1, మే 2024, బుధవారం

హ్యాట్రిక్ విజయం దిశగా మంత్రి ఆర్కే రోజా

అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న ధీమా

సొంత నిదులతో నగరి, పుత్తూరు ఆస్పత్రుల అభివృద్ధి 

నియోజకవర్గంలో తగ్గిన అసమ్మతి 

అందరిని కలుపుకొని విజయం వైపు ప్రయాణం 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

మంత్రి, ఫైర్ బ్రాండ్ వైసిపి ఆర్ కె రోజా నగరిలో మూడవ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించే దిశగా పక్క ప్రణాళికతో ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆమె నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమ పనులు చేపట్టారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలే  ఆమెను గెలిపిస్తుందని నమ్ముతున్నారు. తన రాజకీయ చతురతతో అసమ్మతి నాయకులను కూడా దారిలోకి తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అసమ్మతి నేతలు కూడా రోజా విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. విభేదాలను పక్కన పెట్టి నియిజకవర్గంలో అందరిని కలుపుకొని విజయానికి బాటలు వేస్తున్నారు. నియజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే మంత్రిగా రోజా చేసిన అభివృద్దే నియోజకవర్గంలో కనిపిస్తోంది. మూడవ పర్యాయం కూడా రోజా గెలిచి, మళ్ళి మంత్రి పదవీ చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.


నగరి నియోజకవర్గంలో  నగరి, నిండ్ర, విజయపురం మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. పుత్తూరు, వదమాలపేట తిరుపతి జిల్లాలో ఉన్నాయి. నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు. అయితే వివిధ రకాల నిధులు తెచ్చి నియోజక వర్గాన్ని అభివృద్ది చేశారు.. ప్రభుత్వము, తుడా, క్రీడల, ఎంపి ల్యాడ్స్, అభివృద్ది సంస్థ, స్వంత నిధులు వెచ్చించి నియోజక వర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. రెండు మున్సిపాలిటీలకు సొంత  భవనాలు కట్టించారు. నగరిలో   ఆర్ డి ఓ కార్యాలయం ఏర్పాటు చేసారు. నగరి, పుత్తూరు రెండు చోట్ల డిఎస్పీ కార్యాలయాలు, వాహన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకుని వచ్చారు. రెండు పట్టణాలలో విద్యుత్ దహన వాటికలు, పార్కులు ఏర్పాటు చేసారు. కేంద్ర మంత్రి గడ్కారీ తో మాట్లాడి పుత్తూరు వద్ద ఆగిపోయిన రేణిగుంట- చెన్నై నాలుగు లైన్ల రోడ్డును పొడిగించారు. పుత్తూరులో పోలిటెక్నిక్ కళాశాల భవనం నిర్మించారు. విజయాపురం మండలంలో పరిశ్రమల అభివృద్ధి కోసం 200 ఎకరాలు, శిల్పారామంలో 12 ఎకరాలు కేటాయించారు. వడమాలపేటలో టౌన్ షిప్ కోసం కృషి చేసారు.పుత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కామరాజ్ నగర్ లో ఉన్న 300 కుటుంబాల ఇళ్లను కాపాడారు. ఆమె స్వంత నిధులతో నగరి, పుత్తూరు ఆసుపత్రిలో వారం వారం 500 మంది గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించి పోషకాహారం సమకూరుస్తున్నారు. నగరిలో 100 పడకల ఆసుపత్రి కట్టించారు. ముస్లింల కోసం రెండు సాధీ మహళ్ళు నిర్మించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు రోజాకు  బ్రహ్మ రథం పడుతున్నారు. 


ఆమె 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి, టిడిపి అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై 858 ఓట్ల మెజారిటీ గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ పై 2,708 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ సారి ఆమెపై టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ , కాంగ్రెస్ అభ్యర్థి పోచారెడ్డి రాకేష్ రెడ్డి మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా రోజా, భాను ప్రకాష్ మధ్యనే పోటీ నెలకొన్నది. గతంలో రోజాను వ్యతిరేకించిన  కొందరు నాయకులు ఇప్పుడు కలసి పని చేస్తున్నారు. ఒకరిద్దరు పార్టీ మారినా వారి ప్రభావం పెద్దగా ఉండదని అంటున్నారు. గాలి భాను ప్రకాష్ కు స్వంత ఇంటిలో, పార్టీలో వ్యతిరేకత ఇంది. ఇక్కడ రోజా భర్త సెల్వమని సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అలాగే వైసిపి మద్దతు దారులైని ఎస్సీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నియోజక వర్గం కొత్తగా ఏర్పడిన తరువాత 2009 లో టిడిపి అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమ నాయుడు స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగా రెడ్డిపై గెలిచారు. తరువాత రోజా రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం వైపు పయనిస్తున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *