6, డిసెంబర్ 2024, శుక్రవారం

భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ సదస్సులు

జిల్లాలో నేటి నుండి నెల రోజుల పాటు సదస్సులు  

జేసి, డి ఆర్ ఓ పర్యవేక్షణలో సదస్సులు 

భూ సమస్యల మీద ఫిర్యాదుల స్వీకరణ 

45 రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

భూముల సమస్యల పరిష్కారించేందుకు శుక్రవారం నుండి జిల్లాలో  రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. గ్రామ, మండల స్థాయిలో సభలు ఏర్పాటు చేసి, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనంతరం 45 రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ అధికారిని ప్రతి జిల్లాకు నోడల్ ఆఫీసర్ గా ప్రభుత్వం  నియమించింది. భూ అక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, భూరికార్డుల్లో మార్పుచేర్పుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. భూ ఆక్రమణలు, 22ఏలో ఉన్న భూముల తారుమారు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెడతారు. వాటిని సరిచేసి బాధితులకు న్యాయం చేస్తారు.

ఇప్పటికే భూముల రీసర్వే పూర్తైన గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించారు. ఈ సభల్లో  16,108 సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. జిల్లాలో 822 గ్రామాలూ ఉండగా 329 గ్రామాల్లోనే రే సర్వే జరిగింది. ఈ గ్రామాలలో భారీగా ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జిల్లాలో రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫిర్యాదుల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా గ్రామ, మండల సర్వేయర్లను ఆయా గ్రామాలకు డిప్యుటేషన్ పై పంపింది. వీరిని తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. భూసర్వే ఫిర్యాదుల పరిష్కారానికి శుక్రవారం నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.  గత ప్రభుత్వ హయాంలో భారీగా భూ అవకతవకలు జరిగడంతో రెవెన్యూ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగనన్న ఇళ్ల కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున భూ దందా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు 20 ఏళ్లు దాటిన డీ పట్టా భూములను అమ్ముకోవచ్చన్న జీవోతో వందలాది ఎకరాలు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫిర్యాదులు స్వీకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో 66 శాతం ఫిర్యాదులకు పరిష్కార మార్గం చూపించింది. అయితే రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి వినతులు స్వీకరించి, సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని భావించింది.  ఈ నేపథ్యంలో ఈ నెల 6 నుంచి మూడు రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేసింది. జిల్లాలో 697 పంచాయతీలు, 612  సచివాలయాలు ఉన్నాయి. పంచాయతీల వారీగా గ్రామ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శిస్తారు. భూ ఆక్రమణలు, 22ఏలో ఉన్న భూముల తారుమారు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెడతారు. వాటిని సరిచేసి బాధితులకు న్యాయం చేస్తారు. సదస్సులపై తొలుత రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులతో కలెక్టర ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సన్నాహాక సమావేశంలో ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియజేస్తారు. గ్రామాల్లో ముఖ్య ప్రదేశాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. సదస్సుకు రెండు రోజుల ముందు గ్రామానికి సంబంధించి అడంగల్‌, పహాణి, ప్రభుత్వ భూ రిజిస్టర్‌ కాపీలు ముద్రించి వీఆర్వో ప్రదర్శిస్తారు. స్వీకరించిన అర్జీలకు రశీదులు, తక్షణం తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక అందించాల్సి ఉంటుంది. జిల్లాకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని పర్యవేక్షణాధికారిగా ప్రభుత్వం నియమించనుంది. వాస్తవానికి ఆగస్టులోనే గ్రామ రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ అప్పట్లో ఉద్యోగుల బదిలీలు, రెవెన్యూ సిబ్బంది స్థానచలనం కారణంగా వాయిదా వేసింది. తాజాగా నిర్వహించనున్న సదస్సులకు సంబంధించి బృందంలో తహసీల్దారు, ఆర్‌ఐ, సంబంధిత గ్రామాల వీఆర్వో, మండల సర్వేయర్‌, దేవదాయ శాఖ అధికారి, అవసరమైన చోట వక్ఫ్‌బోర్డు అధికారి, రిజిస్ర్టేషన్‌, అటవీ భూములకు సంబంధించి అధికారి ఉంటారు. ఆయా గ్రామాల్లో రీసర్వే పూర్తయితే నూతనంగా తయారుచేసిన ఆర్వోఆర్‌ను చదివి అభ్యంతరాలు స్వీకరిస్తారు. పార్టీ లోగోలు, రంగులతో కూడిన బీహెచ్‌పీలను తిరిగి సేకరిస్తారు. మళ్లీ తాజాగా రైతులకు అందిస్తారు. కలెక్టర్‌, జేసీ సైతం సదస్సుల్లో పాల్గొంటారు. ఆర్డీవోలు విధిగా ప్రతి మండలంలో రెండు గ్రామాలను సందర్శిస్తారు. సదస్సుల్లో వచ్చిన వినతులను అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. కొన్ని తక్షణమే పరిష్కరిస్తారు. మిగిలినవి ఉన్నతాధికారులకు చేరవేస్తారు. సదస్సులు పూర్తయిన 45 రోజుల్లో సమస్యకు తప్పకుండా పరిష్కార మార్గం చూపించడమే ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశ్యమని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ సదస్సులలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ఆర్టిజిఎస్ వేబ్ పోర్టర్  ద్వారా దరఖాస్తులను నమోదు చేస్తారు. ఆ గ్రామానికి ముందే సమాచారం అందజేస్తారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలను తగ్గించే విధంగా ఉండాల్సిందిగా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. భూ సమస్యల పరిష్కారానికి ఎటువంటి రుసుము వసూలు చేయవద్దని ఆదేశించింది. ఆక్రమణలతో భూములు కోల్పోయిన బాధితులకు సర్కార్ అండగా ఉంటూ న్యాయం చేస్తుందన్న భరోసా ప్రజల్లో కల్పించాలని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖలో సంస్కరణలు అమలు జరుగుతున్నాయని సంకేతాలు ప్రజలకు ఇచ్చే విధంగా సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ అధికారి జిల్లా నోడల్ అధికారిగా ఉంటారు. జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ ల ద్వారా సదస్సుల పర్యవేక్షణ జరుగుతుంది. సదస్సులకు ప్రజాప్రతినిధులు హాజరై విధంగా చర్యలు తీసుకుంటారు. సదస్సులపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, రైతు సంఘాలకు అవగాహన కల్పిస్తారు. పరిష్కార చర్యలపై  బాధితులకు తెలుగులోనే సమాధానం ఇస్తారు. రసీదు సైతం జారీ చేస్తారు. గతంలో భూములు సర్వే జరిగిన గ్రామాల్లో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తారు. జిల్లాలో రెవెన్యూ సదస్సులు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. సదస్సు గురించి  గ్రామాల్లో ముందే ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పెద్ద గ్రామాలలో రెండు రోజులపాటు సదస్సుల నిర్వహణకు సన్నాహాలు జరుగుతాయి. మండలాల వారీగా సదస్సుల నిర్వహణ షెడ్యూలు తయారుచేసి, ముందుగ ప్రకటిస్తారు. ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదుచేసి, నిర్ణీత గడ్డవుల్లో పరిష్కారం చేస్తారు. సదస్సులకు ఆర్ఓఆర్, అడంగల్, ఇతర రికార్డులతో అధికారులు  హాజరవుతారు. తొలుత ఫిరడుదరులకు రసీదులు జారీచేసి, ఆ తర్వాత విచారణ నిర్వహించి సమస్యను పరిష్కారం చేస్తారు.  తహసిల్దార్, మండల సర్వేయర్, అటవీ, దేవాదాయ శాఖ, వక్ప్ బోర్డు అధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *