7, మే 2024, మంగళవారం

అపరిచితుడిగా వచ్చి .. సుపరిచితుడై.. విజయపధంలో దగ్గుమళ్ళ


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు పార్లమెంటుకు టిడిపి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు పేరు తెలమీదికి వచ్చినప్పుడు పలువురు చాలా తేలిగ్గా తీసుకున్నారు. బాపట్లకు చెందిన దగ్గుమళ్ల కు చిత్తూరు ఎంపీ టికెట్లను ఇస్తే ఎవరు ఓటు వేస్తారని ప్రశ్నించినవారూ లేకపోలేదు. ఇందుకు కారణం కూడా ఉంది. ఇదివరకు చిత్తూరు పార్లమెంటు సభ్యులుగా టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొందిన నూతన కాలువ రామకృష్ణారెడ్డి, డికే ఆదికేశవులు, నారమల్లె శివప్రసాద్ జిల్లాకు చెందిన వారే. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేదు. కావున దగ్గు మళ్ల ప్రసాదరావు పేరు తెరమీదకి వచ్చినప్పుడు అది నిజం అవుతుందని చాలామంది భావించలేదు. క్రమంగా దగ్గుమల్ల పేరు తెలుగుదేశం వర్గాలలో, మీడియాలో నానడం ప్రారంభించింది. ఉన్నత స్థాయి అధికారిగా, విద్యావేత్తగా, సేవా భావం, అంకిత భావం, ప్రజా సేవలో తరిమ్చాలనే తపన, ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడిగా క్రమంగా ఆయన పేరు తొలుత టిడిపి శ్రేనుల్లోకి, అనంతరం ప్రజల్లోకి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ  ఒక పథకం ప్రకారం దగ్గుమల్లను ప్రజలకు చేరువ చేయడానికి  ప్రయత్నం చేశారు. ఇది విజయవంతం కావడంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గమల్ల ప్రసాదరావును తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పేరు ప్రకటించిన తర్వాత కూడా ప్రజలలో అంత స్పందన రాలేదు. ఆయన చిత్తూరుకు వచ్చి కార్పొరేట్ తరహాలో కార్యాలయాన్ని ప్రారంభించారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ, అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. శాసనసభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులకు నేను ఉన్నానని భరోసా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులను తొలుత తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఒక పటిష్టమైన ఎన్నికల ప్రణాళికను గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందించి విడుదల చేశారు. ఎన్నికల ప్రణాళికను ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో, ప్రచార కార్యక్రమంలో, బహిరంగ సభలలో దగ్గమల్ల ప్రసాదరావు పాల్గొంటున్నారు. జిల్లా మీద తనకున్న అవగాహన, జిల్లాలోని సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తన దగ్గర ఉన్న మార్గాలను ప్రజలతో పంచుకున్నారు. క్రమంగా దగ్గుమల్ల ప్రసాదరావు సాధారణ ఓటర్లకు కూడా పరిచయమయ్యారు. ఆయన ఎన్నికల ప్రణాళిక గురించి పట్టణాలలో ప్రారంభమైన చర్చ గ్రామాలకు కూడా పాకింది. ఆయన ఎన్నికల ప్రణాళికలో తనకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి అన్న విషయం మీద చర్చ కూడా ప్రారంభమైంది. క్రమంగా దగ్గుమళ్లను సొంతం చేసుకోవడం ప్రారంభమైంది. అనతి కాలంలోనే దగ్గుమల్ల ప్రసాదరావు పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు పరిచయమయ్యారు. ఎన్నికల రణరంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. చిత్తూరు జిల్లాకు నాన్ లోకల్ అంటూ ఒక అపరిచితుడుగా జిల్లాకు విచ్చేసి, ప్రస్తుతం చిర  పరిచితుడుగా, విజయ పదంలో దగ్గుమళ్ల దూసుకుపోతున్నారు. 
చిత్తూరు లోక్ సభ టిడిపి అభ్యర్థిగా దగ్గుమల్ల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేశారు. డజనుకు పైగా అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. ఈ సారి ఎలాగైనా గెలుపు గుర్రాన్ని బరిలో దింపాలని చూస్తున్నారు. ఇప్పటి పరిస్తితులలో లోక్ సభ గెలుపు అంత సులభం కాదని గుర్తించారు. గతంలో కేవలం కుప్పంలో వచ్చే మెజారిటీ వల్ల ఎంపీ అభ్యర్ధి గెలిచిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్తితి లేదు. 2019 ఎన్నికల్లో కుప్పంలో 30,722 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ సారి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని టిడిపి అంటోంది. అయితే చంద్రబాబును ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం కుప్పం మీద ఆధారపడితే లోక్ సభ స్థానం గెలవడం కుదరదని భావించారు. దీనితో ఈ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో బలమైన అభ్యర్థులు ఉండేలా జాగ్రత్త పడ్డారు. లోక్ సభకు బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే క్రమంలో ఆర్థిక బలం కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఖర్చు పెట్టే గల వ్యక్తి కోసం అన్వేషణ సాగింది. తిరుపతికి చెందిన మాజీ ఐ ఆర్ ఎస్ అధికారి హరిబాబు, వేపంజేరి మాజీ ఎం ఎల్ ఏ డా. రవి, శాంతిపురానికి చెందిన జయప్రకాశ్, జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షుడు పీటర్, సినీనటుడు సప్తగిరి కూడా చిత్తూరు పార్లమెంటు టిక్కెట్టును ఆశించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఆమె గతంలో రెండు సార్లు తిరుపతి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి అక్కడ వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పోటీలో నిలిపితే, పనబాక లక్ష్మిని చిత్తూరు బరిలో దించుతారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె తనకు కానీ లేదా తన భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే టికెట్టు కావాలని కోరారు. అయితే చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్దమని ప్రకటించారు. రిటైర్డ్ ఎస్. పి. చిన్నస్వామి కూడా టికెట్టును ఆశించారు. ఆరు నెలల క్రితం ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. జి డి నెల్లూరు మండలానికి చెందిన ఆయన గతంలో ఎనిమిది మంది ప్రధాన మంత్రుల వద్ద భద్రతా అధికారిగా పనిచేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆ కోటాలో టికెట్టును ఆశించారు. రాయలసీమలో రెండు లోక్ సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేశారు. ఇందులో ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. తనకు లోక్ సభ కేటాయించాలని ఆయన కోరారు. సినీనటుడు సపతగిరి ప్రసాద్ పేరు కూడా ఒక దశలో పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. విద్యార్హతలు, అనుభవం, ఆర్థిక పరిస్థితి, నిస్వార్థ సేవ, కలుపుకోలుతనం, పదవికి హుందాతనాన్ని తెస్తూ, జిల్లా అభివృద్దికి బాటలు వేసే వ్యక్తి కోసం అన్వేషించి, చివరకు దగ్గుమళ్ళ ప్రసాదరావు పట్ల మొగ్గు చూపారు. చంద్రబాబు ఆశించిన దానికంటే, దగ్గుమళ్ళ మరింత వేగంగా ఎన్నికల బరిలోకి దూసుకుపోతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. తనదైన ముద్ర వేస్తున్నారు. బలమైన ఎన్నికల టీం ను ఏర్పాటుచేసుకున్నారు. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అన్నింటికీ మించి విజయకేతనం ఎగురవేయడానికి సిద్దం అవుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *