8, మే 2024, బుధవారం

రోజా, కృపాలక్షి గెలుపు కోసం 40 రోజులుగా ఎన్నారై దీపా రెడ్డి ప్రచారం


చిత్తూరు, మే 7 (ప్రభ న్యూస్ ప్రతినిధి) అమెరికాకు చెందిన ఎన్నారై దీపా రెడ్డి గత 40 రోజులుగా వైసిపి విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఆళ్ళమడుగు గ్రామానికి చెందిన  దీపా రెడ్డి భర్త డాక్టర్ నల్లపరెడ్డి వాసుదేవ రెడ్డి జగన్ ప్రభుత్వంలో  ప్రభుత్వ గ్రామీణ వైద్య,ఆరోగ్య సలహాదారుడిగా నియమితులయ్యారు. అయన ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేస్తూ, అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ గౌరవ వేతనాన్ని కూడా తిరస్కరించి, వైసిపి కోసం పనిచేస్తున్నారు. ఇటేవల కాలంలో జిల్లాలో కూడా పర్యటించి ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును పరిశీలించారు. మెరుగైన వసతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  గతంలో వాసుదేవ రెడ్డి ఎన్నారై వైసిపి కన్వీనర్ గా పనిచేసారు, అయన సతీమణి దీపా రెడ్డి ఎన్నికలలో వైసిపికి ప్రచారం చేయడానికి చిత్తూరుకు విచ్చేశారు. ఆమె జిల్లా మొత్తం పర్యటిస్తున్నారు. వైసిపిని గెలిపించాలని కోరుతున్నారు. రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి  వైపు నడిపిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి సిఎంను చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ఎన్నారై నల్లపరెడ్డి దీపా రెడ్డి చెప్పారు. చిత్తూరు వైసిపి అభ్యర్థి ఎం సి విజయానంద రెడ్డి ప్రచారం కోసం చిత్తూరు వచ్చిన ఆమె తన భావాలను పంచుకొన్నారు. ఆమె గత 40 రోజులుగా జిల్లాలోని పూతలపట్టు, జి డి నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి నియోజక వర్గాలలో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో తిరిగి జగన్ మోహన్ రెడ్డి సిఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పూర్తి అయ్యేవరకు తాను జిల్లాలో ఉంటానని చెప్పారు. తన భర్త వాసుదేవ రెడ్డి కూడా పోలింగ్ కు ముందే ఇండియాకు వస్తారని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి గాలి వీస్తున్నందున తిరిగి జగన్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్కా చెల్లెమ్మల రక్షణకు జగన్ ప్రభుత్వం  దిశ యాప్ ను రూపొందించిందని, సచివాలయంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఆరోగ్య సురక్ష పథకం కింద చికిత్సలు చేసి, మందులు కూడా అందజేస్తున్నామని, 5 లక్షల  రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచమని చెప్పారు. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలని అందజేసి, జగనన్న  కాలనీల నిర్మాణం జరుగుతోందని వివరించారు. 130 సార్లు బటన్ నొక్కి 270  వేల కోట్ల రూపాయలను నేరుగా అకౌంట్లో జమ చేశారని గుర్తు చేశారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అమలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైయస్సార్ పింఛన్ బోరోసా,  రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, అమ్మవడి, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, డ్వాక్రా రుణమాఫీ,  సున్నా వడ్డీ పథకం, రజకులు, చేనేత, నాయి బ్రాహ్మణులకు చేయూత, పట్టాల పంపిణీ విషయాలను గుర్తు చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఎం చేయచేయాలేదన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను కూడా మాపీ చేయని చంద్రబాబు సూపర్ 6 పేరుతో మరో మారు ప్రజలను వంచించడానికి కూటమిగా ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు కొనసాగాలంటే, మళ్ళి జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జగన్ పట్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని. చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతం దీపా రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *