2, డిసెంబర్ 2024, సోమవారం

తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగా పంటలకు నష్టం

పంటకోత దశలో తీవ్రంగా నష్టపోయిన రైతన్న 

500 హెక్టార్లలో నీటి మునిగిన వరి, వేరుశనగ పంటలు 

100 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటిపాలు

మృతి చెందిన 2 ఆవులు, 2 దూడలు, 1 గొర్రె 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


పెంగాల్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాని  అతలాకుతలం చేశాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అకాల వర్షం కారణంగా చిత్తూరు జిల్లాలో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. 500 హెక్టార్లలో వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 100 హెక్టార్లలో టమాటా వంటి ఉద్యానవన పంటలు నీట మునిగాయి. జిల్లాలో రెండు ఆవులు, రెండు దూడలు, ఒక గొర్రె వర్షాల కారణంగా మృతి చెందాయి. వరి, ఉద్యానవన పంటలు కోత దశలు నీటిపాలు రావడంతో జిల్లాలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. చిత్తూరు పట్టణం తాగునీటి నిమిత్తం నిర్మించిన ఎన్టీఆర్ జలాశయం,  కార్వేటి నగరంలోని కృష్ణాపురం రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. కృష్ణాపురం రిజర్వాయర్  గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. అలాగే ఎన్టీఆర్ జలాశయంలో కూడా నిండి, నీటిని కిందికి వదులుతున్నారు.

తుఫాను కారణంగా చిత్తూరు జిల్లాలో సోమవారం 1079.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో సగటున  33.7 మిల్లిమిటర్ల  వర్షపాతం పడింది. చిత్తూరులో 63 మిల్లీమీటర్లు, సోమలలో 55.8 మిల్లీమీటర్లు, రామకుప్పంలో  46.4 మిల్లీమీటర్లు, చౌడేపల్లిలో 45 మిల్లీమీటర్లు, గుడిపాలలో 43.8, యాదమరిలో 42.6, ఎస్ఆర్ పురంలో 41.6, కార్వేటి నగరంలో 41.4, చిత్తూరు రూరల్ 39.4, శాంతిపురం 39.2, గంగవరంలో 37.8, వి కోటలో 37.4, పలమనేరులో 35.8, బైరెడ్డిపల్లి 34.6, గంగాధర నెల్లూరు మండలంలో 33.6, కుప్పంలో 33, సదంలో 32, పెనుమూరులో 32.4, గుడిపల్లిలో 28.8, బంగారుపాలెంలో 28.6, పాలసముద్రంలో 28.2 ,పూతలపట్టులో  26.6, తవణం పల్లిలో 26.26, పుంగనూరులో 25.6, ఐరాలలో  25, నిండ్రలో 24.6, పులిచెర్లలో 24, రొంపిచర్లలో 22.8, వెదురుకుప్పంలో 22, విజయపురంలో 21.,4 నగరరిలో 14.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం జిల్లాలో 1836 వర్షం పడగా, జిల్లా సగటు వర్షపాతం 57.4 నమోదయ్యింది. శనివారం జిల్లాలో 157 మిల్లిమిటర్ల వర్షం పడింది.  జిల్లా సగటు 4.9 గా నోమోదయ్యింది..

*500 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం*

పెంగాల్ తుఫాన్ కారణంగా చిత్తూరు జిల్లాలో సుమారు 500 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 15 మండలాల్లో 85 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 810 మంది రైతులు నష్టపోయారు. జిల్లాలో తవణంపల్లి, పెనుమూరు, పాలసముద్రం, నగరి, విజయపురం, నిండ్ర, గంగాధర నెల్లూరు, సోమల, గంగవరం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, శాంతిపురం మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో 446  హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. వుద్ధులు 11 హెక్టార్లలో, సజ్జలు రెండుహెక్టార్లలో, వేరుశనగ 21 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఎక్కువ పంటలు  పంట కోత దశలో ఉండగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తవణంపల్లి మండలంలో 1.4 హెక్టార్లలో, పెనుమూరు మండలంలో 0.6 హెక్టర్లు, పాలసముద్రం మండలంలో 10 హెక్టార్లు, నగరి మండలంలో 15 హెక్టార్లు, విజయపురం మండలంలో 10.5 హెక్టార్లలో, మండలంలో 18 హెక్టార్లు, గంగాధర నెల్లూరు మండలంలో ఒక హెక్టారు, సోమల మండలంలో పెద్ద 24 హెక్టార్లు, గంగవరం మండలంలో 19 హెక్టార్లు, పెద్దపంజాణి మండలంలో 42 హెక్టార్లు, పుంగనూరు మండలంలో 14 హెక్టార్లు, సదం మండలంలో 14 హెక్టార్లు, చౌడేపల్లి మండలంలో 7 హెక్టార్లు, బైరెడ్డిపల్లి మండలంలో 2.4 హెక్టార్లు, శాంతిపురం మండలంలో 8.8 హెక్టార్లు వ్యవసాయ పంటలైన వరి, వేరుశనగ దెబ్బతిన్నాయి. జిల్లాలో ఎక్కువగా వరి పంట కోత దశలో దెబ్బతిన్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ ప్రభుత్వానికి నివేదికను పంపారు.


*100 యాక్టర్లలో ఉద్యానవన పంటలకు నష్టం*

బెంగాల్ తుఫాన్ కారణంగా చిత్తూరు జిల్లాలో 100 యాక్టర్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని 38 గ్రామాలలో 152 మంది రైతులు నష్టపోయారు. కుప్పం, శాంతిపురం, వీకోట, బైరెడ్డిపల్లి, చౌడేపల్లి, పులిచర్ల, సోమల, రొంపిచర్ల, గంగవరం, వెదురుకుప్పం మండలాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. టమాటా పంట 18.8 హెక్టార్లలో, బంగాళాదుంప 69 హెక్టార్లలో, వంకాయ పంట ఒక హెక్టార్లలో, మిరపకాయలు ఒక హెక్టార్లలో, పొట్లకాయలు 4.8 హెక్టార్లలో, చిక్కుడుకాయ 2 హెక్టార్లలో, తమలపాకులు 0.1 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. చాలా వరకు పంటలు కోత దశలో దెబ్బతిన్నాయి. ఈ మేరకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

*అయిదు మూగ జీవాల మృత్యు వాత* 

తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో రెండు ఆవులు, రెండు దూడలు, ఒక గొర్రె మృతి చెందినట్లు జిల్లా కేంద్రానికి నివేదికలు అందాయి. పెద్దపంజాని మండలం శివాడి గ్రామంలో ఒక ఆవు, ఒక దూడ, చౌడేపల్లి మండలం చింతమాకులపల్లిలో ఒక ఆవు, నిండ్ర మండలం అన్నూరు ఎస్టీ కాలనీలో ఒక గొర్రె, ఇరుగువాయి హరిజనవాడలో ఒక దూడ చనిపోయినట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రాంబాబు తెలియజేశారు. అందువల్ల రైతులకు ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేశారు.

పో రై గంగ 1  పుంగనూరు మండలంలో దెబ్బతిన్న వరిపంట

గంగ 2 పెద్దపంజానిమండలం శివాడిలో మృతి చెందిన ఆవు, దూడ  


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *