జిల్లా టిడిపికి పెద్ద దిక్కుగా ఎంపి అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గు మల్ల ప్రసాదరావు పెద్దదిక్కుగా మారుతున్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల సమరాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల అవసరాలను గుర్తిస్తూ వారికి తగు సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైన సూచనలు కూడా చేస్తున్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో గెలుపే ధ్యేయంగా దగ్గుమల్ల ప్రసాదరావు పక్క వ్యూహరచనతో ముందుకు వెళుతున్నారు.
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పులివర్తి నాని పనిచేశారు. ఆయన చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి కావడంతో తొలినుంచి చంద్రగిరి నియోజకవర్గ మీదనే దృష్టిని కేంద్రీకరించారు. అభ్యర్థుల ఖరారు కాకముందు నుంచే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. అయన తిరుపతిలో నివాసం ఉంటూ, ఆయన అయినా సతీమణి కుమారుడు నియోజకవర్గ మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. అక్కడ వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కట్టడి చేయడానికి ఛాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నారు. రెండుసార్లు సాధించిన వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పర్యాయం తన రాజకీయ వారసుడిగా మోహిత్ రెడ్డి బరిలోకి దించారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన మోహిత్ రెడ్డి ఎలాగైనా గెలవాలని సర్వశక్తులను వడ్డుతున్నారు. దీంతో జిల్లాలో పార్టీని సమన్వయం చేసే నాయకుడు కరవయ్యారు. నానిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తిరుచానూరు కి చెందిన మాజీ సర్పంచ్ సిఆర్ రాజన్ ను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చిత్తూరు టికెట్టును ఆశించారు. చిత్తూరు టిక్కెట్టు గురజాల జగన్ మోహన్ నాయుడు కు కేటాయించడంతో ఆయనను చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారు. రాజన్ పార్టీకి, చిత్తూరు జిల్లాకు కొత్త కావడంతో జిల్లా మీద అంతగా అవగాహన లేదు. దీంతో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గు మళ్ల ప్రసాదరావు జిల్లాను పూర్తిగా సమన్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇదివరకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జిల్లా మొత్తం పర్యటించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. జిల్లాలో అభ్యర్థుల ఎంపికనుండి అంతా తానే వ్యవహరించారు. అయితే ఎన్నికల దగ్గర పడడంతో అమర్నాథరెడ్డి నియోజకవర్గానికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గ ప్రజలను ఒకటికి రెండుసార్లు కలుసుకుంటూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు. దీంతో అమర్నాథ్ రెడ్డి జిల్లా రాజకీయాల మీద తన దృష్టిని తగ్గించారు. ఇప్పుడు ఆ బాధ్యత కూడా దగ్గుమళ్ల మీద పడింది. దగ్గుమల్ల నగిరి నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాలను తనదైన శైలిలో సమన్వయం చేసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తున్నా.రు అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తూ, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ప్రసాదరావు కులాల వారీగా కూడా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందరి మనోభావాలను తెలుసుకొని పార్టీని ముందుకు నడుపుతున్నారు. పార్టీని విజయపథంలో నడపడమే ధ్యేయంగా దగ్గుమల్ల పనిచేస్తున్నారు.