14, మే 2024, మంగళవారం

భారీగా పెరిగిన ఓటింగ్ ఎవరి కొంప ముంచుతుంది?

అభివృద్దికి మద్దతు పలికరంతున్న వైసిపి 
ప్రభుత్వ వ్యతిరేక ఫలితం అంటున్న టిడిపి 
అంచనాలకు అందని పోలింగ్ సరళి 
లోలోన గుబులుగా ఉన్న ఇరు పార్టీలు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

ఈ పర్యాయం సాధారణ ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో ఓటింగ్ శాతం భారీగా  పెరిగింది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయన్న చర్చ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లభిస్తుంది అన్న విషయంలో జోరుగా  చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీ కి ఆ పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకు అనుకూలంగా కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే భారీగా పోలింగ్ పెరిగిందని ఒక వర్గం అంటుండగా, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమీ లేదని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు అనుగుణంగానే ప్రభుత్వానికి మద్దతుగా భారీగా ఓటింగ్ శాతం పెరిగిందని మరో వర్గం వాదిస్తోంది. 

చిత్తూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో 78.04 శాతం ఓటింగ్ నమోదు కాగా 2019 ఎన్నికలలో 81.03% ఓటింగ్ నమోదయింది. 2019లో పెరిగిన మూడు శాతం ఓటర్లు అధికార పక్ష్యానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ  అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఈ పర్యాయం 82.65 శాతం ఓటింగ్ నమోదయింది. అంతే గత ఎన్నికలతో పోలిస్తే 1. 62 శాతం మాత్రమే అదనంగా పోలింగ్ నమోదయింది. ఈ అదనంగా నమోదైన పోలింగ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్న విషయం మీద రాజకీయ నాయకులు పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఎవరు ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. రాజకీయ పార్టీలు అయితే ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ తమ విశ్లేషణలను వినిపిస్తోంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఈసారి ఏ పార్టీ విజయం సాధించిన సునామీ సృష్టిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. 

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయం ప్రకారం జరిగిన భారీగా జరిగిన ఓటింగ్  తమకు లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అధికార పార్టీపైన సాధారణంగా వ్యతిరేకత ఉంటుందని, ఆ వ్యతిరేకత పోలింగ్ రూపంలో బయటపడిందని భావిస్తున్నారు. ప్రభుత్వం నవరత్నాల పేరుతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టిందని, పెరిగిన విద్యుత్తు చార్జీలు, నిరుద్యోగం, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు అందకపోవడం, రివర్స్ పి ఆర్ సి, పెన్షనర్స్ కూడా సకాలంలో డబ్బులు పడకపోవడంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, మందుబాబులు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకున్నారని అంచనా వేస్తున్నారు. వీటికి తోడు పనులు చేసినా, కాంట్రాక్టర్లకు  బిల్లులు చెల్లించకపోవడం,  ప్రభుత్వ అభివృద్ధి పలాలు అందని ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చని భావిస్తున్నాను. రోడ్ల మరమత్తులు చేపట్టకపోవడం, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే డీజిల్, పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండటం కారణంగా వాహనదారులల్లో కూడా వ్యతిరేకత ఉందని ఊహిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెల్లాల్చిన  పరిస్థితి ఏర్పడింది. దీంతో యువత కూడా వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. 

అధికార వైసీపీ నాయకుల వాదనలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం కానీ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఇంతవరకు జమ చేసింది చరిత్రలో లేదంటున్నారు. ప్రతి కుటుంబానికి ఏదో రకంగా లబ్ధి చేకూరిందని, భారీ ఎత్తున ఇళ్లపట్టాలి ఇవ్వడం, ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని చెబుతున్నారు. అమ్మఒడి, రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, ఆటో కార్మికులకు, రిక్షా కార్మికులకు నిధులు విడుదల చేయడం, మత్స్యకారులను ఆదుకోవడం, చేతివృత్తుల వారికి ఆర్థికంగా సహకరించడం ఇలా అన్ని వర్గాలను జగనన్న ఆదుకున్నారని, రాష్ట్రంలో జగనన్న సహాయం అందుకొని  కుటుంబం లేదని వివరిస్తున్నారు. జగనన్న ఓడిపోతే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయని, కావున అమలు అవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడానికి మద్దతుగా భారీ ఎత్తున ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమకు మద్దతు ప్రకటించాలని భావిస్తున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తున్నా,  లోలోపల మాత్రం ఇరు పార్టీల నేతలకు గుబులు కలిగిస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికొంప ముంచుతుందా అన్న భయందోళనలు  ఇరు పార్టీల నేతలలో ఉన్నట్లు తెలుస్తుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *