16, మే 2024, గురువారం

చిత్తూరు గంగ జాతరకు అంకురార్పణ

21, 22 తేదిల్లో చిత్తూరులో గంగజాతర

21న సికే బాబు దంపతులచే తొలి పూజ 

22న పట్టు వస్త్రాల సమర్పణతో నిమర్జనం 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

 రాయల సేమలోనే అతి పెద్ద చిత్తూరు గంగాజతరకు అంకురార్పణ జరిగింది. వాస్తవంగా 13, 14 తేదిల్లో చిత్తూరు గంగ జాతర జరగల్చి ఉంది. ఎన్నికల కారణంగా పోలీసు బందిబస్తూ ఇవ్వలేమని, వాయిదా వేసుకోవల్చిందిగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఈనెల 21,22 తేదీల్లో అత్యంత వైభోపేతంగా జాతర నిర్వహించబోతున్నట్లు మీరాశీలు ప్రకటించారు. జాతర వేడకల్లో తొలిఘట్టమైన చాటింపు కార్యక్రమాన్ని అనువంశీక మీరాశీలైన సి.కె.బాబు కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి శాస్రోక్తంగా నిర్వహించారు.  డాక్టరు సి.కె. లావణ్యబాబు, సి.కె. సాయికృష్ణారెడ్డి గ్రామ పోలిమేర్లలో గంగమ్మతల్లికి శాస్రోక్తకంగా పూజాధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పోన్నియమ్మన్‌ దేవస్థానంలో చాటింపు ప్రారంభించి... అమ్మవారు కొలువుదీర్చి ప్రాంతంలో మూలవర్లను ప్రతిష్టించారు. భక్తశ్రద్దల నడుమ జగన్మాతకు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు.  ఆదిపరాశక్తి అంశాలైన గంగమ్మ, మారెమ్మ, పోన్నియమ్మ, కరుమారియమ్మ, ముత్తు మారెమ్మ, పోలేరమ్మ విరుపాక్షిమ్మ వరకు.. స్త్రీ మూర్తులంతా గ్రామదేవతలుగా అవతరించి.. గ్రామ రక్షకులయ్యారు.  ఇక కుప్పం నుంచి చిత్తూరు, తిరుపతి. దాకా ఏ పల్లె చూసినా ఏ పట్టణ చూసినా అమ్మవారి జాతర సంబరాలతో మే మాసమంతా సందడిగా మారనుంది.  సమాజంలో బలంగా వేళ్లానుకున్న పురుష స్వామ్యవ్యవస్థలో ఇంకా పూరాతన గ్రామ దేవత మూర్తులు పూజలందుకుంటున్నారు. తిరుమల ఏడుకొండల స్వామి , శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరస్వామి, కాణిపాక వినాయకస్వామి అధిపత్యంగా వెలిగిపోతున్న చిత్తూరు జిల్లాలో స్త్రీ దేవతలైన అమ్మవార్లు, ఏడాది ఒకసారి ఘనంగా పూజలందుకుంటారు. ఆ ఆపూర్వ ఘట్టానికి సమయం అసన్నమైయ్యింది. చిత్తూరు జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ప్రాశ్యస్తం, ప్రాచుర్యం కలిగిన నడివీధి గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 21, 22  తేదీల్లో జరిగే ఈ జాతర ఉత్సవాలకు చిత్తూరు ప్రజానీకం సిద్ధపడుతున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే వంశపార్యంపర ధర్మకర్త సీకేబాబు ఆధ్వర్యంలో శోభయమానంగా నిర్వహించే ఈ జాతర వేడుకలను మంగళనాడు నాడు చాటింపుతో అంకుర్పాణ జరిగింది. స్థానిక గంగినేని సమీపంలోని అమ్మవారి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి డాక్టరు సీకేలావణ్యబాబు, యువనేత సి.కె. సాయికృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పొంగల్‌ నైవేద్యాన్ని సమర్పించారు. అలాగే.. నడివీధి గంగమ్మ తల్లిని ప్రతిష్టించే బజారు వీధిలో ప్రత్యేక పూజలు చేసి, చిత్తూరు నగరంలో జాతర వేడుకలపై దండోరా వేయించారు. కాగా.. ఈనెల 21, 22 తేదీల్లో నడివీధి గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా జరగనుంది. 21న సికే బాబు దంపతులచే తొలి పూజతో గంగ జాతర ప్రారంభం అవుతుంది. 22న పట్టు వస్త్రాల సమర్పణతో అమ్మవారు నిమర్జననికి బయలుదేరుతారు. ఇకపోతే.. జాతర వేడుకలకు చాట్టింపుతో అంకుర్పాణ జరగడంతో... శుక్రవారం నుంచి భక్తులు అమ్మవారి ఆలయాల్లో పొంగళ్లు పెట్టి కార్యక్రమంలో తలమునలై కానున్నారు. జాతర సందర్భంగా పొంగళ్ల పెట్టి భక్తుల కోసం స్థానిక పొన్నియమ్మ దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదేవిధంగా రెండు రోజులు పాటు ఘనంగా జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకలకు బజారు వీధి ఘనంగా ముస్తాబైయ్యింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *