30, డిసెంబర్ 2024, సోమవారం

హంద్రీ నీవా, గాలేరు నగరి పనులపై విజిలెన్స్ విచారణ

ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

 ఇంజనీర్లకు 24 ప్రశ్నలతో ప్రశ్నావళి 

పిఎల్ఆర్ కంపెనీకి అయాచితలబ్దిపై అనుమానాలు

పనులలో నాణ్యత ప్రమాణాలపై ఆరోపణలు 

ఇష్టారాజ్యగా బిల్లులు చెల్లించారని విమర్శలు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

గాలేరు నగరి హంద్రినీవ సుజల స్రవంతి పథకాల అనుసంధాన పనులపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో  కొందరు ఇంజనీర్లు అంతా తామై ఏకపక్షంగా వ్యవహారం నడిపారని అభియోగాలు ఉన్నాయి. ప్రభుత్వం అండతో కొందరు అవకతవకల విషయంలో  కీలకపాత్ర పోషించారని ఫిర్యాదులు అందాయి. డిపిఆర్ పూర్తిస్థాయిలో లేకుండానే టెండర్లు  పిలవడం కూడా వివాదాస్పదమైంది. బిల్లులు కూడా ఇష్టారాజ్యంగా చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు నిబంధనలకు విరుద్ధంగా ఆయాచితంగా  లబ్ధి చేకూర్చాలని అబియోగాలు ఉన్నాయి. పనుల్లోని లోటుపాట్లను వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వం నుంచి నిఘా విభాగం అధికార యంత్రంగానికి ఉత్తర్వులు అందాయి. సమగ్ర వివరాలు సమర్పించాలని గాలేరు నగరి జల స్రవంతి ఎస్ఇని ప్రభుత్వం కోరింది. ఏ ఏ వివరాల కావాలో రెండు పేజీలలో ప్రశ్నలను సంధించడంతో ఇంజనీర్లలో ఆందోళన ప్రారంభమయ్యింది.

గాలేరో నగరి సుజల స్రవంతి పథకం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి కృష్ణా జలాలను తరలించాలని   చక్రాయపేట ఎత్తిపోతల పథకానికి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయలసీమ కరువు నివారణ పథకం కింద పనులు చేపట్టడానికి పచ్చజెండా ఊపింది. 2020 ఆగస్టు 26న 5,036 కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం ఇవ్వగా, అదే ఏడాది నవంబర్ 9న సాంకేతిక అనుమతులను ఇచ్చింది. అనంతరం నీటిపారుదల శాఖ ఇంజనీర్లు టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న పి ఎల్ ఆర్ ప్రాజెక్టు సంస్థ, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ సంయుక్త గుత్తేదారు సంస్థ తో  2021 మార్చి 30న 4,374 కోట్లకు ఒప్పందం కుదిరింది. వాస్తవంగా పనులు ఈ ఏడాది మార్చి 19 తేదీల్లోగా  పూర్తవ్వాలని ఒప్పందంలో గడువు విధించారు.  ఒప్పందంలోపు కనీసం 25 శాతం పనులు కూడా  పూర్తికాలేదు. ఇప్పటికీ 20.68 శాతం  పనులు పూర్తి అయ్యాయని అంచనా. ఇప్పటివరకు 1,050 కోట్ల రూపాయల పనులు జరిగాయి. ఈ పథకం కింద పది ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టాలని రూపకల్పన చేశారు. మూడు చోట్ల పనులు చేపట్టగా మరో ఏడింటి పనులకు సంబంధించిన ఆకృతులకు పూర్తిస్థాయిలో ఇప్పతవరకు ఆమోదం లభించలేదు. నీటిని తరలించడానికి 120 కిలోమీటర్ల మేర పైపులైను వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 65 కిలోమీటర్లు మాత్రమే వేశారు. వేంపల్లి శివారులో గాలేరు నగారి కాలువ 55.680 కిలోమీటర్ల నుంచి కృష్ణా జనాలు 20 టీఎంసీలను తరలించాలి. వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో 2.91  లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. నీటిని ఎత్తిపోసే కీలకమైన పనుల్లో పెద్దగా పురోగతి లేదు. ఇంతవరకు భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. అడవి శాఖ నుంచి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదు. పంపు హౌస్ ల నిర్మాణం, మోటర్లు, పంపుల ఏర్పాటు, అనుసంధాన కాలువ, సొరంగం తవ్వకం, పైపులైన్ల పనులు నత్త నడకన సాగుతున్నాయి. కాలేటి వాగు సామర్థ్యం 0.226 టీఎంసీలు కాగా, 1.20 టిఎంసిలు నీటిని నిల్వ చేసేందుకు పనుల చేపట్టారు. ఇందులోకి కృష్ణాజిల్లాలు చేరాలంటే ఎత్తిపోతల పథకం ప్రారంభంలో పనులు పూర్తికావాలి. అక్కడ జరుగుతున్న పనులు తీరుతెన్నులు చుస్తే, ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాలేటి వాగులోకి కృష్ణ జలాల్లో చేరే పరిస్థితి లేదు. మొగమేరుపై జలవారిది నిర్మాణాన్ని చేపట్టి మధ్యలోనే నిలిపేశారు. మిగతా పనులు కూడా ఎక్కడికక్కడే అసంపూర్తిగా ఉన్నాయి. గాలేరు నగరి హంద్రీనీవా పనుల అనుసంధానంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని విజిలెన్స్ అధికారులు నిర్ణయించారు. ఎందుకు 24 ప్రశ్నలు తయారు చేసి, సమగ్ర సమాచారం ఇవ్వాలని ఎస్ఇకి లేఖ రాశారు. బేసిక్ డేటా, పరిపాలన సాంకేతిక అనుమతి పత్రాలు, ఐబిఎం అంచనాలు, కృష్ణా జలాలు తరలించడానికి ఇచ్చిన ఆమోదపత్రాలు, టెండరు ప్రతులు, మట్టి తవ్వకం, గుత్తేదారు సంస్థతో  జరిగిన ఒప్పంద పత్రాలు, బిల్లుల చెల్లింపు షెడ్యూలు, మట్టి, రాతిపొరలు, బోర్ల తోవ్వకం, పరీక్షల ఫలితాలు, సిమెంట్ కాంక్రీట్ నిర్మాణాలు, సమగ్ర పథక నివేదిక (దిపిఅర్), స్టేజి 1,2 పనుల ఎం బుక్స్, కాలేటి వాగు పనులు, మహదేవపల్లి, గొట్లమిట్ట, వరికుంటపల్లి, సురభి, గడ్డంవారి పల్లి, లక్కిరెడ్డిపల్లి, కోనంపేట, గండి, కల్లూరివారి పల్లి, పెద్దేరు, నాయుడువారి పల్లి చెరువుల సామర్థ్యం, ఇతర అభివృద్ధి చేయాల్సిన సమాచారం, 10 ఎత్తిపోతల పథకాల పంపు హౌస్ లు, పైపులైన్ల పొడవు, చుట్టుకొలత, మంధం, కొనుగోలు బిల్లులు, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు, నిపుణులు తనిఖీ నివేదికలు, మోటార్ల కొనుగోలు, కాలువ, సొరంగాలు, జలాశయాల్లో తవ్వకాలు, భూ భౌగోళిక పరిస్థితులు, హైడ్రాలిక్ సమాచారం, మట్టి, ఇసుక, ఇతర సామాగ్రి ఏ క్వారీ తీసుకుని వచ్చారు?  రాయల్టీ చెల్లింపు పత్రాలు, పనులపై నాణ్యతా నియంత్రణ విభాగం ఇంజనీర్లు ఇచ్చిన నివేదికలు సమర్పించాలని కోరారు. అప్పట్లో కొందరు ఇంజనీర్లు  ఏకపక్షంగా వ్యవహారం నడిపారని తెలుస్తుంది. ప్రభుత్వంలో పెద్దల అండతో  కొందరు నియమ నిబందనలు పాటించలేదని విమర్శలు ఉన్నాయి.  డిపిఆర్ పూర్తిస్థాయిలో లేకుండానే టెండర్లు పిలవడం కూడా వివాదాస్పదమైంది. బిల్లులు కూడా ఇష్టారాజ్యంగా చెల్లించాలని ఆరోపణలు ప్రభుత్వానికి అందాయి. వీటిని నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణలో మరిన్ని ఆశక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. 

పో రై. గంగ 1 హంద్రీ నీవా ప్రాజెక్టు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *