25, మే 2024, శనివారం

ప్రశాంతంగా ముగిసిన ఉప విద్యాశాఖ అధికారుల రాత పరీక్ష


ఉప విద్యాశాఖ అధికారుల నియామకం కోసం చిత్తూరు జిల్లాలో శనివారం ఏ పి పి ఎస్ సి నిర్వహించిన రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు 434 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 296 మంది అభ్యర్థులు హాజరు కాలేదు. పరీక్షలకు మొత్తం 730 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. వీరికి మూడు కేంద్రాలలో పరీక్షలను నిర్వహించారు. పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపంలోని వేము కళాశాలలో, చిత్తూరులోని సీటమ్స్ కళాశాలలో, పలమనేరులోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో వీరికి పరీక్షలను నిర్వహించారు. ఈ పరిక్షల నిమిత్తం జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు 730 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, చిత్తూరులోని సీతమ్స్ కళాశాల లో 150 మంది, పూతలపట్టు లోని వేము ఇంజనీరింగ్ కళాశాల లో 330 మంది, పలమనేరు లోని మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో 250 మంది అభ్యర్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయదానికి ఏర్పాట్లు చేశారు. పరీక్షా సమయం ఉ. 9 నుంచి 11. 30 లు కాగా, ఉ.7.00 గం. ల నుండి ఉ.8.30 గం.ల మధ్య మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోకి అనుమతించారు.  క్షణం ఆలశ్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల రవాణా సదుపాయం కోసం ఆర్టీసీ వారు తగు ఏర్పాట్లు చేశారు. ఆబ్జెక్టివ్ తరహాలో కంప్యూటర్ల మీద పరీక్ష ఉన్నందున విద్యుత్ శాఖ  నిరంతర విద్యుత్ సరఫరా ఇచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ వారు ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహించారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరిక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులు ఉపిరి పీల్చుకున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *