11, డిసెంబర్ 2024, బుధవారం

జిల్లాలో 170 మంది సంఘమిత్రల తొలగింపు

 వైసిపితో అంటకాగిన సంఘమిత్రలు ఔట్

కూటమి ప్రభుత్వ విధేయులకు అవకాశం 

కోర్టు మెట్లు ఎక్కుతున్న సంఘమిత్రలు

పలువురి పునర్నియామకానికి కోర్టు ఆదేశాలు 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


వైసిపి పాలనలో  ఆ పార్టీ నేతలతో అంటకాగిన పలువురు సంఘమిత్రలు ఉద్యసనకు గురవుతున్నారు. తొలగించిన సంఘ మిత్రులు కొందరు నిబంధనలకు వ్యతిరేకంగా తమను తొలగించారంటూ హైకోర్టును ఆశ్రమిస్తున్నారు. కోర్టు కొందరు సంఘ మిత్రులకు అనుకూలంగా తీర్పు ఇస్తోంది. దీంతో తొలగించిన కొందరు తిరిగి విధుల్లోకి చేరుతున్నారు. మరి కొంతమందిని విధుల్లోకి తీసుకోకుండా, స్థానిక గ్రామ సమాఖ్యలు అడ్డుపడుతున్నాయి. కొందరు అధికారులు సంఘ మిత్రులను తొలగిస్తుండగా, కొన్ని గ్రామ సమస్యలు గతంలో ఉన్న సంఘ మిత్రులు తమకు వద్దని తీర్మానాలను ఆమోదిస్తున్నాయి. అన్యాయంగా సంఘం మిత్రులను తొలగిస్తున్నారంటూ పొడుపు మహిళలు కొన్ని చోట్ల  వారికి మద్దతుగా ఆందోళనకు దిగుతున్నారు 

చిత్తూరు జిల్లాలో 1,142 మంది సంఘమిత్రలు పనిచేస్తున్నారు. గ్రామ సమాఖ్యలలో  వీరు సేవలను అందిస్తున్నారు. మీరు డ్వాక్రా సంఘాలకు, మండల సమైక్యలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామస్థాయిలో డ్వాక్రా  సంఘాల పనితీరును పర్యవేక్షిస్తారు. నెలకు ఒకసారి  గ్రామ సమాఖ్య సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలలో డ్వాక్రా సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడానికి చర్యలు తీసుకుంటారు. సంఘాలు తాము బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాలను బ్యాంకులకు చెల్లించి, ఆ రసీదును గ్రామ సమాఖ్యకు అందజేయాల్సి ఉంటుంది. ఎవరైనా డ్వాక్రా సంఘ సభ్యులు బ్యాంకు రుణాలను చెల్లించుకుంటే వారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చెల్లించే విధంగా చూస్తారు. అలాగే బ్యాంకులకు, డ్వాక్రా సంఘాలకు అనుసంధానకర్తలుగా పనిచేస్తారు. అర్హత కలిగిన డ్వాక్రా సంఘాలకు బ్యాంకుఅధికారులతో మాట్లాడి రుణాలనుం ఇప్పిస్తారు. అందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ లో సహాయ సహకారాలను అందజేస్తారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా వీరు వంతు సహాయం చేస్తారు. ఆ గ్రూపు స్థితిగతులను బ్యాంకు అధికారులకు వివరిస్తారు. అలాగే శ్రీ నిధి కింద మహిళా సంఘాలకు రుణాలను మంజూరు చేస్తారు. మంజూరు చేసిన రుణాలను ప్రతినెల క్రమం తప్పకుండా వసూలు చేసి మండల సమైక్యకు జమ చేస్తారు. వీరు గ్రామంలో జరిగే డ్వాక్రా సంఘాల సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ సంఘాల పనితీరును విశ్లేషిస్తారు. ఎవరైనా సభ్యులు సంఘ సమావేశాలకు హాజరుకాకుంటే వారి మీద వత్తిడి తెచ్చి  హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. వీరు గ్రామ సమాఖ్య  లెక్కలను మొత్తం నిర్వహిస్తారు. అలాగే డ్వాక్రా సంఘాలలో ఎవరైనా లెక్కలను రాయకుంటే వారికి సహాయం అందించి ఆ సంఘం లెక్కలను కూడా వీరే రాస్తారు. ఇందుకు ప్రతిఫలంగా నెలకు 100 రూపాయలు చొప్పున ఆ సంఘం నుంచి తీసుకుంటారు. అయితే పలుచోట్ల సంఘ మిత్రుల మీద ఆరోపణలు, విమర్శలు ఎక్కువయ్యాయి. పలువురు సంఘ మిత్రులు అధికార పార్టీకి అంటకాగారని, నిబంధనలకు వ్యతిరేకంగా వారు చెప్పిన పనులన్నీ చేశారని విమర్శలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలలో అనర్హత పట్టించుకోవడంలేదని వారికి కూడా రుణాలు మంజూరు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. బ్యాంకులు డ్వాక్రా సంఘాలకు రుణాలన్న మంజూరు చేసినప్పుడు కొంత మొత్తం నగదును ప్రతి సభ్యురాలు నుంచి తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు సంఘమిత్రులు కొన్నిచోట్ల భారీ ఎత్తున అవినీతి, అవకతవకలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. సంఘమిత్రులు వసూలు చేసిన మొత్తాలను బ్యాంకులకు చెల్లించకుండా స్వాహా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇతరుల పేరు మీద గ్రూపుల మీద బ్యాంకు రుణాలను, శ్రీనిధి రుణాలు తీసుకుని సొంతానికి ఉపయోగించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది సంఘమిత్రలు ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని, వారికి ఓట్లు వేయవలసిందిగా ప్రచారం చేశారని ఆరోపణలో ఉన్నాయి. దీంతో వైసిపి పార్టీ అధికారాన్ని కోల్పోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో సుమారు 170 మంది వరకు సంఘ మిత్రులను తొలగించారు. వారి స్థానంలో కొత్త సంఘ మిత్రులను నియమించారు. అయితే తొలగింపులకు గురైన సంఘ మిత్రులు 36 మంది కోర్టు మెట్లు ఎక్కారు. వీరిలో పలువురిని తిరిగి విధుల్లోకి తీసుకోమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంఘ మిత్రుల పనితీరులో వెలుగు అధికారులు ఎవరు జోక్యం చేసుకోకూడదని, ఏదేని నిర్ణయం ఉంటే గ్రామ సమస్యలు తెలుసుకుంటాయని పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో, పలమనేరు నియోజకవర్గంలో ఎక్కువ మంది సంఘమిత్ర లు తొలగింపునకు గురయ్యారు. కుప్పం మండలంలో ఏడు మంది, గుడిపల్లిలో 16 మంది, శాంతిపురంలో 19 మంది, రొంపిచర్ల లో 14 మంది సంఘమిత్రులను తొలగించారు. అలాగే గంగవరం మండలం బండమీద జరావారి పల్లికి చెందిన సంఘమిత్ర శ్రీనివాసులను అధికారులు మార్పు చేశారు. అయితే అక్కడ సంఘమిత్రను తొలగింపునకు నిరసనగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. వెలుగు కార్యాలయం వద్ద నిరసనను తెలియజేశారు. నియోజకవర్గంలో వైసిపి పాలనలో పనిచేసిన సగం మంది సంఘమిత్రలను తొలగించినట్లు తెలుస్తోంది. తాము ఇంతకాలం కష్టపడి పని చేసినా,  తొలగించడం పట్ల సంఘ మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబందనలను పాటించకుండా  తొలగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘం మిత్రులకు నెలకు వేతనంగా 8 వేల రూపాయలను చెల్లిస్తారు. గ్రామ సమాఖ్య పుస్తకాలను రాసినందుకు మరో రెండు వేల రూపాయలను చెల్లిస్తారు. నెలకు మొత్తం పదివేల రూపాయలను సంఘమిత్రలకు వేతనంగా చెల్లిస్తారు. గతంలో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులు  సంఘమిత్రలుగా పనిచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత టిడిపి వారికి అనుకూలమైన వ్యక్తులను సంఘమిత్రులుగా నియమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుల కారణంగా వీరికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వామపక్ష పార్టిలు కూడా సంఘమిత్రలకు అనుకూలంగా అందోళనలు చేస్తున్నారు.

పో రై గంగ 1 డ్వాక్రా సంఘాలు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *