రక్షిత తాగు నీరు, శానిటేషన్ కు ప్రాధాన్యత
ఇంటింటికి రక్షిత తాగు నీటి కొళాయి
ప్రభుత్వ నిధుల సంక్రమ వినియోగానికి చర్యలు
ఖాలిగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ
'ఆంధ్రప్రభ'తో జిల్లా పంచాయతీ అధికారి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గ్రామపంచాయతీలో రక్షిత తాగునీరు, శానిటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నూతన జిల్లా పంచాయతీ అధికారి పోసూరు సుధాకర్ రావు వెల్లడించారు. శనివారం ఆయన చిత్తూరులో "ఆంధ్రప్రభ బ్యూరో" తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామపంచాయతీలకు వారధిగా పని చేస్తామన్నా.రు తాను గతంలో ఐరాల, వడమాల పేట, వెదురుకుప్పం, రేణిగుంట మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేశానని, జిల్లా తనకు చిరపరిచితం అమన్నారు. తరచుగా గ్రామపంచాయతీలను తనిఖీ చేసి, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తానన్నారు. ఎక్కడైనా సక్రమంగా అపరిశుభ్రంగా ఉంటే, మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటానని వివరించారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి రక్షిత మంచి నీటిని అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీల ఆదాయాన్ని పెంచడానికి, వాటి ద్వారా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీలు అన్ని డిజిటల్ పంచాయతీలుగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామపంచాయతీలో సక్రమంగా పన్నులు వసూలు చేయడం, వాటిని సక్రమంగా వ్యయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామపంచాయతీలో ఎక్కడైనా నిధుల దుర్వినియాగం జరిగితే, వాటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తనవంతు కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ట్యాంక్ లను శుభ్రం చేయడానికి గ్రామపంచాయతీలకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామన్నారు. జిల్లా అధికారులకు, పంచాయతీలకు సమన్వయం చేసి గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తారని సుధాకర్ రావు లిపారు. చిత్తూరు జిల్లాలో 697 గ్రామపంచాయతీలు ఉన్నారని, ఇందులో కొన్ని గ్రామపంచాయతీలకు కార్యదర్శులు లేవన్నారు. త్వరలోనే పదోన్నతుల ద్వారా ఖాళీగా ఉన్న గ్రామ కార్యదర్శుల పోస్టులను కూడా భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే పథకాలను గ్రామస్థాయిలో వివరించి, ప్రజల భాగస్వామ్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని నిధులను సక్రమంగా గ్రామపంచాయతీలు సద్వినియోగం చేసుకొని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానని సుధాకర్ రావు వివరించారు.
పో రై గంగ 2 డిపిఓ సుధాకర్ రావు