26, మే 2024, ఆదివారం

రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై సిబిఐ లేక హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి

టిడిపి రాష్ట్ర అధికార ప్రదినిది వి. సురేంద్రకుమార్ డిమాండ్

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్  వెంటనే జోక్యం చేసుకొని  వీటిపై సిబిఐతో గాని, హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో గాని విచారణ జరిపించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రదినిది వి. సురేంద్రకుమార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర హోం శాఖ  కూడా రాష్ట్ర చీఫ్  సెక్రెటరీపై వచ్చిన ఆరోపణలపై సిబిఐతో విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాలని కోరారు. ఆదివారం  చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో   టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల  సురేంద్ర కుమార్ విలేకరులతో  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఒక అత్యంత బాధ్యతాయుతమైన పదవనీ, ఆ పదవి లో ఉన్న జవహర్ రెడ్డి  ఏకపక్షంగా వ్యవహరించడం చాలా దారుణమని విమర్శించారు. రాష్ట్ర పరిపాలనలో చీఫ్ సెక్రటరీ ది ఒక బాధ్యత యుతమైన పదవిలో ఉండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరిని రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేయించే బాధ్యత,  అధికారం రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ  జవహర్ రెడ్డికి ఉంటుందన్నారు. అటువంటి చీఫ్ సెక్రటరీగా జవహర్  రెడ్డి   బాధ్యతలు స్వీకరించినప్పుడు నుండి ముఖ్యమంత్రి  జగన్ మోహన్ కి అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నరని ఆరోపించారు. ముఖ్యమంత్రిని సంతృప్తి పరిచే విధంగా చీఫ్ సెక్రటరీ పనితీరు ఉంది తప్ప  నిష్పక్షపాతంగా పరిపాలన , బాధ్యతలు నిర్వించే  పరిస్థితులు కనబడడం లేదన్నారు. రాష్ట్రలో  ఎన్నికల సమీపిస్తున్నప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ  ఏకపక్షంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పక్కన పెట్టి వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిమ్చినా, చీఫ్ సెక్రటరీ  వాటి పైన స్పందించలేదన్నారు. పోలింగ్ రోజు,  పోలింగ్ తర్వాత గానీ జరిగిన హింసాత్మక ఘటనలపై సరైన రీతిలో  స్పందించిన పాపాన పోలేదన్నారు. ఫలితంగా  చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పైన, పోలింగ్ ఏజెంట్లు పైన, చివరికి టిడిపి కి ఓటు వేసిన ప్రజలపై కూడా దాడులు చేస్తూ హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చీఫ్ సెక్రటరీ వీటిపై తీవ్రంగా స్పందించకుండా లేదు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనీ, ముఖ్యంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో వాలంటరీ ద్వారానగదు  పంపిణీ చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ సిబ్బందిని లబ్దిదారుల  ఇంటి వద్ద కు నగదు పంపిణి చేసే ఏర్పాట్లు చేయకుండా వారిని గ్రామ / వార్డు సచివాలయాల, బ్యాంకులకు వచ్చి తీసుకునే విధంగా చేశరన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పై అసైన్డ్ భూములు వ్యవహారములు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంతున్నారని, అన్నింటి మీద సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని సురేంద్రకుమార్ డిమాండ్ చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *