17, మే 2024, శుక్రవారం

రికార్డులను సొంతం చేసుకున్న 2024 ఎన్నికలు !

గరిష్టంగా ఓటింగ్ శాతం నమోదు 

అత్యధికంగా డబ్బుల వ్యయం 

ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి ఓటింగునకు 

సోషల్ మీడియా కోసం భారీ వ్యయం 

ప్రతి ఓటరుకు నగదు పంపిణి 

వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువే 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

2024 ఎన్నికలు పలు రికార్డులను దద్దలు కొట్టాయి. ఏపీలో ఇంతవరకు ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల్లో డబ్బు ప్రవహించింది. గరిష్టంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే పలు నియోజక వర్గాలలో వెన్నుపోటు రాజకీయాలు దర్శనమిచ్చాయి. పలువురు నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు డబ్బుకు లోకం దాసోహం  అన్నట్టు వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా వైసిపి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంపి అభ్యర్థులు 100 నుంచి 150 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఓటరుకు రెండు పార్టీలు 2000 వేల చొప్పున పంపిణీ చేసారు. అతి తక్కువ నియోజక వర్గాలలో కొందరు ఓటర్లకు వెయ్యి చొప్పున ఇచ్చారు. కొన్ని నియోజక వర్గాలలో నాలుగైదు వేలు పంచిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఎన్నికల షెడ్యూలు విడుదల అయిన తరువాత ఈ రెండు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా  పెట్టిన ఖర్చు 20 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సారి 80 శాతం మంది అభ్యర్థులకు పార్టీలే నిధులు సమకూర్చాయి. రెండు పార్టీలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, ముఖ్యంగా కుల సంఘాలు నిధులు సమకూర్చారు. ఇదిలా ఉండగా రెండు పార్టీలు ఈ ఐదేళ్ళలో సోషియల్ మీడియా ప్రచారాలకు, సర్వేల కోసం వేల కోట్లు ఖర్చు చేశాయి. అలాగే ప్రతి నియోజక వర్గం ఇంచార్జి కొట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇంత చేసినా గెలుపు ఎవరిదో చెప్పలేని పరిస్థితుల్లో నెల కొన్నాయి. ఎక్సిట్ పోల్స్ పై నిషేధం ఉన్నప్పటికీ పలు సంస్థలు ఏదో ఒక మార్గంలో ఏక పక్షంగా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజకీయాలు డబ్బు చుట్టూ తిరిగి చతికిల పడ్డాయి. ఒక విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలకు కనువిప్పు కలిగిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. కోర్టుకు వెళ్ళిన వారు కొల్లబోయిన వారు ఒకటే అంటారు. కేసు గెలిచిన వారు ఇంటికి వెళ్లి ఏడుస్తారు, ఓడిన వారు కోర్టు వద్దే ఏడుస్తారు అన్నది సామెత. ఈ నానుడి ఇప్పుడు రాజకీయాలకు వర్తిస్తుంది.  ఈ సారి ఎవరికీ ఎదురులేని మెజారిటీ రాదు. గతంలో లాగా అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఉండదు. ప్రతి పక్షం బలంగా ఉండటం, సోషియల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అధికార  పార్టీ ఆటలు సాగవు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ధనప్రవాహం చూసి, గతంలో పోటి చేసిన అభ్యర్థులు నోరెళ్ళబెడుతున్నారు. గతంలో ఓటుకు 100 నుంచి 500 రూపాయలను పంచి, ఎం ఎల్ ఏ అయిన వారు ఉన్నారు. ఈ పర్యాయం అది కాస్త రెండు వేల నుండి నాలుగు వేలకు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రులు కూడా డబ్బులు పంచడం విశేషం. ఒక మాజీ ముఖ్యమంత్రి తొలుత ఈరెండు వేలు పంచారు. ప్రత్యర్థి నాలుగు వేలు పంచడంతో తాను మళ్ళి ఇంకో రెండు వేలు పంచినట్లు సమాచారం. ఒక మంత్రి మూడు వెలను పంచినట్లు సమాచారం.  ఇంత వ్యయం చేసినా గెలుస్తామన్న గ్యారెంటి లేదు. దీంతో సామాన్యులు ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితులు కనిపించడం లేదు. .

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *