6, డిసెంబర్ 2024, శుక్రవారం

నేడే జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్‌, టీచర్ల సమావేశాలు


రాజకీయాలకు అతీతంగా అందరికి ఆహ్వానం

పేరెంట్స్‌, టీచర్ల మ‌ధ్య ఆత్మీయ వార‌ధిగా సమావేశాలు  

ఆటల పోటీలతో పాటు సహపంక్తి భోజనాలు

పూర్వ విద్యార్థులకు, దాతలకు ఆహ్వానం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సహృద్భావ వాతావరణం కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఉత్తమ విద్య అందించేందుకు, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కలిపి ఒకే వేదికపైకి చేర్చనుంది. జిల్లాలోని శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. వారితో పాటు జిల్లా అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు. గుడిపాల మండలం కమ్మతిమ్మపల్లిలో జరిగే సమావేశంలో చిత్తూరు ఎం ఎల్ ఏ గురుజాల పాల్గొంటారు. విద్యాపరమైన అంశాలను చర్చించడంతోపాటు ఆట పాటలు, శుభ తిథి పేరుతో సహపంక్తి భోజనాలు, పిల్ల ప్రగతి నివేదికలు అందజేయనున్నారు. 


రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ ఆదేశాల మేరకు మెగా పేరెంట్‌, టీచర్స్‌ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా  విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలల మధ్య సంబంధాలను బలపరచడానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి 2047 నాటికల్లా వికసిత ఆంధ్రప్రదేశగా తీర్చిదిద్దాలని సంకల్పంలో భాగంగానే జిల్లాలోని 2,458 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ సమావేశాన్ని ప్రతిష్ర్టాత్మకంగా నిర్వహించేందుకు  విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దీని కోసం నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. పది మంది పిల్లలు ఉన్న బడులకు రూ.వెయ్యి, 300 నుంచి 200 మంది పిల్లలు ఉన్న రూ. 5 వేలు ఇలా సంఖ్యలను బట్టి ఆయా పాఠశాలలకు నిధులను కేటాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు ఆ కార్యక్రమంలో పర్యవేక్షించనున్నారు. వారం రోజులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే కలెక్టర్‌ అధికార్లకు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల కమిటీల సమావేశాలు కొత్త కానప్పటికీ ఈసారి మాత్రం పలు ప్రత్యేకతలు రూపొందించారు. ఎన్నడూ లేని విధంగా పిల్లల సంఖ్యను బట్టి ఆయా పాఠశాలలకు నిధుల కేటాయింపులు చేశారు. పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు ఎవరి స్థాయిలో వారు మరికొంత నిధులు సేకరించి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆహ్వానం కమిటీ, నిర్వహణ కమిటీ, బడ్జెట్‌ కమిటీ, బడి సుందరీకరణ కమిటీ, పర్యావరణ పరిరక్షణ కమిటీ, నిర్వహణ కమిటీ, స్టేజీ నిర్వహణ వంటి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లల ప్రగతికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను ఈ సమావేశంలోనే తల్లిదండ్రులకు అందజేయనున్నారు. ప్రోగ్రెస్‌ కార్డుల్లో మార్పులు, హాజరుతోపాటు ఆటలు, సాంస్కృతిక నిర్ధారణ పరీక్షల వివరాలు పొందుపరుస్తున్నారు. విద్యార్థులు ఇళ్ల వద్ద సెల్‌ఫోన్, ట్యాబ్‌లు అధికంగా వినియోగించకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. పూర్వ విద్యార్ధులు, ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమం విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే సమావేశానికి సంబంధించి మీటింగ్‌ షెడ్యూలు కూడా విడుదల చేశారు. ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు. రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్  సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాటశాలల్లో  శనివారం  త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. ఈ మెగా సమావేశానికి ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్చంధ సంస్థలను భాగస్వామ్యం చేయనున్నారు. విద్యావ్యవస్థకు అతి పెద్ద పండుగగా జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. పాఠ‌శాల‌ల బ‌లోపేతానికి, విద్యార్థి వికాసానికి, స‌మస్యల ప‌రిష్కారానికి దిక్సూచిగా నిలువాలని నిర్దేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఓ ఆత్మీయ వార‌ధిగా సమావేశం ఉంటుంది. తొలిసారిగా జిల్లామంతా ఒకేసారి  విద్యార్థుల త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌మావేశాలు జరగనున్నాయి. సమావేశాన్ని పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకున్నారు. వార్డు స‌భ్యుల నుంచి పార్లమెంటు స‌భ్యుల వ‌ర‌కూ... స‌ర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజాప్రతినిధులు అందరూ రాజ‌కీయాల‌కు అతీతంగా ఆహ్వానించారు.  ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, పరివర్తన, క్రమశిక్షణను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పేరుతో ఒక లేఖను అందరికి అందచేశారు. పాఠశాల విద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం  నిర్వహించనున్న తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందనీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ... సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా.. మీ, మీ పరిధి పాఠశాలలు, మీ సమీప స్కూళ్లలో జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.  ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చునని, పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చుని వివరించారు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం.. విద్య నేర్చుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మీ పార్టీ జెండాలు. కండువాలు, రంగులు వేసుకుని రావొద్దని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వవిద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా  మెగా పేరెంట్- టీచర్ మీటింగ్‌లో భాగం కావాలని మనస్పూర్తిగా కోరుతూ అందరినీ ఆహ్వానించారు. ఒక సుహుద్బవ వాతావరణంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. 

పో రై గంగ 5 పాఠశాల


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *