార్డులు ఇస్తామని, పనిచేయని అధికారులపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా మళ్లించిందని, అలా చేయకూడదు అన్న విషయం చీఫ్ సెక్రటరీకి, ఐ ఎ ఎస్అsధికారులకు ఎందుకు తెలియలేదో అర్థం కావడం లేదన్నారు. అధికారులపైన రాత్రికి రాత్రి ఒక అంచనకు రాలేమని, పనితీరు ఆధారంగా వారిని కొనసాగించే విషయమై ఆలోచిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదల రక్తం తాగిందని, జగన్మోహన్ రెడ్డికి ఎవరు అనుకూలంగా మాట్లాడితే వారికి కోట్లాది రూపాయలను దోచిపెట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జిల్లాలోని శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, ఏం.పి.ని, జిల్లా అధికారులను కలుపుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రానున్న నాలుగున్నర సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలలో చిత్తూరు జిల్లా దశ దిశ మర్చడానికి ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు.




 సమీక్షా సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, ప్రభుత్వ విప్  మరియు ఎమ్మెల్సీ కంచర్ల  శ్రీ కాంత్, ప్రభుత్వ విప్ మరియు జి డి నెల్లూరు శాసనసభ్యులు ఎం వి థామస్, జెడ్పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు, పూతలపట్టు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్, కె. మురళీ మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విధ్యాదరి, చుడా చైర్ పర్సన్ కటారి హేమలత, డి ఆర్ ఓ  మోహన్ కుమార్, కడ పిడి వికాస్ మర్మత్, డి ఎఫ్ ఓ భరణి, ట్రైనీ కలెక్టర్  హిమ వంశీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12వ తేదీతో దాదాపు 6 నెలలు కావస్తున్నదని, ప్రభుత్వం జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో సమీక్షించి విజయవంతంగా కొనసాగించడం జరుగుతున్నదన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు జీకా, ఎం ఎస్ పి నిధుల ద్వారా జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 15 కోట్లతో 17 కాలువల మరమ్మత్తు చేపట్టగా 7 పనులు పూర్తి చేసి 2,740 ఎకరాల ఆయకట్టుకు సాగులోకి తెచ్చామన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని, విజయపురం మండలం కోసలనగరం, పలమనేరులో, చిత్తూరు మండలం వెంకటరామాపురంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించడం జరుగుతుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2,776 పశువుల షెడ్ ల నిర్మాణం చేపట్టగా 50 షెడ్ ల నిర్మాణం పూర్తి చేసి 1824 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పంట సంజీవని, కాలువల పనులు ప్రారంభించామన్నారు. రెవిన్యూ శాఖకు సంబంధించి 822 గ్రామాలకు గానూ 782 రెవెన్యూ గ్రామాలలో డ్రోన్ ల సాయం తో రీ సర్వే చేపట్టి సుమారు 3 లక్షల ఎకరాలను రీ సర్వే చేశామన్నారు. మానవసేవయే మాధవసేవ గా భావించి ఈ నెల 17 నుండి 24 వరకు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కృత్రిమ అవయవాలను అందించే కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీలో జిల్లా 5వ స్థానం లో, స్వర్ణాంధ్ర మిషన్ 2047 అభిప్రాయం సేకరణలో జిల్లా 5వ స్థానం లో, స్వచ్ఛతాహీ సేవలో జిల్లా ముందంజలో నిలిపిన జిల్లాకు కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి లను అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్నా కాంటీన్ లను నిర్వహిస్తున్నామని, దీపం2 పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి ఏటా 3 ఉచిత సిలిండర్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. రోడ్ లలో గుంతలు పూడ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో త్వరలో స్కిల్ సెన్సెస్ నిర్వహించబోతున్నామని, యువత ఉపాధికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. పి జి ఆర్ ఎస్ కింద అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి సహాయంతో జిల్లాను వ్యవసాయ, విద్య, వైద్య, ఇరిగేషన్, ఉపాధి, పారిశ్రామిక రంగాలలో ప్రథమ స్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. పి జి ఆర్ ఎస్ కింద అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు చేపట్టామన్నారు.

ముఖ్యమంత్రి సహాయంతో జిల్లాను వ్యవసాయ, విద్య, వైద్య, ఇరిగేషన్, ఉపాధి, పారిశ్రామిక రంగాలలో ప్రథమ స్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.ప్రజాప్రతినిధుల ద్వారా అందిన ప్రజల వినతులకు అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించవలసి ఉందన్నారు. క్రమశిక్షణకు మారు పేరైన ముఖ్యమంత్రి అడుగు జాడలలో నసుస్తున్నామని, ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉందని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. గత 5 సంవత్సరాల కాలం లో ప్రజలు అనుభవించిన కష్టాల నుండి బయటపడతామన్న కాంక్షతో ప్రజలు ఉన్నారన్నారు. అధికారులు ప్రజలతో స్నేహ భావంతో ఉంటూ వారికి అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడంలో తోడ్పడాలన్నారు. 

చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించాలని, పంట నష్టం సంబందించి రైతులు ఇబ్బంది పడకుండా పంటల భీమాపై అవగాహన పెంచాలన్నారు. భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా రైతులకు వారి పొలాలలో ఏ పంట అనుకూలంగా ఉంటుందో తెలియజేయడం ద్వారా రైతులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశం వుంటుందన్నారు. రైతులకు లాభసాటి వ్యవసాయం సాగు పద్దతులపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అయ్యే పథకాలకు సంబందించి చిత్తూరు జిల్లాకు కేటాయింపుల విషయమై కేంద్ర మంత్రులతో చర్చించి జిల్లాకు మేలు చేకూర్చేలా కృషి చేస్తామన్నారు.  

 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ... జిల్లాలో పి జి ఆర్ ఎస్ ద్వారా మొత్తం 20 వేల ఫిర్యాదులు అందాయని, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 33 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, అందుతున్న ఫిర్యాదులలో దాదాపు 70 శాతం దారి సమస్య, డికెటి భూముల సమస్య, మ్యుటేషన్, గ్రామ నత్తం, ప్రభుత్వ భూముల ఆక్రమణ, రీ సర్వే సమస్యలు వంటి రెవెన్యూ సమస్యలు అందుతున్నాయన్నారు. రెవిన్యూ సమస్యలను గ్రామ సభల ద్వారా తహసీల్దార్లు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించడానికి ఆస్కారం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదుల నివేదికలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, సెక్రటరీ, సి సి ఎల్ ఏ నుండి తరచూ సమీక్షిస్తూ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మల్బరీ సాగు యూనిట్లు తక్కువ ఉన్నాయని, మల్బరీ సాగు రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్లవలసి వస్తుందని, మల్బరీ యూనిట్ నిర్వహించేందుకు ఒక్కొక్క యూనిట్కు మూడు కోట్ల వరకు ఉంటుందని సబ్సిడీ ద్వారా 1.5 కోట్లు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ మల్బరీ యూనిట్లు నిర్వహించిన తర్వాత మల్బరీ సాగు రైతులకు సంబంధించి షెడ్ల యొక్క నిర్వహణ ఖర్చు 11 నుంచి 12 లక్షల వరకు పెరిగిందని ప్రభుత్వం నుంచి 5 నుంచి 6 లక్షల వరకు సబ్సిడీలు ఇవ్వగలిగితే రైతులకు మద్దతు ఇవ్వవచ్చునని, ఇలా చేయడం వల్ల మల్బరీ సాగు రైతులు ముందుకు వచ్చి పట్టు పరిశ్రమలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఒక సంవత్సరంలో ఏడు నుంచి ఎనిమిది సార్లు మల్బరీ సాగును చేసి అధిక దిగుబడితో పాటు మంచి గిట్టుబాటు అందుతుందని, ప్రభుత్వం 2,500 ఎకరాల వరకు మల్బరీ సాగు, వారికి అవసరమయ్యే మెటీరియల్ సబ్సిడీ రూపంలో ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలని చిత్తూరు ఎం పి గారిని కోరారు.

  ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ... మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్థాపించిన ఇండో-ఇజ్రాయిల్ అనుబంధంతో రూ. 10 కోట్లు నిధులతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కుప్పం నియోజకవర్గం నందు ఏర్పాటు చేయడం జరిగిందని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు కు ప్రిస్టేజెస్ స్కోచ్ అవార్డు లభించిందని, ప్రస్తుతం 22 రకాలైన ఉద్యానవన పంటలను ఆధునిక విధానంలో, అది తక్కువ సిబ్బందితో పండిస్తున్నారని, ఉద్యాన శాఖ సంబంధించి సిబ్బంది తక్కువగా ఉందని మంత్రివర్యులు, కలెక్టర్ లు చొరవ చూపి సిబ్బందిని కేటాయించడం జరిగితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మంచి ఫలితం దక్కుతుందని తెలిపారు. జిల్లాలోని రైతులు వారి భూమి ఆధారంగా ఏఏ పంటలు పండించాలో వారికి కాన్ఫరెన్స్ లు నిర్వహించి,  సోషల్ మీడియా ద్వారా, అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులకు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం సాగు పద్దతులపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వామయులయ్యేలా కృషి చేయాలన్నారు. ఇందుకు సచివాలయాలలో ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని వినియోగించుకొని పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. పి జి ఆర్ ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఫిర్యాదుదారుల్లో నిరక్షరాస్యులు ఉంటారని, ఫిర్యాదుదారులందరికి సమానంగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. విద్యార్థులకు అపార్ ఐ డి కి సంబందించి విద్యాశాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పంచాయతీలలో రక్షిత మంచినీటి ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసేలా ఈ ఓ పి ఆర్ డి లు, డి పి ఓ పర్యవేక్షణ చేయాలన్నారు.  


 ప్రభుత్వ విప్,  జి డి నెల్లూరు శాసన సభ్యులు వి ఎం థామస్ మాట్లాడుతూ.. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దేశం యొక్క గుర్తింపు అనేది ఆ దేశంలో పండించే పంటల పై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం టెక్నాలజీ చాలా మెరుగ్గా ఉందని, తక్కువ సమయంలోనే ఎక్కువ పంటలు పండే విధంగా చేసి దిగుమతులు అధికంగా రాబట్టవచ్చని, మన ప్రాంతంలోని మట్టిని గుర్తించి దాని యొక్క నాణ్యత మరియు దాని రకం ముందుగా గుర్తించి సోయిల్ టెక్నాలజీ ప్రకారం ఏ పంట పండిస్తే ఎక్కువ దిగుబడి వస్తుందో ఆ పంటలు వేయాలని తెలిపారు. రైతులు పండించే పంట ఎంత ఉపయోగకరమో అంత వరకు మాత్రమే దానికి సాగు చేసే విధంగా అధికారులు వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా మామిడి, చెరుకు పంటలపైనే ఆధారపడి ఉన్నారని, వారికి సరైన గిట్టుబాటు ధర అందే విధంగా అధికారులు కృషి చేయాలని, ఇందుకు గాను మంత్రి, కలెక్టర్ చొరవ తీసుకుని రైతులకు న్యాయం జరగాలని తెలిపారు.

 చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ.. లాభసాటి వ్యవసాయానికి సంబందించి అవసరమైన మెలకువలపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రతి శాఖ ద్వారా అమలు చేసే కార్యక్రమాలకు సంబందించి ప్రజా ప్రతినిధులకు సమాచారాన్ని అందింవ్వాలన్నారు. అధికారులందరూ ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని కలిసి పనిచేయాలన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు తనిఖీ చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించినప్పుడే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు.  

పూతలపట్టు శాసన సభ్యులు కె మురళిమోహన్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో 10 సంవత్సరాల క్రితం చెరుకు ప్రధానమైన వాణిజ్య పంట దాని ద్వారా వచ్చే నల్ల బెల్లం పైన ఆంక్షలు పెట్టడం వల్ల రైతులు చెరుకు సాగును తగ్గించారన్నారు. కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మన దేశంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని, రైతు ఎఫ్ పి ఓ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. పూతలపట్టు నియోజక వర్గంలో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలకు అటవీ భూముల్లో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖలు, పంచాయతీ రాజ్, సమగ్ర శిక్ష, విద్యా శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖల సమీక్ష జరిగినది. ఈ సమావేశంలో వివిద సంబందిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *