12, మే 2024, ఆదివారం

చిత్తూరు టిడిపిలో ఒక్క మగాడు


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

 ఆయనకు రాజకీయ అనుభం లేదు. రాజకీయ నేపథ్యం అంతకన్నా లేదు. గుడిపాల మండలంలో ఒక టీడీపీ అభిమాని. వ్యాపారం నిమిత్తం బెంగళూరు వెళ్ళారు. స్థిరాస్తి వ్యపారంలో సక్సెస్ అయ్యారు. రానున్న ఎన్నికలలో అభిమాన పార్టీ తరపున పోటీ చేయాలి అనుకున్నారు. అందుకు జిల్లా కేంద్రంలో ఉండాలని తొలుత ఒక ఇల్లు కొన్నారు. నిరాడంబరంగా గృహప్రవేశం చేశారు. ఆయన దృష్టి రాజకీయాలలో అంచలంచెలుగా ఎదిగిన సిఎం రమేష్ ఇంటి మీద పడింది. ఆ ఇంటిని కూడా కొనుకోలు చేశారు. తన అభిమాన నేత చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు తరలించారు. కలత చెందిన ఆయన చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ రాజశ్యమల యాగం చేశారు. ముఖ్యమైన టీడీపీ నేతలను ఆహ్వానించారు. దీనితో ఆయనను కూడా ఒక టీడీపీ నేతగా అని మీడియా గుర్తించింది. అయితే అయకు పార్టీలో పదవి కూడా లేదు. పదవి ఉంటేనే ప్రజాసేవ సేయాలని నిబంధన ఏదీ లేకపోవడంతో క్రమంగా ఇటు పార్టీ, అటు ప్రజల దృష్టిలో పడటానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. వ్యాపారస్తులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. దీపావళికి పేదలకు టపాకాయలను  పంచిపెట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ స్వీట్స్ అందచేశారు. రంజాన్ పండుగకు ముస్లింలకు టీడీపీ తరఫున రంజాన్ తొఫా అందచేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ లకు శుభాకాంక్షలు చెపుతూ పేదలకు ఆర్థిక సహాయం అందచేశారు. సంక్రాంతికి పేదలకు నిత్యావసర వస్తువులు, మహిళలకు చీరలు, జాకెట్లు అందచేశారు. దీంతో ఆయన పేరు నియోజకవర్గంలో మారుమోగడం  ప్రారంభం అయ్యింది. ఆయనే రానున్న ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అని కొందరు అన్నారు. కొందరు చాలా తేలిగ్గా తీసుకున్నారు. చిత్తూరులో రాజకీయం చేయడం అంత ఈజీ కాదు. అప్పటికే చిత్తూరు నుండి అయిదు సార్లు విజయం సాధించిన రాజకీయ ఉద్దండుడు సికే బాబు, కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు అనందయ్య కరోనా మందును సరఫరా చేసి, విరివిగా అన్నదానం చేసి ప్రజల మనస్సు గెలుచుకున్న జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కాజూరి బాలాజీ, పార్టీ కోసం కుటుంబాన్ని పోగొట్టుకున్న మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా పరిషత్ మాజీ  చైర్ పర్సన్ గీర్వాణి భర్త, చిత్తూరు మాజీ ఎంపీపీ చంద్ర ప్రకాష్ టిక్కెట్టు రేసులో ఉన్నారు. వీరిని కాదని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ వ్యక్తికి టిక్కెట్టు ఎలా వస్తుందని రాజకీయ పరిశీలకులు సైతం సందేహం వ్యక్తం చేశారు. అయినా నిరాశ చెందలేదు. అడుగు వెనక్కి పడలేదు. యువగళం ముగింపు సభకు సొంత నిధులతో 40 లక్షల సొంత నిధులతో చిత్తూరు నుండి విశాఖ వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. లైన్స్ క్లబ్ నూతనంగా నిర్మిస్తున్న శ్మశాన వాటికకు బర్నింగ్ మిషన్ కోసం మరో 40 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.  మేలుమరవత్తూరు వెళ్లే ఓం శక్తి భక్తులకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీలో టిక్కెట్టు రేసులో అందరినీ పక్కకు నెట్టి ముందు వరుసలో నిలిచారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఒక ప్రతిపాదన చేశారు. టిక్కెట్టు ఆశిస్తున్న అయిదు మంది ఉమ్మడిగా పట్టణంలో ప్రచారం చేద్దాం. ఎవరికి టిక్కెట్టు వచ్చినా, అందరూ కలిసి పనిచేద్దాం అన్నారు. ఇందుకు ఒకే అని ఉమ్మడి ప్రచారం ప్రారంభించారు. ఒక వైపు ఉమ్మడి ప్రచారం జరుగుతుండగా, చంద్రబాబు నాయుడు చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ నాయుడు పేరు ప్రకటించారు. దీంతో మిగిలిన ఆశావహులు నిరాశకు గురయ్యారు. రాజకీయాలకు కొత్త వ్యక్తికి టీడీపీ టిక్కెట్టు లభించడంతో టీడీపీ ఓటమి ఖాయమని, వైసిపి విజయం తథ్యమని పలువురు భావించారు. గురుజాలకు మిగిలిన అభ్యర్థులు సహకరించారని, పాపం గురజాల అన్న వారు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడే గురజాల వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదట టిక్కెట్టు రేసులో ఉన్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారి సహాయసహకారాలు అర్థించారు. పార్టీ అధికారంలోకి వస్తే నామినేషన్ పదవులకు తనవంతు సహాయం చేస్తామన్నారు. ప్రచార బాధ్యతలను వారికి అప్పగించారు. టిక్కెట్టు రేసులో ఉండిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబును కలిశారు. తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీకే బాబు ఆత్మీయ సమావేశం పెట్టి, జగన్మోహన్ నాయుడుకు మద్దతు ప్రకటించారు. దీంతో గురుజాలకు వేయి ఏనుగుల బలం చేకూరినట్లు అయ్యింది. మరో మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్ ను కలిశారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. గురుజాలకూ మద్దతు ప్రకటించారు. దీంతో గురుజాలకు ఆత్మ విశ్వాసం ద్విగుణీకృతం అయ్యింది. సీకే బాబు, ఏ ఎస్ మనోహర్ లను పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడించారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న అశోక్ ఆనంద్ యాదవ్ కూడా కలిశారు. బీజేపీ, జనసేనా నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమైన కులసంఘాలతో సమావేశమయ్యారు. వారి మద్దతు కోరారు. ఈ లోపు చిత్తూరు ఎమ్మెల్యే జంగలపల్లి శ్రీనివాసులు జనసేనలో చేరడంతో బలిజ సామాజిక వర్గం మద్దతు లభించింది. అసమ్మతిని సమ్మతిగా మార్చుకొని ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఏ ఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కాజూరు బాలాజీ, చంద్ర ప్రకాష్, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సి ఆర్ రాజన్, బీజేపీ, జనసేన నాయకులతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ఒక రేంజ్ లో సాగింది. అతిరథ మహారథులు వెంటరాగా టీడీపీ ప్రచారం కన్నుల పంటగా సాగింది. టీడీపీ చిత్తూరు చరిత్రలో ఎన్నికల ప్రచారంలో ఇంతమంది అగ్రనేతలు పాల్గొన్నది ఎప్పుడూ లేదు. దీంతో తొలుత అయ్యో పాపం గురజాల జజన్మోహన్ అన్న వారే శహబాస్ అన్నారు. గురజాల కాకుండా మరొకరు అయితే ప్రచారానికి ఎంత ఊపు వచ్చేదికాదని జనం అనే స్థాయికి వెళ్ళింది. వైసిపి అభ్యర్థి విజయానంద రెడ్డిని గురజాల కాకుండా మరొకరు అయితే ఎదుర్కొనే పరిస్థితి లేదని మాట్లాడుకుంటున్నారు. వేరే ఎవరూ అభ్యర్థి  అయినా ఇంత డబ్బు పెట్టేవారు కాదని, టీడీపీకి ఇంత ఊపు వచ్చేది కాదని అంటున్నారు. విజయానండ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా పథకం ప్రకారం ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన గెలుపు తప్పదు అనుకొనే సమయంలో గురజాల రంగప్రవేశం చేసి, చిత్తూరు ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశారు. విజయానండ రెడ్డి అభ్యర్థి అయితే  టీడీపీ కనీస  పోటీ కూడా ఇవ్వలేంది అనుకొనే స్థాయి నుండి గట్టి పోటీకి ఎదిగింది.  అనంతరం సమిష్టి కృషితో  విజయం వైపు గురజాల జగన్మోహన్ నాయుడు  అడుగులు వేస్తున్నారు. గురుజాల విజయానికి శనివారం చిత్తూరులో జరగనున్న పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం మరింత సహకరించకలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *